Ikodoo Buds: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల వినియోగంతో పాటు ఇయర్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్ వాడకం కూడా పెరుగుతోంది. దీంతో ఈ విభాగంలోకి ఎప్పటికప్పుడు కొత్త కంపెనీలు ఎంట్రీ ఇచ్చి, సరికొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నాయి. తాజాగా కొత్త కన్స్యూమర్ టెక్ బ్రాండ్ ఇకోడూ (IKODOO), ఇండియాలో మొదటిసారి ఆడియో ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. ఇకోడూ బడ్స్ వన్ (IKODOO Buds One), ఇకోడూ బడ్స్ Z (IKODOO Buds Z) పేరుతో ఇయర్‌బడ్స్ రిలీజ్ చేసింది. వీటి ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
* ధరల వివరాలు
ఇకోడూ బడ్స్ Z ధర రూ.999 కాగా, ఇకోడూ బడ్స్ వన్ రూ.4,999కి అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ప్రొడక్ట్స్ అమెజాన్‌లో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా సేల్‌కు అందుబాటులో ఉంటాయి. వీటి అమ్మకాల కోసం కంపెనీ అమెజాన్ ఇండియాతో ప్రత్యేకంగా ఒప్పందం కుదుర్చుకుంది. మార్చి 31వ తేదీ మధ్యాహ్నం 12 నుంచి కస్టమర్లు వీటిని కొనుగోలు చేయవచ్చు. హై ఎండ్ ఆడియో టెక్నాలజీని యూజర్లకు చేరువ చేయాలనే లక్ష్యంతో డిజైన్ చేసిన ఈ ప్రొడక్స్.. కస్టమర్లను ఆకర్షిస్తాయని ఇకోడూ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ తన్మయ్ దాస్ తెలిపారు.
* ఇకోడూ బడ్స్ Z ఫీచర్లు
ఇవి లైట్ వెయిట్, బడ్జెట్ రేంజ్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ . ఇకోడూ కంపెనీ బడ్స్ Z ప్రొడక్ట్‌లో తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లను అందించింది. వాయిస్ కాల్స్ సమయంలో పరిసరాల శబ్దాన్ని ఫిల్టర్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్‌కు ఇవి సపోర్ట్ చేస్తాయి. త్రీ-డైమెన్షనల్ సౌండ్‌స్టేజ్ ఎఫెక్ట్‌కు సపోర్ట్ చేసే ఈ బడ్స్, గరిష్టంగా 28 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తాయని కంపెనీ తెలిపింది. వీటికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
UPI: రూ.2,000 కంటే ఎక్కువ UPI పేమెంట్స్‌పై ఛార్జీలు..కొత్త రూల్ లో బిగ్ ట్విస్ట్ ఇదే!
* ఇకోడూ బడ్స్ వన్ స్పెసిఫికేషన్స్
ఇకోడూ బడ్స్ వన్ అనేవి ప్రీమియం, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్. వైర్‌లెస్ కనెక్టివిటీ కోసం ఈ ఇయర్‌బడ్స్ బ్లూటూత్ 5.2కి సపోర్ట్ చేస్తాయి. ఇవి వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయడంతో పాటు, 27 గంటల బ్యాటరీ బ్యాకప్ అందించగలవు. వీటిలో 13.4 డైనమిక్ ఆడియో డ్రైవర్స్ ఉంటాయి. ఈ ఇయర్‌బడ్స్ సప్లిమెంటరీ స్మార్ట్‌ఫోన్ యాప్‌తో వస్తాయి. దీని ద్వారా వివిధ ఫీచర్లను యాక్సెస్ చేసుకోవడంతో పాటు ఫైండ్ మై బడ్స్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు.
ఇకోడూ బడ్స్ వన్ ఇయర్‌బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తాయి. ఇవి 50db కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీలను ఫిల్టర్ చేయగలవని కంపెనీ తెలిపింది. ఈ ఇయర్‌బడ్స్ విండ్ నాయిస్ రిడక్షన్, ఎన్విరాన్‌మెంట్ నాయిస్ క్యాన్సిలింగ్, యాంటీ విండ్ టెక్నాలజీ వంటి స్పెసిఫికేషన్స్‌తో యూజర్లకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ear buds