ఇండియాలోని అన్ని కంపెనీలు ఆర్థిక సంవత్సరంలో బిజినెస్ యాక్టివిటీస్ (Business Activities) చేపట్టాయా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా ఐటీ రిటర్న్‌ల (IT Returns)ను దాఖలు చేయాలి. లాభనష్టాలతో సంబంధం లేకుండా కంపెనీలు ఆదాయ పన్ను (Income Tax) ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. భాగస్వామ్య సంస్థలు రిటర్న్‌లను దాఖలు చేసే గడువు తేదీకి ముందే NIL ఆదాయ పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయాలి. అయితే తాజాగా అసెస్‌మెంట్ ఇయర్ 2022-2023కి సంబంధించి పన్ను రిటర్న్‌లను దాఖలు చేసే గడువును ఆర్థికశాఖ (Finance Ministry) ఏడు రోజులు పొడిగించింది.
నవంబర్ 7 వరకు గడువు పెంపు
2022-23 అసెస్‌మెంట్ ఇయర్(Assessment Year)కి సంబంధించి బిజినెసెస్(Businesses) ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి నవంబర్ 7 వరకు కేంద్ర ఆర్థికశాఖ గడువును పొడిగించింది. ఈ మేరకు బుధవారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT- Central Board of Direct Taxes) ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. అకౌంట్స్ ఆడిట్ చేయాల్సిన కంపెనీలు అక్టోబర్ 31 లోపు ఐటీఆర్ ఫైల్ చేయాలని రూల్ ఉంది. అయితే గత నెలలో ఆడిట్ నివేదికలను దాఖలు చేయడానికి గడువును పొడిగించడంతో, ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీని కూడా పొడిగించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ తెలిపింది. అసెస్‌మెంట్ ఇయర్ 2022-23కి సంబంధించి రిటర్న్ ఆఫ్ ఇన్‌కం చట్టంలోని సెక్షన్ 139లోని సబ్-సెక్షన్ (1) ప్రకారం.. గడువు తేదీని 2022 అక్టోబర్ 31 నుంచి 2022 నవంబర్ 7 వరకు పొడిగించింది.
Savings Scheme: మీ డబ్బుల్ని డబుల్ చేసే పొదుపు పథకం ఇది
అక్టోబర్ 31లోపు దాఖలు చేయాలి
దేశీయ కంపెనీలు 2021-22 ఆర్థిక సంవత్సరానికి తమ ఆదాయ పన్ను రిటర్న్‌లను 2022 అక్టోబర్ 31లోపు దాఖలు చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ నిబంధనలకు లోబడి ఉన్న కంపెనీలకు ITR ఫైల్ చేయడానికి గడువును 2022 నవంబర్ 30గా పేర్కొంది. దీనికి సంబంధించి AMRG & అసోసియేట్స్ డైరెక్టర్ (కార్పొరేట్ & ఇంటర్నేషనల్ టాక్స్) ఓం రాజ్‌పురోహిత్ ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎటువంటి అవకతవకలు ఎదురుకాకుండా పండుగ సీజన్‌లో గడువు పొడిగింపు ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు.
గత నెలలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఆడిట్ నివేదికలను దాఖలు చేయడానికి గడువును 7 రోజుల పాటు అక్టోబర్ 7 వరకు పొడిగించిందని తెలిపారు. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయం కంపెనీలకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. కంపెనీలు ఎదురుచూస్తున్నట్లు గడువు పెరిగిందని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Finance minister, Income tax, ITR, ITR Filing