హోమ్ /వార్తలు /బిజినెస్ /

Income Tax: ట్యాక్స్‌ సేవ్ చేయాలంటే? ఈ నిపుణుల సూచలనపై ఓ లుక్కేయండి

Income Tax: ట్యాక్స్‌ సేవ్ చేయాలంటే? ఈ నిపుణుల సూచలనపై ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొత్త పన్ను విధానం కింద సంవత్సరానికి రూ.7 లక్షల వరకు ట్యాక్స్‌ ఎగ్జమ్షన్‌ ప్రకటించారు. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది. అయితే పాత పన్ను విధానం ఉపయోగిస్తేనే ఎక్కువ మొత్తంలో పన్నులను ఆదా చేసుకోవచ్చని ట్యాక్స్ నిపుణులు అంటున్నారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

భారతదేశంలో వ్యక్తులు (Individuals), సంస్థలు తాము సంపాదించిన డబ్బుపై పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఏటా కొత్త మార్పులను తీసుకొస్తుంది. ఇందులో భాగంగా గత నెలలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానం కింద సంవత్సరానికి రూ.7 లక్షల వరకు సంపాదించే వ్యక్తుల (Resident Individuals)కు ట్యాక్స్‌ ఎగ్జమ్షన్‌ ప్రకటించారు. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది. అంటే వచ్చే నెల నుంచి పన్ను చెల్లింపుదారులు తమ పన్నులపై రూ.33,800 ఆదా చేసుకోగలుగుతారు. అయితే పాత పన్ను విధానం ఉపయోగిస్తేనే ఎక్కువ మొత్తంలో పన్నులను ఆదా చేసుకోవచ్చని ట్యాక్స్ నిపుణులు అంటున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

పాత పన్నుతో వారికి ఎక్కువ బెనిఫిట్స్

ప్రస్తుతం, పాత పన్ను విధానంలో వేతన జీవులు రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు, కుటుంబ పెన్షనర్లు రూ.15,000 వరకు డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు. కొత్త పన్ను విధానంలో కూడా ఈ డిడక్షన్‌లు అనుమతించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అయితే కొన్ని పెట్టుబడులు, ఖర్చులపై మినహాయింపులను అందించే పాత పన్ను విధానం, అద్దె చెల్లించే లేదా గృహ రుణం ఉన్న పన్ను చెల్లింపుదారులకు ఇప్పటికీ మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

పాత పన్ను విధానంలో, 0% నుంచి 30% వరకు ఏడు ఆదాయ పన్ను శ్లాబ్‌లు ఉంటాయి. రూ.2.5 లక్షల వరకు సంపాదిస్తున్న వారికి పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. రూ.2.5- రూ.15 లక్షల మధ్య ఆదాయం సంపాదించేవారు 5% నుంచి 30% వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక కొత్త పన్ను విధానంలో ఐదు ఆదాయ పన్ను శ్లాబ్‌లు ఉన్నాయి. దీనిలో పన్ను రేట్లు 0% నుంచి 30% వరకు ఉంటాయి. ఏడాదికి రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్న వారికి ఎగ్జమ్షన్‌ ఉంటుంది. రూ.3- రూ.15 లక్షల మధ్య ఉన్న ఆదాయంపై పన్ను రేట్లు 5% నుంచి 30% వరకు పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే ఏప్రిల్ ఒకటి నుంచి రూ.7 లక్షల వరకు ఆదాయానికి పన్ను రాయితీ అందుబాటులో ఉంటుంది, దీని వల్ల కట్టాల్సిన పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది.

పాత పన్ను విధానంతో ఇలా ట్యాక్స్ సేవ్!

నిపుణుల ప్రకారం, పాత పన్ను విధానంలో ఆదాయపు పన్ను చట్టానికి లోబడి పన్ను మినహాయింపుల ప్రయోజనాన్ని పొందొచ్చు. PPF, ELSS, NSC, SCSS వంటి ట్యాక్స్ సేవింగ్ పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా కట్టాల్సిన పన్నును తగ్గించుకోవచ్చు. గృహ రుణం ఉంటే.. దానికి కడుతున్న వడ్డీ, అసలు మొత్తానికి పన్ను మినహాయింపులను పొందవచ్చు.

ఐటీ చట్టంలోని సెక్షన్ 80C అనేది పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి అనేక మినహాయింపులను అందిస్తుంది. ఈ మినహాయింపులలో PPF, ELSS, NSC, SCSS, జీవిత బీమా ప్రీమియంల వంటి పెట్టుబడులు ఉన్నాయి. ఎడ్యుకేషన్ లోన్‌లపై చెల్లించిన వడ్డీ, తిరిగి చెల్లించిన అసలు రెండింటికీ పన్ను మినహాయింపులను పొందవచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) వంటి పెన్షన్ ఫండ్‌కి డబ్బులు చెల్లించడం ద్వారా కంట్రిబ్యూషన్లు, మెచ్యూరిటీ రాబడిపై కూడా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. అలానే హెల్త్/మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ల పై పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఇంకా పాత పన్ను నిర్మాణాన్ని సరిదిద్దడం వల్ల మధ్యతరగతి వారు మరిన్ని డబ్బులు ఆదా చేసుకోగలుగుతారు. కొత్త, పాత పన్ను విధానాలలో దేన్నీ ఎంచుకోవాలో తెలియకపోతే ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.

First published:

Tags: Income tax, Taxes

ఉత్తమ కథలు