Tax Guide : పన్ను పరిధిలోకి వచ్చేవారు ఏటా కచ్చితంగా ఐటీఆర్ ఫైల్(ITR File) చేయాలి. దాదాపు అందరూ పన్ను ఎలా తగ్గించుకోవచ్చనే మార్గాలను అన్వేషిస్తారు. నిపుణుల సలహాలతో ట్యాక్స్ సేవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే ట్యాక్స్ రిటర్న్‌లో పెన్షన్ ఇన్‌కమ్‌ను శాలరీ ఇన్‌కమ్‌గా పరిగణిస్తారు. దీనిపై వర్తించే శ్లాబ్ రేటు ప్రకారం పన్ను విధిస్తారు. సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు మాజీ యజమాని లేదా ప్రభుత్వంలో ఎవరి నుంచి పెన్షన్ ఇన్‌కమ్ అందుతుందనే దానిపై పన్ను ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లు ITRలో పెన్షన్ ఇన్‌కమ్‌ని ఎలా డిక్లేర్ చేయాలో తెలుసుకుందాం.
మాజీ యజమాని నుంచి పెన్షన్ పొందితే, ఇన్‌కమ్ ఫ్రమ్ శాలరీగా పరిగణించి ట్యాక్స్ విధిస్తారు. ప్రభుత్వ పెన్షన్ అయితే ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్‌గా పరిగణించి ట్యాక్స్ విధిస్తారు. పెన్షన్ రూపంలో రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ పొందితే, అందుకున్న మొత్తంపై పన్ను విధిస్తారని అరిహంత్ క్యాపిటల్, జాయింట్ MD, CA అర్పిత్ జైన్ ‘లైవ్ మింట్’ న్యూస్ పోర్టల్‌తో చెప్పారు. దీన్ని ఆదాయ పన్ను రిటర్న్ (ITR)లో తప్పనిసరిగా పేర్కొనాలని తెలిపారు.
* వివిధ రకాల పెన్షన్ ఇన్‌కమ్‌పై ట్యాక్స్
- ప్రైవేట్ సెక్టార్ పెన్షన్
ప్రైవేట్ కంపెనీల నుంచి పొందే పెన్షన్ కూడా పన్ను పరిధిలోకి వస్తుంది. దీన్ని ఐటీఆర్‌లో ఇన్‌కమ్ ఫ్రమ్ శాలరీ కింద పేర్కొంటారు. యజమాని పెన్షన్ ఇన్‌కమ్‌పై TDSని తీసివేస్తారు. పన్ను చెల్లింపుదారు తప్పనిసరిగా TDSని సరిదిద్దాలి, దానికి అనుగుణంగా ITRని ఫైల్ చేయాలి.
- ఫ్యామిలీ పెన్షన్
పెన్షన్ తీసుకుంటూ మరణించిన వ్యక్తి చట్టబద్ధమైన వారసులు ఫ్యామిలీ పెన్షన్ పొందుతారు. దీన్ని ఐటీఆర్‌లో ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ విభాగం కింద పేర్కొంటారు. సంబంధిత వ్యక్తికి వర్తించే ఆదాయ పన్ను శ్లాబ్ రేటు ఆధారంగా ఫ్యామిలీ పెన్షన్ ట్యాక్స్ ఉంటుంది.
- ప్రభుత్వ పెన్షన్
కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందే పెన్షన్‌ను ITRలో శాలరీ కింద పేర్కొంటారు. దీనిపై పన్ను విధిస్తారు.
- కమ్యూటెడ్ పెన్షన్, అన్‌కమ్యూటెడ్ పెన్షన్
పెన్షనర్లు కమ్యూటెడ్ పెన్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు, ప్రతి సంవత్సరం ఒకేసారి ఏకమొత్తంగా పెన్షన్ మొత్తాన్ని అందుకోవచ్చు. లేదా నెలవారీగా(అన్‌కమ్యూటెడ్) పొందవచ్చు. అన్‌కమ్యూటెడ్ పెన్షన్‌లు శాలరీ తరహాలో పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తాయి.ప్రభుత్వ ఉద్యోగి కమ్యూటెడ్ పెన్షన్ పూర్తిగా పన్ను నుంచి ఎగ్జమ్షన్ పొందుతుంది. ప్రభుత్వేతర ఉద్యోగులకు కమ్యూటెడ్ పెన్షన్ గ్రాట్యుటీని పొందిందా లేదా అనేదానిపై ఆధారపడి పార్షియల్ ఎగ్జమ్షన్ లభిస్తుంది.
పెన్షన్‌తోపాటు గ్రాట్యుటీ కూడా పొందితే, 100% పెన్షన్ కమ్యూట్ అయితే ఈ పెన్షన్ మొత్తంలో 1/3 వంతును మినహాయించి, మిగిలిన మొత్తంపై శాలరీ తరహాలో పన్ను విధిస్తారు. పెన్షన్ మాత్రమే పొందితే, 100% పెన్షన్ కమ్యూట్ అయితే, పెన్షన్ మొత్తంలో సగానికి మినహాయింపు ఉంటుంది.
* పెన్షన్ ఇన్‌కమ్‌పై పన్ను ఎలా తగ్గించాలి?
- 80 DDB డిడక్షన్
80 DDB కింద ఒక నిర్దిష్ట వ్యాధి (క్యాన్సర్, AIDS, న్యూరోలాజికల్ డిజెబిలిటీ మొదలైనవి)తో బాధపడుతున్న వారు, రూ.1,00,000 వరకు డిడక్షన్ పొందవచ్చు. సదరు వ్యక్తిపై ఆధారపడ్డ బిడ్డ, జీవిత భాగస్వామి, తోబుట్టువులు, తల్లిదండ్రులు కూడా అర్హులు.
Pay Per Road Use: కొత్త టోల్ పాలసీ..రోడ్డుపై ఎంత దూరం ప్రయాణిస్తే ఆ మేరకు టోల్ కట్టాలంట!
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్)లలో ఇన్వెస్ట్ చేస్తే, ITAలోని సెక్షన్ 80C కింద సంవత్సరానికి రూ.1,50,000 డిడక్షన్ పొందవచ్చు. వీటిలోకి సిటిజన్స్ సేవింగ్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్, గవర్నమెంట్ బాండ్స్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, క్వాలిఫైడ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటివి వస్తాయి.
- సెక్షన్ 80 D
ఇది సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమా ప్లాన్‌పై చెల్లించే ప్రీమియంపై ఒక సంవత్సరంలో గరిష్టంగా రూ.50,000 వరకు డిడక్షన్ అందిస్తుంది.
- సెక్షన్ 80 TTB
సీనియర్, సూపర్ సీనియర్ సిటిజన్‌లు సెక్షన్ 80TTB కింద రూ.50,000 వరకు డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు. బ్యాంక్, పోస్టాఫీసు లేదా కోఆపరేటివ్ సొసైటీలో ఉంచిన డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఇన్‌కమ్‌పై ఈ డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు.
* ITRలో పెన్షన్ ఇన్‌కమ్ ఎలా పేర్కొనాలి?
- ముందు పెన్షన్ ఇన్‌కమ్ ఏ రకంలోకి వస్తుంది, ఎంత పన్ను చెల్లించాలనేది తెలుసుకోవాలి. తర్వాత ఫారం 16 లేదా ఫారం 16A తీసుకోవాలి. ఇందులో పెన్షన్ ఇన్‌కమ్‌పై తీసివేసిన TDS వివరాలు ఉంటాయి.
- తర్వాత మొత్తం పన్ను చెల్లించాల్సిన పెన్షన్ ఇన్‌కమ్ లెక్కించాలి. దానిని ఇన్‌కమ్‌కి యాడ్ చేయాలి. పన్ను లెక్కించడానికి తగిన ఆదాయ పన్ను శ్లాబ్ రేట్లను అనుసరించాలి.
- చెల్లించాల్సిన పన్నుతో TDSని సరిచేయడానికి ఫారం 26AS ఉపయోగించాలి. ITR ఫారంలోని సంబంధిత విభాగంలో (ITR 1 లేదా ITR 2) వివరాలను పేర్కొనాలి. గడువు తేదీలోపు రిటర్న్‌ను ఫైల్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Income tax, Tax returns