ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్: 10 లాభాలు

మీరు ఆదాయపు పన్ను పరిధిలోకి రారా? అయినా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ ఫైల్ చేయడం వల్ల చాలా లాభాలున్నాయి. అందులో 10 లభాలేంటో తెలుసుకోండి. ఆగస్ట్ 31లో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ ఫైల్ చేయండి.

news18-telugu
Updated: August 29, 2018, 4:45 PM IST
ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్: 10 లాభాలు
మీరు ఆదాయపు పన్ను పరిధిలోకి రారా? అయినా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ ఫైల్ చేయడం వల్ల చాలా లాభాలున్నాయి. అందులో 10 లభాలేంటో తెలుసుకోండి. ఆగస్ట్ 31లో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ ఫైల్ చేయండి.
  • Share this:
తమ వేతనాలు ఆదాయపు పన్ను పరిధిలోకి రావని చాలామంది ఉద్యోగులు అనుకుంటారు. తాము ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ ఫైల్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి లేదా మరే ఆదాయం వస్తున్నా ఐటీఆర్ ఫైల్ చేయాలి. వచ్చిన ఆదాయమెంత? కట్టిన పన్నులెంత? అన్న లెక్కలు ఐటీఆర్‌లో చూపించడం మంచి పౌరుడి లక్షణమని అంటుంటారు నిపుణులు. అందుకే ఆదాయపు పన్ను పరిధిలోకి రాకపోయినా ఐటీఆర్ ఫైల్ చేయాలని చెబుతుంటారు.

పన్ను పరిధిలోకి రాకపోయినా ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల లాభాలు

1. ఐటీఆర్ రసీదు ఉండటం ఫామ్ 16 కన్నా ఎక్కువ ఉపయోగకరం. మీకు ఆదాయం వచ్చే మార్గాలు, పన్నుల వివరాలన్నీ అందులో ఉంటాయి.
2. ఐటీఆర్ రసీదు మీ రిజిస్టర్డ్ అడ్రస్‌కు పంపిస్తారు. ఆ రసీదును నివాస ధృవీకరణ పత్రంగా ఉపయోగించుకోవచ్చు.
3. మీరు బ్యాంకులో హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఆటో లోన్‌లాంటి రుణాలకు దరఖాస్తు చేసినప్పుడు మీ ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్ వివరాల ఆధారంగా మీకు ఆదాయం వచ్చే మార్గాలను బ్యాంకు అధికారులు సులువుగా లెక్కించగలరు.
4. మీరు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే, మీ గత ఆర్థిక సంవత్సరంలోని ఖర్చులు/నష్టాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోకి మార్చుకోలేరు. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం గడువు లోగా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే, నష్టాల వివరాలను భవిష్యత్తు సంవత్సరాలకు మార్చుకోలేరు. అందుకే అలాంటి నష్టాలు భవిష్యత్తులో అడ్జస్ట్ చేసుకోవాలంటే ఐటీఆర్ ఫైల్ చేయడం మంచిది.
5. ఒకవేళ మీరు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఆ ఆలస్యానికి పన్నుపై నెలకు 1% చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు నిర్దిష్ట స్థాయిని మించిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ నుంచి పన్నును తీసివేస్తాయి. ఆ పన్ను రీఫండ్ పొందాలనుకుంటే ఐటీఆర్ అవసరం.

6. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ఐటీఆర్ ఫైల్ చేయకపోతే రూ.10,000 జరిమానా విధిస్తారు. తర్వాతి సంవత్సరాల్లో కూడా ఆ రిమార్క్ అలాగే ఉంటుంది.
7. మీరు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే బ్యాంకులు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ తిరస్కరించే అవకాశముంది.
8. గతంలో ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన కాపీలను వీసా అధికారులు అడిగే అవకాశముంది. యూఎస్, యూకె, కెనెడా లాంటి దౌత్య కార్యాలయాలు ఫారిన్ వీసా అప్లికేషన్‌ ప్రాసెస్‌లో భాగంగా మీ ఐటీఆర్ గురించి పరిశీలించి చూస్తారు.
9. ఎక్కువ మొత్తంలో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే ఇబ్బందులొస్తాయి. మీరు పన్ను ఎగ్గొట్టేవారి జాబితాలో ఉన్నారన్న అనుమానం వస్తే మీకు ఎక్కువ మొత్తంలో జీవిత బీమా ఇవ్వరు.
10. ఫ్రీ లాన్సర్, స్వయం ఉపాధి పొందుతున్నవారికి ఫామ్16 ఉండదు. అలాంటివారికి ఐటీఆర్ ఫైల్ చేయడం చాలా ముఖ్యం. వారి దగ్గర ఉండే ఒకే డాక్యుమెంట్ ఇది. లేకపోతే లోన్లు, ఇతర లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

సో... ఈ లాభాలు ఉంటాయి కాబట్టి మీరు పన్ను పరిధిలోకి రాకపోయినా ఐటీ రిటర్న్స్‌ ఫైల్ చేయడం మీకే ఉపయోగకరం. ఆగస్ట్ 31 వరకు గడువు ఉంది కాబట్టి టెన్షన్ పడకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయండి.

ఇవి కూడా చదవండి:

#జర భద్రం: ఐటీఆర్ రీఫండ్ మెసేజ్ వచ్చిందా?

ఆదాయపు పన్ను తగ్గించుకోవాలా? ఇలా చేయండి!

ఐటీ రిటర్న్స్‌: ఈ 10 టిప్స్ మీకోసమే!

ఐటీ రిటర్న్స్‌ ఫైల్ చేస్తున్నారా? ఇది మీకోసమే!

Photos: ఐటీ రిటర్న్స్‌ ఫైల్ చేస్తున్నారా? ఈ 5 మర్చిపోకండి!
Published by: Santhosh Kumar S
First published: August 29, 2018, 4:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading