హోమ్ /వార్తలు /బిజినెస్ /

Upcoming SUVs: కొత్త ఏడాదిలో రూ.10 లక్షల లోపు SUV కార్ల సందడి.. వీటిలో అదిరిపోయే ఫీచర్స్‌ వివరాలివే..

Upcoming SUVs: కొత్త ఏడాదిలో రూ.10 లక్షల లోపు SUV కార్ల సందడి.. వీటిలో అదిరిపోయే ఫీచర్స్‌ వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

2023 ఏడాదిలో మారుతి సుజుకి, టయోటా, హ్యుందాయ్ వంటి ప్రముఖ ఆటోమొబైల్​ కంపెనీలు తమ మార్కెట్‌ను విస్తరించుకునేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. సేల్స్‌ను పెంచుకోవడమే లక్ష్యంగా మూడు సరికొత్త సబ్-ఫోర్-మీటర్ SUV కార్లను భారత మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కరోనా తర్వాత ఆటో మొబైల్‌ రంగం వేగంగా కోలుకుంటోంది. అన్ని రకాల కంపెనీలకు భారీ ఆర్డర్‌లు లభిస్తున్నాయి. సేల్స్‌ కూడా మెరుగవుతాయనే ఆశాభావాన్ని కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే 2023 ఏడాదిలో మారుతి సుజుకి, టయోటా, హ్యుందాయ్ వంటి ప్రముఖ ఆటోమొబైల్​ కంపెనీలు తమ మార్కెట్‌ను విస్తరించుకునేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. సేల్స్‌ను పెంచుకోవడమే లక్ష్యంగా మూడు సరికొత్త సబ్-ఫోర్-మీటర్ SUV కార్లను భారత మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తున్నాయి. ఇటీవల కాంపాక్ట్ SUV సెగ్మెంట్ పెరగడంతో ఆయా కంపెనీలు కస్టమర్లను ఆకర్షించే ప్రణాళికలో ఉన్నాయి. ఫలితంగా మరిన్ని కొత్త మోడల్‌లను విడుదల చేసేందుకు సిద్దమవుతున్నాయి. కొత్త సంవత్సరంలో విడుదలకు సిద్దంగా ఉన్న మూడు SUVలపై ఓ లుక్కేయండి.

* మారుతి సుజుకి బాలెనో క్రాస్ (YTB)

స్వదేశీ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తన లేటెస్ట్​ బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ క్రాస్‌ఓవర్‌ను టెస్ట్​ చేస్తోంది. రాబోయే కొద్ది నెలల్లోనే మారుతి షోరూమ్స్‌లో ఇవి సందడి చేయనున్నాయి. జనవరిలో జరిగే ‘2023 ఆటో ఎక్స్‌పో’లో మారుతి సుజుకి బాలెనో క్రాస్‌ను గ్రాండ్‌గా లాంచ్​ చేసే అవకాశం ఉంది. ఈ SUV 1.0- లీటర్ 3 సిలిండర్ టర్బోఛార్జ్డ్‌ పెట్రోల్ ఇంజిన్ ద్వారా పనిచేస్తుంది. దాదాపు 100 PS గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. డిజైన్​ ఫీచర్ల పరంగా చూస్తే, ఈ కారు తేలికపాటి హార్ట్‌టెక్ ఆర్కిటెక్చర్‌ని కలిగి ఉంటుంది. దీని ఫ్లోటింగ్ తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360- డిగ్రీ కెమెరా సిస్టమ్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌ వంటి ఫీచర్లను అందిస్తుంది.

* టయోటా టైసర్(Toyota Taisor)

మారుతి సుజుకి బాలెనో క్రాస్ బ్యాడ్జ్ ఇంజినీరింగ్ వెర్షన్ 2023 మధ్యలో లేదా రెండవ భాగంలో టయోటా టైసర్ బ్యానర్ కింద లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. టయోటా తన అర్బన్ క్రూయిజర్ కాంపాక్ట్ SUVని ఇటీవల అకారణంగా నిలిపివేసినందున టమోటా గ్లాంజా, టయోటా టైజర్​ కార్లను పోలిన గ్లోబల్ యారిస్ క్రాస్ డిజైన్‌తో ఈ మోడల్ మార్కెట్​లోకి రానుంది. ఇది బాలెనో క్రాస్‌తో సమానమైన ప్లాట్‌ఫారమ్, ఇంజిన్, మెకానికల్ బిట్‌లను కలిగి ఉంటుంది.

Digital Rupee: ఇండియా డిజిటల్ రూపాయి లేదా CBDC అంటే ఏంటి? దీన్ని ఎలా వినియోగించవచ్చో తెలుసుకోండి..

LIC New Plan: రోజుకు రూ.20 లోపు ప్రీమియం... కోటి రూపాయల ఇన్స్యూరెన్స్

* హ్యుందాయ్ మైక్రో SUV(Hyundai Micro SUV)

టాటా పంచ్‌కు పోటీగా హ్యుందాయ్ వచ్చే ఏడాది చివరిలో సరికొత్త మైక్రో SUVని లాంచ్‌ చేసేందుకు సిద్దమవుతోంది. 2023 జనవరిలో నిర్వహించబోయే ‘ఆటో ఎక్స్‌పో’లో దీన్ని కంపెనీ ప్రదర్శించనుంది. ఈ ఎక్స్‌పోలేనే అన్ని హ్యుందాయ్​ మైక్రో SUVకి సంబంధించిన అన్ని వివరాలు తెలియనున్నాయి. అంతేకాదు ఈ కారు ప్రివ్యూ కూడా ఎక్స్‌పోలో చూసే అవకాశం ఉంది. హ్యుందాయ్​ మైక్రో SUV, 5-సీటర్ గ్రాండ్ i10 నియోస్ డిజైన్‌ను పోలి ఉంటుంది. ఈ SUV 1.2 -లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది.

First published:

Tags: SUV

ఉత్తమ కథలు