హోమ్ /వార్తలు /బిజినెస్ /

PPF Calculator: రూ. 417 పెట్టుబడితో.. కోటీశ్వరులు కావొచ్చు.. పీపీఎఫ్‌లో అదిరిపోయే స్కీమ్..!

PPF Calculator: రూ. 417 పెట్టుబడితో.. కోటీశ్వరులు కావొచ్చు.. పీపీఎఫ్‌లో అదిరిపోయే స్కీమ్..!

 పీపీఎఫ్ లో ఈ స్కీమ్ లో రూ. 417 పెట్టుబడితో.. కోటీశ్వరులు కావొచ్చు.. ఎలాగో తెలుసా !

పీపీఎఫ్ లో ఈ స్కీమ్ లో రూ. 417 పెట్టుబడితో.. కోటీశ్వరులు కావొచ్చు.. ఎలాగో తెలుసా !

సేవింగ్స్(Savings) చేయాలని చూసేవారి కోసం ప్రభుత్వం చాలా ఏళ్ల క్రితం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF-Public Provident Fund) స్కీమ్‌ను తీసుకొచ్చింది. రిస్క్‌ తీసుకోవాల్సిన అవసరం లేని ఈ పథకం ద్వారా చిన్న మొత్తాల్లో పొదుపు చేసేవారికి ప్రయోజనాలు అందుతాయి.

ఇంకా చదవండి ...

సేవింగ్స్(Savings) చేయాలని చూసేవారి కోసం ప్రభుత్వం చాలా ఏళ్ల క్రితం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF-Public Provident Fund) స్కీమ్‌ను తీసుకొచ్చింది. రిస్క్‌ తీసుకోవాల్సిన అవసరం లేని ఈ పథకం ద్వారా చిన్న మొత్తాల్లో పొదుపు చేసేవారికి ప్రయోజనాలు అందుతాయి. ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రభుత్వ సపోర్ట్‌ ఉన్న పొదుపు పథకాలలో ఒకటి. ఎగ్జమ్ట్- ఎగ్జమ్ట్- ఎగ్జమ్ట్(EEE) ఫీచర్‌తో పీపీఎఫ్‌ ప్రజలకు ట్యాక్స్‌ ఫ్రీ సేవింగ్స్ఆప్షన్‌ను కల్పిస్తోంది. ఇది పూర్తిగా ట్యాక్స్‌(Tax) ఫ్రీ సేవింగ్స్‌ స్కీమ్‌. ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ సేవింగ్స్ ఇన్స్టిట్యూట్ 1968లో పీపీఎఫ్‌ను లాంచ్‌ చేసింది. అయితే ఇప్పుడు క్రమం తప్పకుండా నెలకు కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేసి 25 ఏళ్లకు కోటీశ్వరులు అవ్వవచ్చని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఆ స్కీమ్‌ వివరాలు ఇవే..

PPF వడ్డీ రేటు, మెచ్యూరిటీ

ప్రస్తుతం, పీపీఎఫ్‌ వార్షికంగా 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. వడ్డీని నెలవారీ ప్రాతిపదికన లెక్కిస్తారు. గైడ్‌లైన్ ప్రకారం.. పెట్టుబడిదారులు తమ డబ్బును తమ పీపీఎఫ్‌ ఖాతాలో వరుసగా 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే 15 సంవత్సరాల చివరిలో డబ్బు అవసరం లేకపోతే, పీపీఎఫ్‌ అకౌంట్ టెన్యూర్‌ను అవసరమైనన్ని సంవత్సరాల పాటు పొడిగించవచ్చు. పీపీఎఫ్‌ ఖాతా పొడిగింపు ఫారమ్‌ను సమర్పించి ఐదేళ్ల పాటు పెంచుకుంటూ పోవచ్చు. పీపీఎఫ్ ఖాతాల్లో సంవత్సరానికి మినిమం రూ.500, మ్యాక్సిమం రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

ఇదీ చదవండి: Income Tax Returns: గడువు లోగా ఐటీఆర్ ఫైల్ చేయలేదా ? అయితే ఎన్ని ప్రయోజనాలు కోల్పోతారో తెలుసా !


రోజుకు రూ.417 ఇన్వెస్ట్‌మెంట్‌తో కోటీశ్వరులు కావచ్చు

మంచి వడ్డీ రాబడి, అధిక జనాదరణ, తక్కువ రిస్క్, ట్యాక్స్‌ ఫ్రీ ఇన్‌కం అందిస్తున్న పీపీఎఫ్‌లో రోజుకు రూ.417 క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేస్తే కోటీశ్వరులు కావచ్చు. పీపీఎఫ్‌లో రోజుకు రూ.417 పెట్టుబడి పెడితే, నెలవారీ పెట్టుబడి విలువ దాదాపు రూ.12,500 వరకు వస్తుంది. అంటే సంవత్సరానికి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో గరిష్ట పరిమితి అయిన రూ.1,50,00 కంటే కొంచెం ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు. 15 సంవత్సరాలలో, కాంట్రిబ్యూట్‌ చేసిన మొత్తం రూ.40.58 లక్షలు అవుతుంది. ఆపై టెన్యూర్‌ను ఐదేళ్ల చొప్పున రెండుసార్లు పొడిగించాలి.

25 ఏళ్ల నుంచి 50 సంవత్సరాల వరకు, అంటే 25 సంవత్సరాల వరకు ఇలా చేస్తే, మెచ్యూరిటీ సమయంలో రూ.1.03 కోట్ల వరకు అందుకోవచ్చు. ఈ మొత్తం పూర్తిగా పన్ను రహితం. మొత్తం వడ్డీ దాదాపు రూ.66 లక్షలు అవుతుంది. 25 ఏళ్లలో డిపాజిట్ చేసిన మొత్తం దాదాపు రూ.37 లక్షలు ఉంటుంది. పెట్టుబడిపై అధిక రాబడిని పొందడానికి ఉత్తమ మార్గం.. నెలవారీ వడ్డీని లెక్కిస్తారు కాబట్టి ప్రతి నెలా 1వ తేదీ నుంచి 5వ తేదీ మధ్య డబ్బును డిపాజిట్ చేయాలి. లేకపోతే వడ్డీ నష్టపోయే అవకాశం ఉంది.

Published by:Mahesh
First published:

Tags: Investment Plans, PPF, Savings, Schemes

ఉత్తమ కథలు