హోమ్ /వార్తలు /business /

IT department SMS: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా? ఈ మెసేజ్ వస్తే అప్రమత్తం కావాల్సిందే

IT department SMS: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా? ఈ మెసేజ్ వస్తే అప్రమత్తం కావాల్సిందే

IT department SMS | మీకు ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎస్ఎంఎస్‌లో నోటీస్ వచ్చిందా? అయితే అప్రమత్తం కావాల్సిందే. ఏం చేయాలో తెలుసుకోండి.

IT department SMS | మీకు ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎస్ఎంఎస్‌లో నోటీస్ వచ్చిందా? అయితే అప్రమత్తం కావాల్సిందే. ఏం చేయాలో తెలుసుకోండి.

IT department SMS | మీకు ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎస్ఎంఎస్‌లో నోటీస్ వచ్చిందా? అయితే అప్రమత్తం కావాల్సిందే. ఏం చేయాలో తెలుసుకోండి.

    ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ట్యాక్స్ చెల్లింపుదారులు ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి మార్చి 31తో గడువు ముగిసింది. చాలామంది అంతకు ముందు సంవత్సరాలకు సంబంధించిన రివైజ్డ్ రిటర్న్స్, ఇతర చెల్లింపులను చేశారు. ఈ క్రమంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ITR దాఖలు చేసిన వారిలో కొందరికి గత మార్చి 29న ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ మెసేజ్‌లను పంపింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి దాఖలు చేసిన ITRలో లావాదేవీలను పూర్తిగా చూపలేదని SMSలలో ఉంది. రిటర్న్స్‌కు, హై వ్యాల్యూ ట్రాన్సాక్షన్లకు తేడాలు ఉన్నాయని దాంట్లో పేర్కొన్నారు. వీటికి సంబంధించి 2021 మార్చి 31లోపు సవరించిన ITR దాఖలు చేయాలని.. లేదంటే కాంప్లయన్స్ పోర్టల్‌లో క్వైరీకి రిప్లై ఇవ్వాలని IT డిపార్ట్మెంట్ వారిని కోరింది. కొందరు చార్టెడ్ అకౌంటెంట్లు (CA) ఈ వివరాలను ధ్రువీకరించారు.

    ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీని ITRలో ఆదాయంగా చూపించలేదని కొందరికి మార్చి 29న SMSలు వచ్చాయి. సంబంధిత వ్యక్తుల ఆదాయంలో మిస్ మ్యాచ్‌లపై ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వివరణ కోరింది. కానీ దీనికి సమాధానం ఇవ్వడానికి, సవరించిన రిటర్న్ దాఖలు చేయడానికి మార్చి 31 చివరి తేదీగా ఉంది. దీంతో FDలపై వడ్డీకి సంబంధించి బ్యాంకు నుంచి సమాచారం సేకరించడానికి, సవరించిన రిటర్న్ సిద్ధం చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నామని కొందరు CAలు, ట్యాక్స్ చెల్లింపుదారులు తెలిపారు.

    Special Trains: తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు... 66 స్పెషల్ ట్రైన్స్ జాబితా ఇదే

    IRCTC Shimla Tour: షిమ్లాకు హనీమూన్ వెళ్లాలా? హైదరాబాద్ ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే

    వదిలేసిన చెల్లింపుదారులు

    CAలు ఎలాగోలా కష్టపడి తమ క్లయింట్ల తరఫున తుది గడువు లోపు రిటర్న్ దాఖలు చేయగలిగారు. కానీ నిపుణుల సాయం తీసుకోకుండా సొంతంగా రిటర్న్ సమర్పించిన వారు మాత్రం ఈ వివరాలపై అవగాహన లేక అలాగే వదిలేశారు. ఫిక్సిడ్ డిపాజిట్లు, సేవింగ్ అకౌంట్లు, డిబెంచర్లు, బాండ్లపై వడ్డీకి సంబంధించిన ఆదాయాన్ని రిటర్న్స్‌లో చూపే విషయంపై చాలామందికి మెసేజ్‌లు వచ్చాయి.

    వారికి మాత్రమే నోటీసులు

    సాధారణంగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు వంటి ఆర్థిక సంస్థలు, బ్యాంకులు నిర్ధిష్ట పరిమితికి మించి ఉండే లావాదేవీల సమాచారాన్ని ఇన్‌కం ట్యాక్స్ విభాగానికి పంపాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ చెల్లింపుదారుడు అన్ని బ్యాంకు అకౌంట్ల నుంచి రూ.10,000 వరకు ఆర్జించిన వడ్డీకి ట్యాక్స్‌ నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ ఈ వివరాలను ట్యాక్స్ పేయర్లు ఐటీఆర్‌లో వెల్లడించాల్సి ఉంటుంది. ఒకవేళ వారు ఈ వివరాలను ITRలో తెలపకపోతే.. డిపార్ట్మెంట్ నుంచి నోటీసు వచ్చే అవకాశం ఉంది. FDల ద్వారా వడ్డీ ఆదాయం ఉండి... ఈ వివరాలను ITRలో చూపించని వారికి అధికారులు ఇటీవల SMSలు పంపారు.

    PAN Aadhaar Link Status: మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ అయిందా? ఒక్క నిమిషంలో తెలుసుకోండిలా

    Mashak Rakshak Policy: దోమల కారణంగా అనారోగ్యం పాలవుతున్నారా? రేపటి నుంచి ప్రత్యేక హెల్త్ పాలసీ

    నిపుణుల సలహా ఏంటి?

    హోలీ పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉండటం, ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మార్చి 31న సాధారణ కార్యకలాపాలు జరగకపోవడంతో SMSలు అందుకున్నవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్థిక నిపుణుల సాయం లేకుండా రిటర్న్స్ దాఖలు చేసి, ఇలా మెసేజ్‌లు అందుకున్న ట్యాక్స్ పేయర్లు తుది గడువు లోపు సవరించిన రిటర్న్స్ దాఖలు చేయలేకపోయారు. దీంతో తమకు అధికారులు చట్ట ప్రకారం ఎలాంటి శిక్ష విధిస్తారోనని వీరు ఆందోళన చెందుతున్నారు. సవరించిన రిటర్న్ దాఖలు చేయలేకపోయిన వారు... తమ ITR, వాస్తవ ఆదాయంలో ఏదైనా మిస్ మ్యాచ్ ఉందో లేదో తెలుసుకోవడానికి బ్యాంకు స్టేట్‌మెంట్, ఇతర డాక్యుమెంట్లను తనిఖీ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంట్లో అసమానతలు గుర్తించినా లేదా ఎలాంటి అసమానతలు లేకపోయినా.. ఈ వివరాలను కాంప్లయన్స్ పోర్టల్‌లో రిప్లై ఇవ్వాలని వారికి CAలు సూచిస్తున్నారు.

    First published:

    ఉత్తమ కథలు