Income Tax: డెడ్‌లైన్ దగ్గరపడుతోంది... ట్యాక్స్ ఇలా ఆదా చేయొచ్చు

హోమ్ లోన్స్‌కు చెల్లించే ఈఎంఐల పైనా, ఇద్దరు పిల్లలకు చెల్లించే బేసిక్ ట్యూషన్ ఫీజ్ పైనా సెక్షన్ 80సీ కింద మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ మీ పేరు మీద లేదా మీ తల్లిదండ్రులకు మెడికల్ ఇన్సూరెన్స్ చెల్లిస్తున్నట్టయితే సెక్షన్ 80డీ కింద మినహాయింపు పొందొచ్చు.

news18-telugu
Updated: January 23, 2019, 1:27 PM IST
Income Tax: డెడ్‌లైన్ దగ్గరపడుతోంది... ట్యాక్స్ ఇలా ఆదా చేయొచ్చు
Income Tax: డెడ్‌లైన్ దగ్గరపడుతోంది... ట్యాక్స్ ఇలా ఆదా చేయొచ్చు
  • Share this:
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్... వేతనజీవులకు ఉద్యోగం ఇదో పెద్ద సవాల్. ప్రతీ ఏటా ఉండే టెన్షనే. మార్చి దగ్గరపడుతుందంటే చాలు పన్నులు ఆదా చేయడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇన్‌కమ్ ట్యాక్స్‌లో పన్ను మినహాయింపులకు ఉన్న సెక్షన్లు ఏవి? ఆ సెక్షన్ల పరిధిలో ఏమేం ఉన్నాయి? పన్ను ఎలా ఆదా చేయొచ్చు? ఇలా అన్నీ సందేహాలే. పన్ను మినహాయింపుల్ని పొందేందుకు ఉపయోగపడేవి సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ లాంటివి. వీటిని అర్థం చేసుకొని మొదట్నుంచే పెట్టుబడులు పెడితే ఏ ఇబ్బంది ఉండదు. కానీ... డెడ్‌లైన్ సమీపిస్తున్నప్పుడు చాలామంది టెన్షన్ పడుతుంటారు. మరి మీరు కూడా అలాంటి డైలమాలోనే ఉన్నారా? అయితే ఎలా పెట్టుబడి పెట్టాలి? పన్నుల్ని ఎలా ఆదా చేసుకోవాలో తెలుసుకోండి.

ఇది కూడా చదవండి: IRCTC: టికెట్ బుక్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీలో 10 కొత్త ఫీచర్లు ఇవే...

income tax investment ideas, standard deduction 2019, income tax slab for women, income tax statement form 2018-19, current income tax slab, new income tax rules, how to file income tax return online, income tax calculator 2019, ఆదాయపు పన్ను పరిమితి, ఇన్‌కమ్ ట్యాక్స్ సేవింగ్స్పన్ను ఆదా చేయడానికి పెట్టుబడి తప్పనిసరా?



మీరు ఆదాయపు పన్ను పరిమితిని మించి సంపాదిస్తున్నారంటే పన్నులు చెల్లించాల్సిందే. అయితే మీకు ఇచ్చే వేతనంలోనే ఈపీఎఫ్, హెచ్ఆర్ఏ లాంటివి ఉంటాయి. వాటిపై పన్ను మినహాయింపులు ఉంటాయి. ఆ మినహాయింపులు పొందిన తర్వాత కూడా పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే మీరు ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచిది. సెక్షన్ 80సీ కింద మీరు ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. హోమ్ లోన్స్‌కు చెల్లించే ఈఎంఐల పైనా, ఇద్దరు పిల్లలకు చెల్లించే బేసిక్ ట్యూషన్ ఫీజ్ పైనా సెక్షన్ 80సీ కింద మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ మీ పేరు మీద లేదా మీ తల్లిదండ్రులకు మెడికల్ ఇన్సూరెన్స్ చెల్లిస్తున్నట్టయితే సెక్షన్ 80డీ కింద మినహాయింపు పొందొచ్చు. పనిచేసే సంస్థ యాజమాన్యం ఇచ్చే గ్రూప్ మెడికల్ పాలసీతో పాటు అదనంగా ప్రీమియం చెల్లించి కవరేజీ పెంచుకోవడం కూడా మంచి ఆలోచనే.



ఇది కూడా చదవండి: Budget 2019: వేతనజీవులకు ఊరట, ఆదాయపు పన్ను భారం తగ్గే అవకాశం

income tax investment ideas, standard deduction 2019, income tax slab for women, income tax statement form 2018-19, current income tax slab, new income tax rules, how to file income tax return online, income tax calculator 2019, ఆదాయపు పన్ను పరిమితి, ఇన్‌కమ్ ట్యాక్స్ సేవింగ్స్ట్యాక్స్ సేవింగ్ కోసం పెట్టుబడి పెట్టే సమయంలో తప్పులు చేయొద్దు


పన్ను ఆదా చేయాలనుకొని ఏదో ఓ స్కీమ్‌లో డబ్బులు చెల్లించడం సరైన పద్ధతి కాదు. పన్ను ఆదా చేయడం మీ లక్ష్యమే అయినా మీరు ఎంచుకునే స్కీమ్ మీకు సరైనదిగా ఉండాలి. లేకపోతే ఆ సమయానికి పన్ను ఆదా అవుతుందేమో కానీ తర్వాత చిక్కుల్లో పడాల్సి వస్తుంది. పన్ను ఆదాను దృష్టిలో పెట్టుకోవడమే కాదు, మీరు ఎంచుకునే పెట్టుబడి పథకం భవిష్యత్తులో మీకు ఉపయోగపడేలా ఉండాలి.
Loading...
ఇది కూడా చదవండి: ఈ యూజర్లు ఇక IRCTC ఉపయోగించుకోలేరు... ఎందుకో తెలుసా?

income tax investment ideas, standard deduction 2019, income tax slab for women, income tax statement form 2018-19, current income tax slab, new income tax rules, how to file income tax return online, income tax calculator 2019, ఆదాయపు పన్ను పరిమితి, ఇన్‌కమ్ ట్యాక్స్ సేవింగ్స్సరైన స్కీమ్స్ ఎంచుకోవాలి


మీరు ఎంచుకునే ఏ స్కీమ్ అయినా దాని గురించి పూర్తిగా అధ్యయనం చేయడం మంచిది. ఎవరో ఏజెంట్ చెప్పారని నమ్మేసి పెట్టుబడులు పెట్టొద్దు. మార్కెట్లో ఉన్న అన్ని పథకాలను పోల్చుకొని పెట్టుబడి పెట్టాలి. కొందరికి ఈక్విటీ ఫండ్స్ నచ్చుతాయి. అలాంటివాళ్లు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. ఇంకొందరు రిస్క్ తీసుకోకుండా ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఉండే వాటిలో పెట్టుబడి పెట్టాలనుకుంటారు. అలాంటివాళ్లు పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ, ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ లాంటివి ఎంచుకోవచ్చు.

ఇది కూడా చదవండి: మొబైల్ బ్యాంకింగ్ చేస్తున్నారా? ఈ 12 టిప్స్ మీ కోసమే

income tax investment ideas, standard deduction 2019, income tax slab for women, income tax statement form 2018-19, current income tax slab, new income tax rules, how to file income tax return online, income tax calculator 2019, ఆదాయపు పన్ను పరిమితి, ఇన్‌కమ్ ట్యాక్స్ సేవింగ్స్ఎన్‌పీఎస్ ఎందుకు మంచిది?


60 ఏళ్లలోపు వాళ్లు నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. వారికి 60 ఏళ్ల తర్వాత ప్రతీ ఏడాది డబ్బులు వస్తాయి. ఆ డబ్బును ఈక్విటీ, కార్పొరేట్, గవర్నమెంట్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెడతారు. 50 ఏళ్ల వరకు ఈక్విటీ గరిష్టంగా 75% వరకు ఉంటుంది. ఎన్‌పీఎస్ ద్వారా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టి సెక్షన్ 80సీ కింద మినహాయింపు పొందొచ్చు. ఇతర పెట్టుబడులు ఎక్కువైపోయినా సెక్షన్ 80సీసీడీ(1బీ) ద్వారా అదనంగా రూ.50,000 క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా? ఎక్కడ ఉందో ఇలా తెలుసుకోవచ్చు

WHATSAPP BUG: వాట్సప్‌లో మీ మెసేజెస్ మాయం... ఎందుకో తెలుసా?
First published: January 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com