HOME »NEWS »BUSINESS »in two years income tax payers to start getting refunds within 24 hours ss

Good News: కేవలం 24 గంటల్లో ఐటీఆర్ రీఫండ్స్

Good News: కేవలం 24 గంటల్లో ఐటీఆర్ రీఫండ్స్
Good News: కేవలం 24 గంటల్లో ఐటీఆర్ రీఫండ్స్

ఐటీ రిటర్న్స్, రీఫండ్స్, స్క్రుటినీ, వెరిఫికేషన్ ప్రక్రియ మొత్తం 24 గంటల్లో పూర్తిచేసేందుకు కావాల్సిన ఐటీ మౌలిక వసతుల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు కేటాయించింది.

  • Share this:
    పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత రోజుల తరబడి రీఫండ్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. కేవలం 24 గంటల్లో ప్రాసెస్ మొత్తం పూర్తై మీ రీఫండ్ మీకు వచ్చేస్తుంది. ఐటీఆర్ ఫైలింగ్, రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేసే వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. ఐటీ రిటర్న్స్, రీఫండ్స్, స్క్రుటినీ, వెరిఫికేషన్ ప్రక్రియ మొత్తం 24 గంటల్లో పూర్తిచేసేందుకు కావాల్సిన ఐటీ మౌలిక వసతుల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు కేటాయించింది. ఈ సిస్టమ్ అప్‌గ్రేడ్ చేసిన తర్వాత 24 గంటల్లో వెరిఫికేషన్, రీఫండ్ సాధ్యమవుతుంది.

    24 గంటల్లో ఐటీఆర్ రీఫండ్స్ అందించే వ్యవస్థను రెండేళ్లలో అమలులోకి తీసుకొస్తామని రెవెన్యూ సెక్రెటరీ అజయ్ భూషణ్ పాండే తెలిపారు. ఇదే విషయాన్ని బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ కూడా ప్రకటించారు. గతేడాది 99.54 శాతం ఐటీ రిటర్న్స్ యాక్సెప్ట్ చేశామని, టెక్నాలజీ సాయంతో అన్ని రిటర్న్స్‌ని ఏకకాలంలో ప్రాసెస్ చేయడం, రీఫండ్ ఇవ్వడం 24 గంటల్లో పూర్తి చేస్తామని పీయూష్ గోయల్ ప్రకటించారు.




    ఇవి కూడా చదవండి:

    మీకు LIC నుంచి SMS వచ్చిందా? రాకపోతే ఇలా చేయండి...

    Shock: పేటీఎం మాల్‌లో ఇక క్యాష్‌బ్యాక్ ఉండదా?
    Published by:Santhosh Kumar S
    First published:February 05, 2019, 18:32 IST

    टॉप स्टोरीज