మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? అయితే అలర్ట్. కొద్ది రోజుల్లో మీ పాన్ కార్డ్ (PAN Card) పనిచేయకపోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది. పాన్ కార్డ్ ఉన్నవారంతా తమ ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాల్సిందే. పాన్ ఆధార్ లింక్ (PAN Aadhaar Link) చేయడానికి 2023 మార్చి 31 చివరి తేదీ. అప్పట్లోగా పాన్ నెంబర్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే 2023 ఏప్రిల్ 1 నుంచి మీ దగ్గరున్న పాన్ కార్డ్ పనికిరాని కార్డు ముక్క మాత్రమే. ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన వార్నింగ్ ఇది. ఆదాయపు పన్ను శాఖ సమాచారం ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆధార్ లింక్ చేయని పాన్ నెంబర్లు ఉపయోగించకూడదు.
ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం పాన్ కార్డ్ ఉన్నవారంతా, మినహాయింపు వర్గం కిందకు రాని వారు, తమ పాన్ నెంబర్‌ను ఆధార్‌తో 2023 మార్చి 31 లోగా లింక్ చేయాలని, లింక్ చేయని పాన్ కార్డులు 2023 ఏప్రిల్ 1 నుంచి ఇనాపరేటీవ్ అంటే పనిచేయనిదిగా మారిపోతుందని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇది అర్జెంట్ నోటీస్ అని, ఆలస్యం చేయకూడదని, వెంటనే లింక్ చేయాలని ట్విట్టర్ ద్వారా కోరింది.
EPF Online Passbook: ఈపీఎఫ్ ఆన్‌లైన్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేయండిలా
As per Income-tax Act, 1961, it is mandatory for all PAN holders, who do not fall under the exempt category, to link their PAN with Aadhaar before 31.3.2023. From 1.04.2023, the unlinked PAN shall become inoperative. Urgent Notice. Don’t delay, link it today! pic.twitter.com/h7T6AAeDnc
— Income Tax India (@IncomeTaxIndia) January 17, 2023
ఇప్పటికే పాన్ కార్డ్ ఉన్నవారిలో చాలామంది తమ ఆధార్ నెంబర్‌ను లింక్ చేశారు. అయితే ఇంకా పాన్, ఆధార్ లింక్ చేయాల్సిన వారు ఉన్నారు. పాన్, ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డుల్ని లావాదేవీల కోసం ఉపయోగించడం కుదరదు. పెండింగ్‌లో ఉన్న రీఫండ్స్ నిలిచిపోయే అవకాశం ఉంది. ఏవైనా లోపాలు ఉన్న రిటర్న్స్ విషయంలో పెండింగ్‌లో ఉన్న ప్రొసీడింగ్స్ పూర్తి చేయడం కూడా సాధ్యం కాదు. ఫలితంగా ఎక్కువ రేటుతో పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే మీ పాన్ నెంబర్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయాలి. ఎలా చేయాలో తెలుసుకోండి.
ముందుగా onlineservices.tin.egov-nsdl.com/etaxnew/tdsnontds.jsp వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
CHALLAN NO./ITNS 280 పైన క్లిక్ చేసి Proceed పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత కంపెనీలకు అయితే కార్పొరేట్ ట్యాక్స్, వ్యక్తిగతంగా అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Type of Payment సెక్షన్లో Other Receipts పైన క్లిక్ చేయాలి.
పాన్ కార్డ్ వివరాలు సెలెక్ట్ చేయాలి.
అసెస్‌మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసి అడ్రస్ పూర్తి చేయాలి.
ఆ తర్వాత పేమెంట్ పూర్తి చేయాలి.
SBI Loan: మహిళలకు రూ.20 లక్షల వరకు రుణాలు... మార్చి 31 వరకే
పేమెంట్ ప్రాసెస్ పూర్తైన తర్వాత మీరు చెల్లించిన ఫైన్ వివరాలు 4 నుంచి 5 వర్కింగ్ డేస్‌లో ఆదాయపు పన్ను శాఖ రికార్డ్స్‌లో అప్‌డేట్ అవుతుంది. ఆ తర్వాత ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో పాన్, ఆధార్ లింక్ చేయాలి. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకోండి.
ముందుగా https://www.incometax.gov.in/iec/foportal ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో Link Aadhaar పైన క్లిక్ చేయాలి.
పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
Validate పైన క్లిక్ చేయాలి.
మీ పేమెంట్ వివరాలు వెరిఫై అయినట్టు మెసేజ్ కనిపిస్తుంది.
ఆ తర్వాత Continue పైన క్లిక్ చేయాలి.
ఆధార్ కార్డులో ఉన్నట్టుగా మీ పేరు ఎంటర్ చేయాలి.
మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి Validate చేస్తే మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar Card, AADHAR, PAN, PAN card