Yes Bank | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో (Bank) ఒకటైన యస్ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్యమైన విషయాన్ని వెల్లడించింది. ఎస్ఎంఎస్ (SMS) బ్యాలెన్స్ అలర్ట్ ఫెసిలిటీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఎస్ఎంఎస్ ద్వారా బ్యాలెన్స్ అలర్ట్ ఫెసిలిటీని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. 2022 డిసెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని తెలిపింది.
అలాగే మీరు ఎస్ఎంఎస్ అలర్ట్ ప్యాకేజ్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకొని ఉండి ఎస్ఎంఎస్ రూపంలో బ్యాలెన్స్ అలర్ట్స్ పొందుతూ ఉన్నా కూడా వారికి వచ్చే నెల నుంచి అలర్ట్స్ రావని, ఆగిపోతాయని యస్ బ్యాంక్ వివరించింది. ఇతర ఎస్ఎంఎస్ అలర్ట్స్ మాత్రం వస్తూ ఉంటాయని తెలిపింది. కాగా బ్యాంక్ కస్టమర్లు ఇతర మార్గాల్లో బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చని పేర్కొంది.
బ్యాంక్ అకౌంట్‌ను ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కు ఆన్లైన్లో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి!
యస్ మొబైల్ , యస్ ఆన్లైన్, యస్ రోబోట్ వంటి తదితర ఆన్లైన్ ఫెసిలిటీస్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చని యస్ బ్యాంక్ తెలపింది. కాగా బ్యాంక్ కస్టమర్లు ఆన్లైన్ ద్వారా ఎస్ఎంఎస్ అలర్ట్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ పనిని ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కస్టమర్లకు ఒకేసారి 2 శుభవార్తలు అందించిన బజాజ్ ఫైనాన్స్!
దీని కోసం ముందుగా మీరు యస్ ఆన్‌లైన్‌లోకి వెళ్లాలి.అక్కడ కస్టమర్ ఐడీ, పాస్వర్డ్ సాయంతో నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత మెనూపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మేనేజ్ ప్రొఫైల్లోకి వెళ్లాలి. ఇప్పుడు అలర్ట్స్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత అకౌంట్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు నచ్చిన మార్పులు చేసుకోవచ్చు. అలర్ట్స్‌ను రిజిస్టర్ లేదా డీరిజిస్టర్ చేసుకోవచ్చు. మీ ఏ అలర్ట్స్‌లో అయితే మార్పులు చేయాలని భావిస్తున్నారో వీటిని ఎంచుకోవాలి. తర్వాత సేవ్ చేయాలి.
అందువల్ల యస్ బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వస్తుందని గమనించాలి. కాగా సెక్యూరిటీ రీజర్స్ కారణంగా యస్ ఆన్లైన్ ద్వారా నిర్వహించే యస్ బ్యాంక్ డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్ల అలర్ట్స్ అనేవి కాంటాక్ట్ డీటైల్స్ కింద అప్డేట్ చేసిన మొబైల్ నెంబర్‌కు మాత్రమే వస్తాయని గుర్తించాలి. అందువల్ల మీ మొబైల్ నెంబర్ కరెక్ట్‌గా ఉందా? లేదా? చెక్ చేసుకోండి. మీరు మొబైల్ నెంబర్ మార్చుకోవాలని భావిస్తే.. దగ్గరిలోని యస్ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లొచ్చు. మీరు మరింత సమాచారం పొందాలని భావిస్తే.. బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్ 1800 1200కు కాల్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank account, Banks, YES BANK