Home /News /business /

INCOME TAX DEDUCTION UNDER SECTION 80 D FOR SENIOR CITIZENS EXPLAINED GH VB

IT Deduction For Seniors: సీనియర్ సిటిజన్లకు సెక్షన్ 80డీ కింద లభించే ఆదాయ పన్ను మినహాయింపులు ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆరోగ్య బీమా ప్రీమియంపై సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ట్యాక్స్ డిడక్షన్లను (tax deductions) ఆదాయ పన్ను చట్టం (Income Tax Act) అందిస్తుంది. 60 ఏళ్లు పైబడిన తర్వాత చాలామంది ప్రజలు సొంతంగా ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం(Health insurance policy premium)లు చెల్లిస్తుంటారు.

ఇంకా చదవండి ...
ఆరోగ్య బీమా ప్రీమియంపై సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ట్యాక్స్ డిడక్షన్లను (tax deductions) ఆదాయ పన్ను చట్టం (Income Tax Act) అందిస్తుంది. 60 ఏళ్లు పైబడిన తర్వాత చాలామంది ప్రజలు సొంతంగా ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం(Health insurance policy premium)లు చెల్లిస్తుంటారు. లేదా పిల్లలు తమ వృద్ధాప్య తల్లిదండ్రుల హెల్త్ కవర్ కోసం పేరెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కడుతుంటారు. అయితే వృద్ధాప్యంలో తరచూ మెడికల్ చెకప్ (medical check-up)తో పాటు మెడిసిన్ కొనాల్సిన పరిస్థితి వస్తుంది. వీటికి ఎంతో కొంత డబ్బు ఖర్చు పెట్టక తప్పదు. వీటికి సుమారు రూ. 5 వేలు కూడా ఖర్చు కావచ్చు. ఈ ఖర్చులపై ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80డీ కింద మినహాయింపు పొందవచ్చా? అని అడిగితే... భేషుగ్గా పొందొచ్చని ఆర్థిక నిపుణులు సమాధానమిస్తున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

Budget 2022: త్వరలో కేంద్ర బడ్జెట్.. రూ.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్..?ఆ మినహాయింపులు కూడా ఉంటాయా..?


ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80డీ ప్రకారం... పన్ను చెల్లింపుదారు తన కోసం, తన జీవిత భాగస్వామి, తనపై ఆధారపడిన పిల్లలతో సహా తన కుటుంబానికి చెల్లించిన ఆరోగ్య బీమా ప్రీమియంలపై రూ. 25,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ పొందొచ్చు. అంతేకాదు, తల్లిదండ్రుల కోసం చెల్లించిన ఆరోగ్య బీమా ప్రీమియంలపై అదనంగా రూ.25,000 పన్ను మినహాయింపు పొందొచ్చు. తల్లిదండ్రులు మీపై ఆధారపడి ఉన్నా, లేకపోయినా వారికి మినహాయింపు అందుబాటులో ఉంటుంది. మీరు ఆరోగ్య బీమా ప్రీమియం సీనియర్ సిటిజన్ కోసం చెల్లించినట్లైతే.. పైన పేర్కొన్న ప్రతి ఏజ్ క్యాటగిరీలో యేటా రూ.50,000 పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ మొత్తం పరిమితి అనేది సందర్భానుసారంగా రూ.25,000 లేదా రూ.50,000 విలువైన మినహాయింపుకు మారుతుంటుంది.

అయితే ఈ రెండు మినహాయింపులోనూ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కోసం మీరు ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు. దీని అర్థం మీరు మీ కోసం, మీ కుటుంబం కోసం ప్రీమియం చెల్లిస్తూ ఉంటే.. హెల్త్ చెకప్ కోసం మీరు రూ. 5 వేల పన్ను మినహాయింపు పొందొచ్చు. ఒకవేళ మీరు మీ కుటుంబం, సీనియర్ సిటిజన్లు అయిన మీ తల్లిదండ్రుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు చెల్లిస్తున్నట్లయితే.. హెల్త్ చెకప్ కోసం రూ.5 వేల మినహాయింపు పొందవచ్చు. ఈ విధంగా ఏ ఏజ్ కేటగిరీలనైనా మీరు హెల్త్ చెకప్ కోసం రూ. 5 వేల పన్ను మినహాయింపు పొందేందుకు అర్హత కలిగి ఉంటారు.

Budget 2022: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు ఐటీ కంపెనీల డిమాండ్లు ఇవే...


ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల ప్రకారం, ఆరోగ్య బీమా కింద కవరేజ్ పొందేవారు ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఖర్చులకు మినహాయింపులను పొందవచ్చు. మీరు హెల్త్ చెకప్ చేయించుకున్నా.. దాన్ని ప్రివెంటివ్ హెల్త్ చెకప్ గా పరిగణించి ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, ఈ మినహాయింపు కేవలం హెల్త్ చెకప్ కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మందులు మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులకు పన్ను మినహాయింపు అర్హత సాధించాలంటే కొన్ని షరతులకు లోబడి ఉండాలి. ప్రధానంగా సీనియర్ సిటిజన్‌కు ఎటువంటి ఆరోగ్య బీమా ఉండకూడదు. అలాగే, నగదు రూపంలో కాకుండా వేరే విధంగా మెడిసిన్ కోసం చెల్లింపులు చేసినట్లయితే.. ఈ ఖర్చులకు సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Income tax, TAX SAVING

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు