#Reminder: 2019లో ఈ ముఖ్యమైన తేదీలు అస్సలు మర్చిపోవద్దు

యూజర్లు తమకు కావాల్సిన ఛానెళ్లు మాత్రమే ఎంచుకొని డబ్బులు చెల్లించే వెసులుబాటు కల్పించింది ట్రాయ్. రూ.130 చెల్లిస్తే 100 ఉచిత ఛానెళ్లు చూడొచ్చు. పే ఛానెల్స్ చూడాలంటే వాటిని ఎంచుకోవడానికి గడువును జనవరి 31 వరకు పొడిగించింది ట్రాయ్.

news18-telugu
Updated: December 31, 2018, 3:03 PM IST
#Reminder: 2019లో ఈ ముఖ్యమైన తేదీలు అస్సలు మర్చిపోవద్దు
#Reminder: మీరు గుర్తుంచుకోవాల్సిన డెడ్‌లైన్స్ ఇవే...
  • Share this:
బిజీబిజీ లైఫ్‌లో చేయాల్సిన ముఖ్యమైన పనులు చేయడం మర్చిపోతుంటారు. గడువు దగ్గరకు వచ్చినప్పుడో, లాస్ట్ డేట్ ముగిసిన తర్వాత ఆ పనులు గుర్తొస్తాయి. అప్పుడు కంగారు పడటం చాలామందికి అలవాటు. అందుకే డెడ్‌లైన్స్ గుర్తుంచుకుంటేనే చాలావరకు పనులు గడువులోగా పూర్తిచేయొచ్చు. సామాన్యులు గుర్తుంచుకోవాల్సిన డెడ్‌లైన్స్ చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఇవే...

01-01-19... మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డులు పనిచేయవు

మీరు బ్యాంకు నుంచి చాలా కాలం క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ తీసుకొని వాడుతున్నారా? ఆ కార్డులకు చిప్ లేకపోతే జనవరి 1 నుంచి పనిచేయవు. మొదట్లో అన్ని బ్యాంకులు మ్యాగ్‌స్ట్రైప్ కార్డుల్ని కస్టమర్లకు ఇచ్చాయి. ఇప్పటికీ ఆ కార్డులే వాడుతున్నవాళ్లు ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు డిసెంబర్ 31 లోగా ఖాతాదారులందరూ మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డులను చిప్ కార్డులతో రీప్లేస్ చేసుకోవాలి. లేకపోతే జనవరి 1 నుంచి పాత కార్డులు వాడలేరు.

01-01-19... నాన్-సీటీఎస్ చెక్కులు పనిచేయవు
మీరు తరచూ చెక్కులతో ఆర్థిక లావాదేవీలు చేస్తుంటారా? మీ దగ్గర పాత చెక్ బుక్ ఉంటే ఆ చెక్కులు జనవరి 1 తర్వాత చెల్లవు. మీరు పాత చెక్ బుక్స్ మార్చుకొని సీటీఎస్-2010 స్టాండర్డ్ చెక్ బుక్స్ తీసుకోవాలి. ఇప్పటికీ నాన్-సీటీఎస్ చెక్కుల్ని ఉపయోగిస్తున్నవాళ్లు ఉన్నారు. చాలామంది తమ పాత చెక్ బుక్స్‌ని సీటీఎస్-2010 చెక్ బుక్స్‌కి మార్చుకోలేదు. 2019 జనవరి 1 నుంచి నాన్-సీటీఎస్ చెక్కుల్ని బ్యాంకులు అనుమతించకపోవచ్చు. సీటీఎస్-2010 చెక్స్‌లో సెక్యూరిటీ ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి. ఆప్టికల్/ఇమేజ్ క్యారెక్టర్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉంటుంది. నాన్-సీటీఎస్ టెక్నాలజీలో ఈ ఫీచర్లు ఉండవు. మీ దగ్గర నాన్-సీటీఎస్ చెక్ బుక్స్ ఉంటే, బ్యాంకుకు వెళ్లి మార్చుకోవచ్చు. లేకపోతే వచ్చే నెల నుంచి ఆ చెక్కులు బౌన్స్ అయ్యే ప్రమాదముంది.

15-01-2019... ఐఎస్ఐ హెల్మెట్లు తప్పనిసరి
ఇకపై వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే సరిపోదు. ఐఎస్ఐ మార్క్ గల హెల్మెట్ తప్పనిసరి. 2019 జనవరి 15 నుంచి ఐఎస్ఐ గుర్తింపు లేని హెల్మెట్లపై నిషేధం విధిస్తోంది కేంద్రం. ఈ జనవరి 15 తర్వాత ఎవరైనా ఐఎస్ఐ గుర్తింపు లేని హెల్మెట్లు అమ్మితే అది నేరమే. రెండేళ్ల జైలు శిక్ష లేదా రెండు లక్షల జరిమానా తప్పదు. ప్రస్తుతం 1.5 కిలోలుగా ఉన్న హెల్మెట్ బరువు కొత్త ప్రమాణాల ప్రకారం గరిష్టంగా 1.2 కిలోలు మాత్రమే ఉండాలి. ISI 4151:2015 సర్టిఫికేషన్ ఉన్న హెల్మెట్లనే అనుమతిస్తారు. వాహనదారులు ఐఎస్ఐ గుర్తింపు ఉన్న హెల్మెట్లు కొనేందుకు రెండు నెలల గడువు ఇస్తారు.31-01-19... పే ఛానెళ్ల ఎంపిక
కొద్దిరోజులుగా ట్రాయ్ ప్రధాన వార్తల్లో నిలుస్తోంది. డీటీహెచ్, కేబుల్ కనెక్షన్ల విషయంలో జారీ చేసిన కొత్త ఉత్తర్వులే కారణం. ఇకపై యూజర్లు తమకు కావాల్సిన ఛానెళ్లు మాత్రమే ఎంచుకొని డబ్బులు చెల్లించే వెసులుబాటు కల్పించింది ట్రాయ్. రూ.130 చెల్లిస్తే 100 ఉచిత ఛానెళ్లు చూడొచ్చు. పే ఛానెల్స్ చూడాలంటే వాటిని ఎంచుకోవడానికి గడువును జనవరి 31 వరకు పొడిగించింది ట్రాయ్.

31-03-2019... పాన్-ఆధార్ లింక్
పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడానికి మార్చి 31 చివరి రోజు. ఆధార్‌పై కీలక తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయడాన్ని సమర్థించింది. దీంతో గడువును 2019 మార్చి 31 వరకు పెంచారు.

31-03-2019... పీఎంఏవై సబ్సిడీ
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద సబ్సిడీ పొందేందుకు 2019 మార్చి 31 వరకు గడువు పొడిగించారు.

31-03-2019... ఐటీ రిటర్న్స్
2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయనివాళ్లు 2019 మార్చి 31 లోపు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ఐటీఆర్ ఫైల్ చేసేవాళ్లు రూ.10,000 జరిమానా చెల్లించాలి. ఇక పన్ను చెల్లింపుదారులు తమ యాజమాన్యాల దగ్గర ఇన్‌కమ్ ట్యాక్స్ సేవింగ్స్, అలవెన్స్, క్లెయిమ్ రీఇంబర్స్‌మెంట్లు పూర్తి చేసేందుకు 2019 మార్చి 31 వరకు గడువు ఉంది. కొన్ని పన్ను మినహాయింపులు యజమానుల ద్వారానే పొందాల్సి ఉంటుంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన ఐటీఆర్‌లో ఏవైనా తప్పులు ఉంటే 2019 మార్చి 31 లోగా సరిదిద్దుకోవచ్చు.

01-04-2019... ఫిజికల్ షేర్ల మార్పిడి
గతంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టినవారికి ఫిజికల్ షేర్లు ఇచ్చేవారు. ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్ రూపంలో ఎలక్ట్రానిక్ షేర్లుగా రికార్డ్ అవుతున్నాయి. ఇప్పటికీ ఫిజికల్ షేర్లు ఉన్నవాళ్లు డీమ్యాట్‌లో ఎలక్ట్రానిక్ షేర్లుగా మార్చుకునేందుకు 2019 ఏప్రిల్ 1 వరకు గడువు ఉంది.

01-04-2019... వాహనాలకు హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్
ఏప్రిల్ 1 నుంచి హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ ఏర్పాటు చేస్తామని కేంద్ర రవాణా శాఖ ప్రకటించింది. వాహనం తయారైన దగ్గర్నుంచే డీలర్లకు హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ సప్లై అవుతాయి. హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్‌పైన క్రోమియంతో హోలోగ్రామ్ ఉంటుంది. ముందు, వెనుక భాగాల్లో ఉండే నెంబర్ ప్లేట్స్‌కు పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్‌తో లేజర్-బ్రాండింగ్ ఉంటుంది. అందులోనే రిజిస్ట్రేషన్ వివరాలుంటాయి.

31-07-19... ఐటీ రిటర్న్స్ ఫైలింగ్
2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు 2019 జూలై 31 చివరి తేదీ. ఈ గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేస్తే ఎలాంటి జరిమానాలు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి:

రైల్ టికెట్ బుక్ చేస్తున్నారా... UTS యాప్ గురించి తెలుసా?

తగ్గిన క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి 10 మార్గాలు

ఫేక్ మొబైల్ యాప్స్‌ని అడ్డుకోవడానికి 5 టిప్స్

బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్‌ని ఎలా లెక్కిస్తాయి? తెలుసుకోండి
Published by: Santhosh Kumar S
First published: December 31, 2018, 11:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading