పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB) ఖతాదారులు శుభవార్తను అందించింది ఆ బ్యాంకు. వినియోగదారుల కోసం నూతన విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై క్యాష్ విత్ డ్రా చేసుకునేటప్పుడు OTP(వన్ టైమ్ పాస్వర్డ్) విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల కాలంలో చాలా వరకు నకిలీ కార్డుల ద్వారా అనధికారిక లావాదేవీల జరుగుతున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో ATM నుంచి తీసుకునే సమయంలో అనధికార లావాదేవీలు నిరోధించేందుకు గాను PNB ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ వ్యవస్థను తీసుకొచ్చింది.
ఏటీఎం సెంటర్లలో క్యాష్ విత్ డ్రా చేసుకునేటప్పుడు ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ 2020 డిసెంబరు 1 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ విధానంతో తాజాగా ఖాతాదారులు ఉదయం 8 నుంచి సాయంత్రం 8 వరకు రూ.10 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ విషయాన్ని పీఎన్ బీ తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
"2020 డిసెంబరు 1 నుంచి ఓటీపీ ఆధారిత క్యాష్ విత్ డ్రాల కోసం PNB 2.0ని లాంచ్ చేశాం. ఇకపై బ్యాంకింగ్ విత్ డ్రా సులభతరం చేసుకోండి" అని ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
ఈ ముందడుగుతో క్యాష్ విత్ డ్రాల భద్రతపై పీఎన్పీ అదనపు చర్యను తీసుకున్నట్లయింది. PNB ఖాతాల నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకునేటప్పుడు వినియోగదారులు రిజిస్టర్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. కార్డుహోల్డర్లు విత్ డ్రా కోసం సొమ్ము ఎంటర్ చేసిన వెంటనే ఓటీపీ ఆప్షన్ తెరపై చూపిస్తుంది. రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.
వన్ టైమ్ పాస్వర్డ్ అనేది సిస్టం అందించిన సంఖ్యా అక్షరాల ప్రమాణం. ఇది ఒకే లావాదేవి కోసం వినియోగాదారునికి అందుబాటులో ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా అనధికార ఏటీఎం నగదు ఉపసంహరణ నుంచి పీఎన్ బీ కార్డుదారులను రక్షిస్తుంది. బ్యాంకులో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నెంబరు ద్వారా మాత్రమే వినియోగదారులు ఓటీపీని అందుకుంటారని గమనించాలి. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎంల నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకోవడానికి ప్రస్తుత ప్రక్రియలో పెద్ద మార్పు లేదు. కానీ లావాదేవీని మరింత సురక్షితం చేయడానికి ఇది మరో దశను జోడిస్తుంది.
Published by:Krishna Adithya
First published:November 30, 2020, 16:45 IST