హోమ్ /వార్తలు /బిజినెస్ /

File ITR: ఇక ఆఫీస్ కు వెళ్లి ఐటీఆర్ ఫైల్ చేయక్కర్లేదు .. ఈ యాప్‌లో ఫైల్ చేస్తే బోలెడంత సమయం ఆదా !

File ITR: ఇక ఆఫీస్ కు వెళ్లి ఐటీఆర్ ఫైల్ చేయక్కర్లేదు .. ఈ యాప్‌లో ఫైల్ చేస్తే బోలెడంత సమయం ఆదా !

 ఇక ఆఫీస్ కు వెళ్ళి ఐటీఆర్ ఫైల్ చేయక్కర్లేదు .. ఈ యాప్ ల్లో ఫైల్ చేస్తే బోలెడు సమయం ఆదా!

ఇక ఆఫీస్ కు వెళ్ళి ఐటీఆర్ ఫైల్ చేయక్కర్లేదు .. ఈ యాప్ ల్లో ఫైల్ చేస్తే బోలెడు సమయం ఆదా!

ఆన్‌లైన్ టూల్స్, యాప్‌ల సాయంతో ఐటీఆర్‌ ఫైలింగ్ సులువు అయిపోయింది. 2021-22 సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయడానికి చివరి తేదీ జులై 31, 2022 వరకు ఉంది. ఈ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఉచితంగా ఐటీఆర్‌ ఫైల్ చేయడంలో సహాయపడే కొన్ని యాప్‌లు, వెబ్‌సైట్‌ల వ

ఇంకా చదవండి ...

టెక్నాలజీ (Technology)వినియోగం పెరుగుతున్న కొద్దీ అన్ని రకాల సేవలు సులువుగా అందుతున్నాయి. దాదాపు అన్ని రకాల సేవలను అందించేందుకు యాప్‌లు, వెబ్‌సైట్‌లు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది కష్టంగా భావించే ఐటీఆర్‌ ఫైలింగ్‌ను (ITR Filling) కూడా టెక్నాలజీ సులువుగా మార్చేసింది. అవసరమైన వివరాలను అందించి కొన్ని నిమిషాల్లోనే ఫైలింగ్‌ పూర్తి చేసుకొనే సదుపాయం కల్పిస్తోంది. ఏటా తప్పనిసరిగా ఆదాయపన్ను రిటర్న్(ఐటీఆర్‌-ITR) దాఖలు చేయాలి. అయితే మొదటిసారి ఐటీఆర్‌ ఫైల్‌ చేస్తున్న వారు ఇది కష్టమైన పనిగా భావించవచ్చు. వివరాలు నమోదు చేసే సమయంలో ఏవైనా తప్పిదాలు జరిగితే.. ఇబ్బందులు తప్పవు. కొన్ని సందర్బాల్లో జరిమానా కూడా చెల్లించాల్సి వస్తుంది. అయితే కొన్నేళ్లుగా ఆన్‌లైన్ టూల్స్, యాప్‌ల సాయంతో ఐటీఆర్‌ ఫైలింగ్ సులువు అయిపోయింది. 2021-22 సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయడానికి చివరి తేదీ జులై 31, 2022 వరకు ఉంది. ఈ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఉచితంగా ఐటీఆర్‌ ఫైల్ చేయడంలో సహాయపడే కొన్ని యాప్‌లు, వెబ్‌సైట్‌ల వివరాలు తెలుసుకోండి.

 ఆల్ ఇండియా ఐటీఆర్‌ (All India ITR) యాప్

ఆల్ ఇండియా ఐటీఆర్‌ యాప్(Apps) అనేది గవర్నమెంట్‌ సర్టిఫైడ్ ఇ-ఇంటర్మీడియరీ. ఇది ఐటీఆర్‌ కోసం పూర్తి పేపర్‌లెస్ ప్రాసెస్‌ను అందిస్తుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫారమ్‌లకు యాప్‌ అందుబాటులో ఉంది. ఫారమ్-16 ఇమేజ్‌లు, లేదా PDFలను, ఇతర అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయవచ్చు. సిస్టమ్ ఇన్‌ఫర్మేషన్‌ను ఆటోమేటిక్‌గా రీడ్ చేస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫారమ్‌లు ఆటోమేటిక్‌గా ఫైల్‌ అవుతాయి.

ఈజెడ్‌ట్యాక్స్‌ (EZTax)

ఈజెడ్‌ట్యాక్స్‌ అనేది సెల్ఫ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌(Tax) ఈ ఫైలింగ్‌ పోర్టల్. ఈజెడ్‌ట్యాక్స్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్‌ చేయడం ద్వారా.. 7 నిమిషాలలోపు రిటర్న్‌లను ఫైల్ చేయవచ్చు. పన్నులను ఫైల్ చేయడానికి చెల్లించడానికి, ప్రొఫెషనల్‌ని సంప్రదించడానికి కూడా అవకాశం ఉంది.

ఇదీ చదవండి: Technical Bugs: వామ్మో.. ఆ అమెరికా కంపెనీ సాఫ్ట్ వేర్ లో బగ్.. రెచ్చిపోతున్న హ్యాకర్లు !


 మైత్రెటర్న్ (Myitreturn)

మైత్రెటర్న్ అనేది భారత ఆదాయ పన్ను శాఖలో రిజిస్టర్డ్‌ eRI. ఈ వెబ్‌సైట్‌ ద్వారా 10 నిమిషాలలోపు ITR-V రసీదుని పొందే అవకాశం ఉంది. ఇందులో ఆదాయానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానమివ్వాలి, అవసరమైన పత్రాలు, సమాచారాన్ని అందించాలి. ఫారం-16ని అప్‌లోడ్ చేస్తే.. రిటర్న్ ఆటోమేటిక్‌గా ప్రాసెస్‌ అవుతుంది. రిటర్న్ ఫైల్‌ను త్వరగా రివ్యూ చేసుకోవచ్చు.

ట్యాక్స్‌2విన్‌ (Tax2win)

ట్యాక్స్‌2విన్‌ అనేది మరొక ఇ-ఫైలింగ్ పోర్టల్. ఇందులో ఐటీఆర్‌ని స్వయంగా, ఉచితంగా ఫైల్ చేసే సదుపాయం ఉంది. ఇందుకు వెబ్‌సైట్లో అకౌంట్‌ క్రియేట్‌ చేసి, లాగిన్‌ అవ్వాలి. ఆదాయ వనరులను ఎంచుకోవాలి, అవసరమైన వివరాలను అందించాలి లేదా ఫారం-16ని అప్‌లోడ్ చేయాలి. పాత లేదా కొత్త పన్ను విధానం, ఇ-ఫైల్ ఆదాయ పన్నును ఎంచుకోవాలి. IT డిపార్ట్‌మెంట్ నుంచి నిర్ధారణ కూడా పొందుతారు.

First published:

Tags: Itr deadline, ITR Filing, Tax benefits, Tax payers

ఉత్తమ కథలు