రిలయెన్స్ కోసం తొలిసారిగా HSBC బ్లాక్‌చెయిన్ పేమెంట్

రిలయెన్స్, ట్రైకాన్ మధ్య జరిగిన ఈ లావాదేవీలో అమెరికాలోని ట్రైకాన్ ఎనర్జీ(ఇంపోర్టర్) తరఫున బ్రసెల్స్‌లోని ఐఎన్‌జీ బ్యాంక్... రిలయెన్స్(ఎక్స్‌పోర్టర్) కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్‌ను హెచ్ఎస్‌బీసీ ఇండియాకు జారీ చేసింది. ఇప్పటివరకు సంప్రదాయంగా కాగితాలపై డాక్యుమెంటేషన్ ప్రక్రియ జరిగేది. కానీ ఈ లావాదేవీలో మాత్రం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగించారు.

news18-telugu
Updated: November 4, 2018, 8:49 PM IST
రిలయెన్స్ కోసం తొలిసారిగా HSBC బ్లాక్‌చెయిన్ పేమెంట్
రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
  • Share this:
బ్రిటీష్ బ్యాంకింగ్ దిగ్గజమైన హెచ్ఎస్‌బీసీ... భారతదేశం కోసం తొలిసారిగా బ్లాక్‌చెయిన్ ద్వారా ఓవర్సీస్ పేమెంట్ చేయడం విశేషం. అమెరికాలోని క్లైంట్‌కు, రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఎగుమతుల కోసం ఈ ఆర్థిక లావాదేవీ జరిగింది. దీని వల్ల డాక్యుమెంట్లను ప్రాసెస్ చేసే సమయం భారీగా తగ్గింది. రిలయెన్స్‌, అమెరికాకు చెందిన ట్రైకాన్ ఎనర్జీ కోసం బ్లాక్‌చెయిన్ ఆధారిత లెటర్ ఆఫ్ క్రెడిట్ పద్ధతిలో లావాదేవీలు జరిగినట్టు హెచ్ఎస్‌బీసీ ఇండియా, రిలయెన్స్ సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశాయి.

ఎగుమతుల కోసం ఉపయోగించే డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తిచేసేందుకు సాధారణంగా ఏడు నుంచి పది రోజుల సమయం పడుతుంది. కానీ బ్లాక్ చెయిన్ ఉపయోగించడం వల్ల ఇదంతా ఒక్కరోజు లోపే జరిగిపోయింది.

శ్రీకాంత్ వెంకటాచారి, ఆర్ఐఎల్ జాయింట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్


ఎలక్ట్రానిక్ బిల్ ఆఫ్ లేడింగ్‌ను నిర్వహించేందుకు బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫామ్‌కు ఎలక్ట్రానిక్ బిల్ ఆఫ్ లేడింగ్(ఈబీఎల్) ప్లాట్‌ఫామ్‌ను అనుసంధానించారు. అంతర్జాతీయంగా వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లు చేసే సంస్థలన్నింటినీ ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చేందుకు ఇది ఉపయోపడుతుందని ఆ ప్రకటనలో తెలిపారు. బ్లాక్‌చెయిన్ సొల్యూషన్‌లో రికార్డులన్నీ బ్లాక్స్ రూపంలో ఉంటాయి. అంతా పారదర్శకం. ఈ లావాదేవీలతో సంబంధమున్నవాళ్లు మొత్తం ప్రాసెస్‌ని రియల్‌టైమ్‌లో చూడొచ్చు.

వర్తక, వాణిజ్య లావాదేవీల్లో బ్లాక్‌ చెయిన్ టెక్నాలజీ ఎంతో ప్రభావం చూపించనుంది. ఈ లావాదేవీలు ఎంతో పారదర్శకంగా ఉండటంతో పాటు సురక్షితం కూడా. సులభంగా, వేగంగా లావాదేవీలు జరుగుతాయి. ఖర్చు కూడా తక్కువ.
హితేంద్ర దేవ్, హెచ్ఎస్‌బీసీ గ్లోబల్ బ్యాంకింగ్ అండ్ మార్కెట్స్ హెడ్


అమెరికాలోని ట్రైకాన్ ఎనర్జీ(ఇంపోర్టర్) తరఫున బ్రసెల్స్‌లోని ఐఎన్‌జీ బ్యాంక్... రిలయెన్స్(ఎక్స్‌పోర్టర్) కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్‌ను హెచ్ఎస్‌బీసీ ఇండియాకు జారీ చేసింది. ఇప్పటివరకు సంప్రదాయంగా కాగితాలపై డాక్యుమెంటేషన్ ప్రక్రియ జరిగేది. కానీ ఈ లావాదేవీలో మాత్రం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగించారు. లేకపోతే ఈ మొత్తం ప్రక్రియ కోసం ఫిజికల్ డాక్యుమెంట్లను ప్రతీ పార్టీకి పోస్ట్, కొరియర్, ఫ్యాక్స్ ద్వారా పంపించాల్సి వచ్చేది. ఇందుకోసం సమయం ఎక్కువ, ఖర్చు కూడా ఎక్కువే. బ్లాక్ చెయిన్ పద్ధతిలో ఈ ప్రక్రియ అంతా సులభమవుతుంది.బ్లాక్ చెయిన్ సొల్యూషన్స్‌ ద్వారా సమయం చాలావరకు తగ్గుతుంది కాబట్టి... భారతదేశంలోని ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, యెస్ బ్యాంకులు ఈ టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ కోసం ఉపయోగించే 'క్రోడా అప్లికేషన్' ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఐదు బ్యాంకుల్ని సపోర్ట్ చేస్తోందని చెబుతోంది హెచ్ఎస్‌బీసీ. దీన్ని మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తామంటోంది. మొత్తానికి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా రిలయెన్స్‌కు తొలి పేమెంట్ జరగడం విశేషమే.
Published by: Santhosh Kumar S
First published: November 4, 2018, 8:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading