Home /News /business /

IMPORTANT FEATURES TO CONSIDER WHEN YOU BUYING NEW HOUSE UMG GH

Buying New House: కొత్త ఇల్లు కొంటున్నారా? ఈ ఐదింటిని తప్పక గుర్తుంచుకోండి

కొత్త ఇల్లు కొనాలనుకునేవారు ఇవి తెలుసుకోండి

కొత్త ఇల్లు కొనాలనుకునేవారు ఇవి తెలుసుకోండి

ఎక్కువ మంది ఇల్లు (House) కొనే సమయంలో తరచుగా గృహ రుణాలపై (Housing Loans) ఆధారపడతారు. ఎక్కువ మొత్తంలో డబ్బు వెచ్చించే వ్యవహారం కాబట్టి గృహ కొనుగోలుదారు ప్రధానంగా రెగ్యులేటరీ, ఫైనాన్షియల్, లొకేషనల్ అంశాలు పరిగణించాలి.

సొంత ఇల్లు కొనాలనే నిర్ణయం అంత తేలికైనది కాదు. ఇది చాలా డబ్బుతో కూడుకున్న పని. చాలా మంది భారతీయులకు సొంత ఇల్లు ఉండాలనేది పెద్ద కల. ఒక ఇంటిని సొంతం చేసుకుంటే ఆత్మ విశ్వాసం పెరగడంతోపాటు భద్రత, స్థిరత్వం కూడా లభిస్తాయి. ఎక్కువ మంది ఇల్లు కొనే సమయంలో తరచుగా గృహ రుణాలపై ఆధారపడతారు. ఎక్కువ మొత్తంలో డబ్బు వెచ్చించే వ్యవహారం కాబట్టి గృహ కొనుగోలుదారు ప్రధానంగా రెగ్యులేటరీ, ఫైనాన్షియల్, లొకేషనల్ అంశాలు పరిగణించాలి. అదే విధంగా ఇల్లు కొనుగోలు చేయడానికి వెళ్లేటప్పుడు పరిగణించవలసిన ఐదు ముఖ్యమైన అంశాలు ఇవే..

స్థోమత, తిరిగి చెల్లించే సామర్థ్యం
గృహ రుణాలు ఇంటిని సౌకర్యవంతంగా, సరసమైనవిగా చేశాయి. అయితే ఇంటిని కొనుగోలు చేసే ముందు, మీరు మీ ఆర్థిక స్థితి, డౌన్‌పేమెంట్‌లు, వాయిదాలను పరిశీలించాలి. ఒక ఇంటి ధర రూ.100 ఉంటే, దాన్ని రూ.120 లేదా రూ.130కి వరకు పెంచే అదనపు ఖర్చులు ఉంటాయి. ఇందులో గృహ రుణం 75-90% ఫైనాన్స్ చేయగలదు. మిగిలినవి జేబులోంచి ఖర్చు చేయాలి. పెద్ద డౌన్‌పేమెంట్ లోన్ అవసరాలను తగ్గిస్తుంది, EMI భారాన్ని తగ్గిస్తుంది. డౌన్ పేమెంట్‌ను సేవ్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు SIP ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో నెలకు రూ.25,000 పెట్టుబడి పెడితే సగటు రాబడి రేటు 12% వద్ద మూడేళ్ల తర్వాత రూ.10.9 లక్షలు లభిస్తుంది. EMIల చెల్లింపులో క్రమశిక్షణతో ఉండవలసిన బాధ్యత ఉంటుంది. దాని కోసం ఖర్చులను రీ-బడ్జెట్ చేయడానికి ప్రయత్నించవచ్చు.

ఇదీ చదవండి: మొబైల్ లవర్స్‌ కోసం మెస్మరైజింగ్ మోడల్స్.. రూ.30 వేలలో బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్లు మీకోసమే..


క్రెడిట్ స్కోర్
కొత్త ఇంటికి ఫైనాన్స్ చేయబోతున్నట్లయితే, బలమైన క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉండటం మంచిది. ఇది క్రెడిట్ యోగ్యతను బలపరుస్తుంది, అతి తక్కువ వడ్డీ రేట్లలో లోన్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే స్వల్పకాలిక EMIలు ఉంటే వీలైనంత త్వరగా వాటిని సెటిల్‌ చేసుకోవాలి. చాలా EMIలు మీ రీపేయింగ్ కెపాసిటీకి ఆటంకం కలిగించవచ్చు, తద్వారా ఫైనాన్స్ పొందే అర్హతపై ప్రభావం కనిపిస్తుంది.

ఇదీ చదవండి: ఇండియాలో త్వరలో లాంచ్ కానున్న 5G టెక్నాలజీ.. 5G ఫోన్‌ను ఇప్పుడే కొనుగోలు చేయాలా?


RERA, ఇతర డాక్యుమెంట్ వివరాలు
గృహ కొనుగోలుదారులు ముందుగా తాము కొనుగోలు చేస్తున్న ఆస్తికి అవసరమైన సర్టిఫికేట్లు, చట్టపరమైన చెల్లుబాటు, స్థానిక అనుమతులు ఉన్నాయా? అనే దానిపై తగిన శ్రద్ధ వహించాలి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA)లో ఆస్తి రిజిస్టర్ అయిందా లేదా అనేది పరిశీలించాలి. RERA-నమోదిత ఆస్తిని కొనుగోలు చేయడం ద్వారా ప్రాజెక్ట్‌లో జాప్యం లేదా ప్రాజెక్ట్‌లో లోపభూయిష్ట నిర్మాణం వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. ఆస్తికి అవసరమైన ధ్రువపత్రాలు, క్లియరెన్స్‌లను లేకపోతే ఆర్థిక సహాయం చేయడానికి రుణదాతలు ఆసక్తి చూపరు.

ఇదీ చదవండి: స్మోకింగ్ మానేయాలనుకున్నా సాధ్యం కావట్లేదా..? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..


టైటిల్ డీడ్, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్
కొత్త ఇంటిని కొనే ముందు తనిఖీ చేయవలసిన ముఖ్యమైన విషయాలలో ఒకటి ఆస్తి లేదా ప్రాజెక్ట్ ఆధారంగా ఉన్న భూమి టైటిల్ డీడ్. టైటిల్ డీడ్ అనేది బిల్డర్ ద్వారా ఆస్తి యాజమాన్యం, యాజమాన్యాన్ని విక్రయించే లేదా బదిలీ చేసే హక్కు. ఆస్తి ఏదైనా వ్యాజ్యంలో చిక్కుకుపోయిందా లేదా అనే దాని గురించి వివరణ ఇచ్చే పత్రం. పత్రాలను పరిశీలించడానికి న్యాయవాదిని కూడా సంప్రదించవచ్చు. అదేవిధంగా, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్‌ను కూడా తనిఖీ చేయాలి. హోమ్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ అవసరం. ఇది ఆస్తికి ఎటువంటి చట్టపరమైన సమస్యలు లేవని రుజువుగా పనిచేసే డాక్యుమెంట్.

ఇదీ చదవండి: విటమిన్ B12 ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్టే.. సైడ్ ఎఫెక్ట్స్ ఇవే..!


స్టాంప్ డ్యూటీ, ఇతర ఛార్జీలు
అసలు ధర కోట్ చేసిన ధరకు భిన్నంగా ఉండవచ్చు. కొత్త ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు అనేక ఇతర ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది. కొనుగోలు ఒప్పందంపై సంతకం చేసే సమయంలో, వాస్తవ ఖర్చులు పెరుగుతాయి. అందువల్ల ఇంటి బేస్ ధర కంటే, కొన్ని అనివార్యమైన ఛార్జీలను తెలుసుకోవడం ముఖ్యం. స్టాంప్ డ్యూటీ (5-7%), రిజిస్ట్రేషన్ ఫీజు 1-2%, నిర్వహణ ఛార్జీలు, పార్కింగ్ ఛార్జీలు వంటి ఛార్జీలు వాస్తవ ఖర్చులను పెంచుతాయి.పైన చర్చించిన ఐదు పాయింట్లతో పాటు, కొత్త ఇంటి కోసం వెతుకుతున్నప్పుడు.. ఆస్తి ఉన్న స్థలాన్ని అంచనా వేయాలి. సమీపంలో విద్యా సంస్థలు, ఆసుపత్రులు, రైలు, రోడ్డు కనెక్టివిటీ, విమానాశ్రయాలు, షాపింగ్ మార్కెట్‌లు ఉండాలి. ఇవి సౌకర్యాలను పెంచుతాయి, జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయి.
Published by:Mahesh
First published:

Tags: Credit score, EMI, House, House loan

తదుపరి వార్తలు