ప్రపంచంలోని టాప్ కంపెనీలను సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, పరాగ్ అగర్వాల్ వంటి చాలా మంది భారతీయులు ముందుండి నడిపిస్తున్నారు. ఇండియాలో పుట్టి గ్లోబల్ కంపెనీలకు సీఈఓ పదవులు చేజిక్కించుకున్న వీరంతా సాటి భారతీయులకు గర్వకారణంగా నిలుస్తున్నారు. తాజాగా ఇలాంటి వ్యక్తుల జాబితాలో మరొక భారత సంతతి (Indian Origin) వ్యక్తి రాజ్ సుబ్రమణియం(Raj Subramaniam) చేరారు. గ్లోబల్ కొరియర్ డెలివరీ దిగ్గజం ఫెడెక్స్ (FedEx)కు ఇండియన్ అమెరికన్ అయిన రాజ్ సుబ్రమణియంను ప్రెసిడెంట్, సీఈఓగా నియమిస్తున్నట్లు ఆ సంస్థ సోమవారం ప్రకటించింది.
ఫెడెక్స్ కంపెనీ ఫౌండర్ ఫ్రెడరిక్ స్మిత్ తన సీఈఓ బాధ్యతల నుంచి 50 ఏళ్ల తర్వాత జూన్ 1న వైదొలుగుతారు. దీంతో జూన్ 1 నుంచి ఆ బాధ్యతలను తాజాగా సీఈఓగా ఎంపికైన రాజ్ సుబ్రమణియం చేపడతారు. స్మిత్ ఫెడెక్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతారు. మరి ఈ గ్లోబల్ సంస్థకు సీఈవోగా ఎంపికైన రాజ్ సుబ్రమణియం ఎవరు? ఆయనేం చదువుకున్నారు? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
BSNL BBNL Merge: బీఎస్‌ఎన్‌ఎల్, బీబీఎన్‌ఎల్ విలీనంతో గ్రామీణ ప్రాంతాలకు మేలు.. ఎలాగంటే.
* న్యూ ఫెడెక్స్ సీఈఓ అయిన రాజ్ సుబ్రమణియం ఎవరు?
1991లో రాజ్ సుబ్రమణియం (54) ఫెడెక్స్ లో చేరారు. ఆయన 2020లో ఫెడెక్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కి ఎన్నికయ్యారు. ఇప్పుడు కూడా ఈ బోర్డ్‌లో రాజ్ కొనసాగుతారనికంపెనీ తెలిపింది. ఫెడెక్స్ కార్పొరేషన్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఎన్నికకాక ముందు, సుబ్రమణియం ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థ అయిన ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్ కి ప్రెసిడెంట్, సీఈఓగా ఉన్నారు. అతను ఫెడెక్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. అక్కడ అతను కార్పొరేట్ స్ట్రాటజీ డెవలప్ చేయడానికి బాధ్యత వహించారు. అలాగే అతను కెనడాలోని ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్ అధ్యక్షుడిగా డ్యూటీ చేశారు. అతను ఫెడెక్స్ లో చేరినప్పటి నుండి ఆసియా, యూఎస్ అంతటా అనేక ఇతర నిర్వహణ, మార్కెటింగ్ రోల్స్ లో పనిచేశారు.
* ఎడ్యుకేషన్ & బ్యాక్‌గ్రౌండ్
రాజ్ సుబ్రమణియం కేరళలోని త్రివేండ్రంలో జన్మించారు. అతను తన 15 ఏళ్ల వయస్సులో ముంబైకి మకాం మార్చారు. ఇప్పుడు టెన్నెస్సీలోని మెంఫిస్‌లో నివసిస్తున్నారు. ఈ టెక్కీ 1987లో ఐఐటీ బాంబే నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత అతను 1989లో సైరాక్యూస్ (Syracuse) యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేశారు. ఆస్టిన్‌లోని టెక్సాస్ యూనివర్సిటీ నుంచి మార్కెటింగ్, ఫైనాన్స్‌లో ఎంబీఏ డిగ్రీని కూడా ఫినిష్ చేశారు సుబ్రమణియం.
New Rules: ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులు, పెట్టుబడి పథకాల్లో కొత్త రూల్స్.. మీకు తెలుసా..
కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం, ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్, ఫెడెక్స్ గ్రౌండ్ , ఫెడెక్స్ Freight, ఫెడెక్స్ సర్వీసెస్, ఫెడెక్స్ ఆఫీస్,. ఫెడెక్స్ లాజిస్టిక్స్, ఫెడెక్స్ డేటావర్క్‌లతో సహా, ఫెడెక్స్ అన్ని ఆపరేటింగ్ కంపెనీలకు వ్యూహాత్మక దిశానిర్దేశం (Strategic Direction) చేయడానికి ప్రెసిడెంట్, సీఈఓగా ఎన్నికైన రాజ్ సుబ్రమణియం బాధ్యత వహిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.