Home /News /business /

INCOME TAX PAYERS CANNOT JOIN IN ATAL PENSION YOJANA SCHEME WITH CENTRAL GOVERNMENTS NEW RULE SS

Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో కొత్త రూల్... వారికి షాక్

Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో కొత్త రూల్... వారికి షాక్
(ప్రతీకాత్మక చిత్రం)

Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో కొత్త రూల్... వారికి షాక్ (ప్రతీకాత్మక చిత్రం)

Atal Pension Yojana | అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరాలనుకునేవారికి షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ పెన్షన్ స్కీమ్‌లో (Pension Scheme) చేరేవారికి కొత్త రూల్ ప్రకటించింది. ఆ రూల్ ప్రకారం అనర్హుల్ని తొలగించనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పాపులర్ పెన్షన్ పథకాల్లో అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana) కూడా ఒకటి. అసంఘటిత రంగంలోనివారికి పెన్షన్ ప్రయోజనాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ ఇది. ఈ పెన్షన్ స్కీమ్‌లో (Pension Scheme) కీలక మార్పు చేసింది కేంద్ర ఆర్థిక శాఖ. పన్ను చెల్లింపుదారులు అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరడానికి అర్హులు కాదని ప్రకటించింది. ఈ కొత్త రూల్ 2022 అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుంది. కేంద్ర ఆర్థిక శాఖ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా ఉంటే 2022 అక్టోబర్ 1 నుంచి అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరలేరు.

ఎవరైనా అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత ఈ స్కీమ్‌లో చేరితే, వారు ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా గుర్తిస్తే వారి అకౌంట్ ఆటోమెటిక్‌గా క్లోజ్ అవుతుంది. చెల్లించిన డబ్బులు రీఫండ్ వస్తాయి. ఇక ఇప్పటికే ఈ స్కీమ్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నట్టైతే వారి అటల్ పెన్షన్ యోజన అకౌంట్ కూడా క్లోజ్ అవుతుంది. జమ చేసిన మొత్తం సబ్‌స్క్రైబర్‌కు తిరిగి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం నిత్యం ఈ పథకాన్ని సమీక్షిస్తూ ఆదాయపు పన్ను చెల్లింపుదారుల్ని అటల్ పెన్షన్ యోజన నుంచి తొలగించనుంది.

SBI Loan: గుడ్ న్యూస్... ప్రాసెసింగ్ ఫీజ్ లేకుండా ఎస్‌బీఐ నుంచి రుణాలు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించినదాని ప్రకారం అటల్ పెన్షన్ యోజన రూల్స్ చూస్తే 18 నుంచి 40 ఏళ్లు ఉన్నవారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. వారికి ఏదైనా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసులో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. కొత్త రూల్ ప్రకారం ఇన్‌కమ్ ట్యాక్స్‌పేయర్స్ ఈ స్కీమ్‌లో చేరలేరు.

అటల్ పెన్షన్ యోజన పథకం 2015 మే 9న ప్రారంభమైంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ఈ పథకాన్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరొచ్చు. 2022 మార్చి నాటికి ఈ స్కీమ్‌లో చేరినవారి సంఖ్య 4.01 కోట్లు దాటింది.

Aadhaar Center: రైల్వే స్టేషన్‌లో ఆధార్ సెంటర్... ఈ సేవలు ఉచితం



ఈ స్కీమ్ లబ్ధిదారులకు 60 ఏళ్ల వయస్సు నుంచి రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ లభిస్తుంది. జమచేసే మొత్తాన్ని బట్టి పెన్షన్ ఆధారపడి ఉంటుంది. లబ్ధిదారుల వయస్సును బట్టి రూ.42 నుంచి రూ.1,454 మధ్య జమ చేయాలి. ఈ పథకంలో చేరిన వ్యక్తి పెన్షన్ తీసుకుంటున్న సమయంలో మరణిస్తే వారి జీవిత భాగస్వామికి పెన్షన్ లభిస్తుంది. ఇద్దరూ మరణిస్తే పెన్షన్ జమ చేసిన మొత్తాన్ని నామినీకి ఇస్తారు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Atal Pension Yojana, Income tax, Personal Finance

తదుపరి వార్తలు