ITR: ఐటీఆర్ ఫైల్ చేశారా? రీఫండ్ పేరుతో మోసాలు
ITR Refund Phishing | మీ వివరాలన్నీ అప్డేట్ చేస్తే రీఫండ్ వస్తుందని నమ్మిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్రెడిట్, డెబిట్ కార్డ్ నెంబర్లు పిన్, ఓటీపీ, పాస్వర్డ్ తెలుసుకొని అకౌంట్ ఖాళీ చేస్తున్నారు.
news18-telugu
Updated: September 9, 2019, 11:10 AM IST

ITR: ఐటీఆర్ ఫైల్ చేశారా? రీఫండ్ పేరుతో మోసాలు (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: September 9, 2019, 11:10 AM IST
మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా? రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా? రీఫండ్ రాకముందే వివరాలు అప్డేట్ చేయాలని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏదైనా మెసేజ్ లేదా ఇమెయిల్ వచ్చిందా? అయితే జాగ్రత్త. ఆ మెసేజ్, ఇమెయిల్ సైబర్ ఛీటర్ల నుంచి వచ్చింది కావచ్చు. ఇటీవల సైబర్ నేరగాళ్లు ఇలాంటి ఫిషింగ్ ఇమెయిల్స్ పంపి మోసాలు చేస్తున్నారు. మీ ఐటీఆర్ ఇ-వెరిఫై చేయాలని, బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్డేట్ చేయాలని, ఆధార్ నెంబర్ మళ్లీ ఎంటర్ చేయాలని మెయిల్స్ పంపిస్తున్నారు. వాటిని నమ్మి అనేక మంది మోసపోతున్నారు. చాలావరకు ట్యాక్స్ రీఫండ్ పేరుతోనే ఈ మోసాలు జరుగుతున్నాయి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినవాళ్లలో చాలామంది రీఫండ్ కోసం ఎదురుచూస్తుంటారు. మోసగాళ్లు దీన్నే క్యాష్ చేసుకుంటున్నారు. రీఫండ్ పేరుతో వల వేస్తున్నారు. మీ వివరాలన్నీ అప్డేట్ చేస్తే రీఫండ్ వస్తుందని నమ్మిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్రెడిట్, డెబిట్ కార్డ్ నెంబర్లు పిన్, ఓటీపీ, పాస్వర్డ్ తెలుసుకొని అకౌంట్ ఖాళీ చేస్తున్నారు.
ఆదాయపు పన్ను శాఖ ట్యాక్స్ రీఫండ్ కోసం క్రెడిట్ కార్డ్ వివరాలు, పిన్, ఓటీపీ, పాస్వర్డ్ లాంటివి ఏవీ అడగదన్న విషయం గుర్తుంచుకోవాలి. అందుకే పన్ను చెల్లింపుదారులు ఇలాంటి ఎస్ఎంఎస్లు, ఇమెయిల్స్ ఏవీ పట్టించుకోవద్దు. ఆ వెబ్సైట్ డొమైన్స్ చెక్ చేస్తే అవి నకిలీ ఇమెయిల్స్ అని సులువుగా గుర్తించవచ్చు. ఎవరైనా ఫోన్ చేసి ఇలాంటి వివరాలు అడిగినా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కువగా ఇలాంటి ఫిషింగ్ ఇమెయిల్స్ వస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ చేయొచ్చు. మీకు వచ్చిన ఇమెయిల్స్‌ని webmanager@incometax.gov.in అడ్రస్‌కు ఫార్వర్డ్ చేసి ఫిర్యాదు చేయాలి. ఓ కాపీని incident@cert-in.org.in ఇమెయిల్ ఐడీకి కూడా పంపాలి.
అదిరిపోయే ఫీచర్లతో రిలీజైన వివో జెడ్1ఎక్స్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Aadhaar: ఆధార్ సేవల కోసం ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుకింగ్ ఇలా...
Atal Pension Yojana: అకౌంట్లో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం... రాకపోతే కంప్లైంట్ చేయండి JioFiber: రూ.699 నుంచి జియోఫైబర్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
ఆదాయపు పన్ను శాఖ ట్యాక్స్ రీఫండ్ కోసం క్రెడిట్ కార్డ్ వివరాలు, పిన్, ఓటీపీ, పాస్వర్డ్ లాంటివి ఏవీ అడగదన్న విషయం గుర్తుంచుకోవాలి. అందుకే పన్ను చెల్లింపుదారులు ఇలాంటి ఎస్ఎంఎస్లు, ఇమెయిల్స్ ఏవీ పట్టించుకోవద్దు. ఆ వెబ్సైట్ డొమైన్స్ చెక్ చేస్తే అవి నకిలీ ఇమెయిల్స్ అని సులువుగా గుర్తించవచ్చు. ఎవరైనా ఫోన్ చేసి ఇలాంటి వివరాలు అడిగినా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కువగా ఇలాంటి ఫిషింగ్ ఇమెయిల్స్ వస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ చేయొచ్చు. మీకు వచ్చిన ఇమెయిల్స్‌ని webmanager@incometax.gov.in అడ్రస్‌కు ఫార్వర్డ్ చేసి ఫిర్యాదు చేయాలి. ఓ కాపీని incident@cert-in.org.in ఇమెయిల్ ఐడీకి కూడా పంపాలి.
అదిరిపోయే ఫీచర్లతో రిలీజైన వివో జెడ్1ఎక్స్... ఎలా ఉందో చూడండి
మహిళ సజీవ దహనం కేసులో వ్యక్తికి జీవితఖైదు...
SBI Warning: కస్టమర్లకు ఎస్బీఐ జారీ చేసిన హెచ్చరికలివే
గిఫ్ట్స్ ఇస్తామంటూ... విశాఖవాసుల్ని ముంచుతున్న ముఠా గుట్టురట్టు
వాట్సాప్‌లో వీడియో ఫైల్స్ క్లిక్ చేస్తే... టోటల్ స్మాష్...
ISRO: షాక్... చంద్రయాన్ 2 ప్రయోగం సమయంలో ఇస్రోను టార్గెట్ చేసిన నార్త్ కొరియన్ హ్యాకర్లు
ప్రియాంక గాంధీ ఫోన్ హ్యాక్...వాట్సప్ స్పై వేర్ పనే అంటున్న నిపుణులు
Aadhaar: ఆధార్ సేవల కోసం ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుకింగ్ ఇలా...
Atal Pension Yojana: అకౌంట్లో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం... రాకపోతే కంప్లైంట్ చేయండి
Loading...
Loading...