Home /News /business /

INCOME TAX DEPARTMENT WILL TAX UP TO 83 PER CENT FOR UNEXPLAINED CASH IN YOUR BANK ACCOUNT SS

Tax Rules: మీ దగ్గరున్న డబ్బుకు లెక్కలు లేవా? ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుసా?

Tax Rules: మీ దగ్గరున్న డబ్బుకు లెక్కలు లేవా? ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుసా?

Tax Rules: మీ దగ్గరున్న డబ్బుకు లెక్కలు లేవా? ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుసా?

Income Tax | మీ దగ్గర ఉన్న డబ్బుకు ఆదాయపు పన్ను శాఖకు లెక్కలు చూపించట్లేదా? అయితే చిక్కులో పడతారు జాగ్రత్త.

    మీ దగ్గర ఎంత డబ్బుంది? బ్యాంకులో ఎంతుంది? ఇంట్లో నగదు ఎంతుంది? అసలు ఆ మొత్తం డబ్బుకు లెక్కలు ఉన్నాయా? సరైన లెక్కలు లేకపోతే భారీగా ట్యాక్స్ చెల్లించాల్సిందే. అవును... ఆదాయపు పన్ను చట్టంలో అనేక సెక్షన్స్ ఉంటాయి. మీ దగ్గరున్న నగదు, బంగారం, లాకర్‌లో ఉన్న మొత్తం, మీ పెట్టుబడులు ఇలా ప్రతీదానికీ ఓ లెక్క ఉండాలి. లేకపోతే చిక్కులు తప్పవు. మీ జీతం, ప్రాపర్టీ, వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం, క్యాపిటల్ గెయిన్స్, ఇతర మార్గాల ద్వారా వచ్చే డబ్బు... ఇలా ప్రతీదానికి ట్యాక్స్ కట్టాల్సిందే. మీ అకౌంట్‌లో జమ అయ్యే డబ్బుకు పన్ను చెల్లించాల్సిందే. లేదా ఆ డబ్బుకు సంబంధించిన వివరాలు వెల్లడించి పన్ను మినహాయింపులు పొందొచ్చు. ఒకవేళ ఆ డబ్బుకు మీరు లెక్కలు చెప్పకపోతే భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది.

    Govt Scheme: జాబ్ పోయిందా? అయినా సగం జీతం తీసుకోవచ్చు... అప్లై చేయండిలా

    LIC: ఎల్ఐసీ పాలసీ ప్రీమియం కట్టలేదా? రూ.2,500 వరకు తగ్గింపు పొందండి ఇలా

    ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం గత ఏడాది మీ దగ్గరున్న డబ్బు, బంగారం, నగలు, ఇతర విలువైన వస్తువులను రికార్డుల్లో చూపకపోయినా, దానికి సంబంధించిన సమాచారం వెల్లడించకపోయినా, మీరు ఇచ్చిన వివరాల పట్ట అసెసింగ్ ఆఫీసర్ సంతృప్తిగా లేకపోయినా వాటిని మీ ఆదాయంగా పరిగణించి పన్ను వేస్తుంది ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్. ఇలా లెక్కలు చూపని డబ్బుకు 60% పన్ను + 25% సర్‌ఛార్జ్+ 6% పెనాల్టీ కలిపి మొత్తం 83.25% చెల్లించాలి. ఇలా లెక్కలు చూపని నగదును మీ ఆదాయంగా పరిగణిస్తుంది ఆదాయపు పన్ను శాఖ. ట్యాక్స్ శ్లాబ్‌తో సంబంధం లేకుండా 60% పన్ను, 25% సర్‌ఛార్జ్, 6% పెనాల్టీ వసూలు చేస్తుంది.

    Jan Dhan Account: జన్ ధన్ ఖాతాదారులకు ఈ ఇన్స్యూరెన్స్ ఉందని మీకు తెలుసా?

    Term Insurance: 30 ఏళ్ల లోపే టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే లాభమిదే

    మీరు లెక్కలు చూపని నగదుకు ఎలాంటి మినహాయింపులు, అలెవన్సులు, లాస్‌లు చూపడానికి అవకాశం ఉండదు. దాన్ని మీ ఆదాయంగానే ఆదాయపు పన్ను శాఖ పరిగణిస్తుంది. నగదు మాత్రమే కాదు బంగారం, ఇతర విలువైన వస్తువులపైనా 83.25% ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఆదాయపు పన్ను శాఖ అధికారులు ట్యాక్స్‌పేయర్ వివరణపై సంతృప్తి చెందకపోతే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 68 ప్రకారం 'వివరించని క్యాష్ క్రెడిట్'గా ఎంటర్ చేస్తారు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: BUSINESS NEWS, Income tax, ITR, Personal Finance

    తదుపరి వార్తలు