Home /News /business /

IN MARRIED LIFE TO MEET CERTAIN COMMON GOALS HERE ARE A FEW FINANCIAL PLANNING TIPS FOR COUPLES GH SRD

Couple Financial Tips: భార్యాభర్తల కోసం 5 ఫైనాన్షియల్ ప్లానింగ్ టిప్స్.. దంపతులు చేయాల్సిన, చేయకూడని పనులివే!

ప్రతీకాత్మక చిత్రం ( iStock Images)

ప్రతీకాత్మక చిత్రం ( iStock Images)

Couple Financial Tips: వివాహం చేసుకున్న దంపతుల కోసం ఆర్థిక నిపుణులు 5 ఫైనాన్షియల్ టిప్స్ ఇస్తున్నారు. అవేంటో చూద్దాం.

పెళ్లి అనే అమూల్యమైన బంధంతో ఒకటైన తర్వాత భార్యాభర్తలిద్దరూ సుఖ సంతోషాలతో తమ జీవితాన్ని ప్రారంభిస్తారు. అయితే ఆ బంధం చివరి వరకు సాగాలంటే వారి మధ్య ప్రేమానురాగాలు ఉండటం ఎంత ముఖ్యమో ఆర్థిక స్థిరత్వం ఉండటం కూడా అంతే ముఖ్యం. జంటగా ముందడుగు వేసిన క్షణం నుంచే భార్యాభర్తలిద్దరూ తెలివైన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలి. అలా అయితేనే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. భార్యాభర్తలిద్దరూ వర్క్ చేస్తుంటే.. జీతం విషయంలో పారదర్శకంగా ఉండటం.. ఉమ్మడి ఆర్థిక లక్ష్యాలను ఏర్పరుచుకోవడం ఉత్తమం. వివాహానంతరం జీవనశైలి, పేరెంటింగ్, డబ్బు వంటి సాధారణ అంశాల నిమిత్తం చాలా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వివాహం చేసుకున్న దంపతుల కోసం ఆర్థిక నిపుణులు 5 ఫైనాన్షియల్ టిప్స్ చెప్పారు. అవేంటో చూద్దాం.

1. బడ్జెట్‌ను రూపొందించండి
మీరు ఒంటరిగా ఉన్నా, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా.. మీ ఆర్థిక జీవితానికి నెలవారీ బడ్జెట్‌ను సెట్ చేయడం చాలా ముఖ్యం. దంపతులిరువురు తమకు వచ్చే ఆదాయాన్ని లెక్కగట్టి వాటిని ఎలా ఖర్చు చేయాలో నిర్ణయించుకోవాలి. ప్రతి నెలాకు ఒక నిర్దిష్ట బడ్జెట్‌ను మెయింటెన్ చేయడం ద్వారా ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చు. మీ బడ్జెట్‌ను ట్రాక్ చేయడానికి ఉచిత యాప్‌లను ఉపయోగించొచ్చు. స్వల్ప కాల, మధ్యకాలిక, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం బడ్జెట్‌లను రూపొందించవచ్చు.

2. నికర ఆదాయం, తప్పనిసరి ఖర్చులు
ఆర్థిక లక్ష్యాలను రూపొందించాక.. మీరు మీ ఇద్దరి నెలవారీ ఆదాయాన్ని ఒకటిగా కలిపేయాలి. కామన్ ఫైనాన్షియల్ కమిట్‌మెంట్స్ లేదా స్వల్పకాలిక, మధ్యస్థ, దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి నగదు కేటాయించడంలో ఇది మీకు సహాయం చేస్తుంది. అద్దె, పన్ను, అప్పు, గృహ రుణం, క్రెడిట్ కార్డ్ బిల్లులు, బీమా, నెలవారీ ఖర్చులు మొదలైనవి తెలుసుకున్నాక.. పొదుపు కోసం మిగిలి ఉన్న డబ్బులో ఎంత సేవ్ చేయాలో నిర్ణయించడానికి ఇది ఉపయోగపడుతుంది. తప్పనిసరి ఖర్చులకు సంబంధించి బాధ్యతలను సమానంగా షేర్ చేయాలి. యుటిలిటీలు, కిరాణా సామాగ్రి, పిల్లల చదువులు, గృహ రుణం మొదలైన అనేక బిల్లులు చెల్లించాలి. భార్యాభర్తలిద్దరూ రెగ్యులర్ గా జీతం పొందినట్లయితే వీటిని సమానంగా విభజించి చెల్లించవచ్చు.

3. పొదుపు
నెలవారీ ఖర్చులను లెక్కించిన తర్వాత, ఆర్థిక లక్ష్యాల కోసం మీరు ఎంత డబ్బు ఆదా చేయగలరో లెక్కించండి. ఈ విషయంలో ఆర్థిక పరిస్థితిని బట్టి దంపతులు కలిసి నిర్ణయం తీసుకోవచ్చు. వారసత్వ ఆస్తి రాదనుకున్న సమయంలో పొదుపు విషయంలో దంపతులు చాలా స్మార్ట్ గా పొదుపు చేయాల్సి ఉంటుంది.

4. ఖాతాలను వేరుగా ఉంచండి
బ్యాంకు ఖాతాలను వేర్వేరుగా మెయింటెన్ చేయడం ద్వారా టాక్స్ ల భారాన్ని తగ్గించుకోవచ్చు. మీ జీవిత భాగస్వామి పెట్టుబడి మినహా మీరు మీ బ్యాంక్ ఖాతాలో జాయింట్ అకౌంట్ హోల్డర్ కావచ్చు. అయితే పెళ్లయిన తొలినాళ్లలో జాయింట్ అకౌంట్ హోల్డర్ గా ఉండటం వల్ల ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ భావన కలుగుతుంది. ఇది ఆర్థిక లక్ష్యాలను చిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉంది. అందుకే పెళ్ళయిన కొన్నేళ్ల తరువాతే జాయింట్ అకౌంట్ కలిగి ఉండటం ముఖ్యం.

ఇది కూడా చదవండి :  ఆర్సీబీ ఫ్యాన్స్ కు బిగ్ షాకిచ్చిన డివిలియర్స్.. ఐపీఎల్ కి కూడా గుడ్ బై..

5. ఆరోగ్య బీమా & అత్యవసర నిధి
కోవిడ్-19 ఆరోగ్య బీమా పాలసీ ఉండటం చాలా ముఖ్యమని గుర్తు చేసింది. హెల్త్ కేర్ ఖర్చులే భారతీయులను పేదరికంలోకి నెట్టేస్తున్నాయి. అందుకే నగదు రహిత ఆరోగ్య బీమా కలిగి ఉండటం చాలా ముఖ్యం. బీమాతో అనూహ్య పరిస్థితుల నుంచి అప్పులపాలు కాకుండా బయటపడవచ్చు. ఉద్యోగం కోల్పోవడం, రెగ్యులర్ ఇన్కమ్ ఆగిపోవడం వంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాలంటే కనీసం 3 నెలల అత్యవసర నిధి అవసరం. మూడు నెలలకు సరిపడా ఖర్చులను బ్యాంకు ఖాతాలో సురక్షితంగా ఉంచడం ద్వారా తాత్కాలిక ఆర్థిక సంక్షోభాల నుంచి కాపాడుకోవచ్చు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Financial problem, Marriage, Newly Couple, Personal Finance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు