స్మార్ట్‌ఫోన్లు (SmartPhone), డేటారేట్లు(Data Rates) అందరికీ అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియా (Social Media) వినియోగించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రపంచంలో ఏ మూలన వింత జరిగినా, ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకొన్నా.. క్షణాల్లో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిపోతోంది. వెంటవెంటనే ఆ అంశంపై ట్రోల్స్ చేస్తూ మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే ఇప్పుడు పాల ప్యాకెట్ (Milk Packet)పై ఐఐఎం ఆల్మని (IIM Alumni) అని కళాశాల పేరు ముద్రించుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాల ప్యాకెట్‌పై ‘ఫౌండెడ్ బై ఐఐఎం ఆల్మని’ అనే ముద్ర ఉండటంతో సోషల్ మీడియాలో ఆ టాపిక్ వైరల్ అవుతోంది. ట్టిట్టర్(Twitter)లో చాలా మంది ఆ పాల ప్యాకెట్ ఫొటోలను ఉంచుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
సాధారణంగా చదువుకొన్న కళాశాల పేరును స్టార్టప్ కంపెనీలు మొదలుపెడుతున్న సమయంలో ప్రచారం కోసం వినియోగించడం సాధారణ విషయమే. అయితే పాల ప్యాకెట్‌పైకి కూడా ఐఐఎం కళాశాల ఆల్మని అనే ముద్రను తీసుకురావడం చర్చలకు తావిస్తోంది. దీనిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. నాణ్యత పాటించి ప్రజల నమ్మకం పొందాలికానీ, కాలేజ్(College) పేరు చెప్పుకొని కాదని కొందరు.. ఐఐఎం కళాశాలదే అసలు తప్పు అని మరికొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు.
Deadline Alert: వారికి రేపే లాస్ట్ డేట్... డెడ్‌లైన్ మిస్ అయితే భారీ జరిమానా, జైలు శిక్ష
What's the point of writing your college name on a MILK PACKET!???! ? pic.twitter.com/TgE2uicXQg
— Namanbir Singh? (@realNamanbir) March 13, 2022
Let's all calm down and take solace in the fact that they didn't write which IIM they studied at. https://t.co/iw5Ng0wGvG
— Noufal Ibrahim (@noufalibrahim) March 14, 2022
Arre baba, it's advertising targeting Indian parents. Yeh doodh peeyega toh direct IIX mein admission milega ???♂️ X = T / M https://t.co/ec5yMYV8OK
— CaptKenDaichiSawamura (@KenZenKayZayMan) March 14, 2022
సాధారణంగా ఏదైనా స్టార్టప్ కంపెనీప్రారంభించే సమయంలో తమ కళాశాల గురించి చెప్పుకొంటారని.. మొదటిసారి పాలప్యాకెట్‌లకు బ్రాండింగ్ కోసం కళాశాల పేరు వాడుకోవడం చేస్తున్నామని కొందరు ట్విట్టర్ వినియోగదారులు ఎద్దేవాచేస్తున్నారు. ఇండియాలో ప్రతిష్ఠాత్మక కళాశాల ఐఐఎం విలువ పడిపోయిందంటూ.. కొందరు ఐఐఎంకు కొత్త నిర్వచనాలు జోడిస్తున్నారు. ఈ వైరల్ టాపిక్‌లో పలువురు ప్రముఖులు కూడా పాల్గొని తమ అభిప్రాయాలను ట్వీట్ చేశారు.
'Milking' India's IIT, IIM, nit craze ?? https://t.co/jA0MliIztD
— Sherlocked! (@itsmeheyy5) March 14, 2022
'Milking' India's IIT, IIM, nit craze ?? https://t.co/jA0MliIztD
— Sherlocked! (@itsmeheyy5) March 14, 2022
ట్విట్టర్‌లో ఓ వ్యక్తి పాల ప్యాకెట్ ఫొటోను పోస్టు చేసి.. ‘పాల ప్యాకెట్‌పై మీ కళాశాల పేరు రాయడం వెనుక మీ ఉద్దేశం ఏంటి?. పాల ప్యాకెట్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీకి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశం లేదు. కానీ నమ్మకం అనేది ఉత్పత్తిలోని నాణ్యత ఆధారంగా రావాలి. మీరు చదువుకొన్న కళాశాల వళ్లకాదు’ అని పేర్కొన్నారు. అదే విధంగా ప్రజల్లో నమ్మకం పొందాలంటే కొంత సమయం పడుతుందని, కళాశాల పేరు ఉపయోగించుకొని ఉత్పత్తిని ముందుకు తీసుకెళ్లడం మంచి ఆలోచననే అని మరి కొందరు సమర్థిస్తున్నారు. ఇంకొందరు ఐఐఎం కళాశాలను తప్పుబడుతున్నారు.
LIC Policy: ఒక్కసారి ప్రీమియం కడితే రూ.12,000 పెన్షన్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే
ఐఐఎం అంటే "ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్కింగ్ , నేను చనిపోయే వరకు నా ఐఐఎం డిగ్రీ" అని హాస్యనటుడు అదితి మిట్టల్ ట్వీట్ చేశారు. ట్విటర్ యూజర్ హరి బి కురుప్..‘పూర్తిగా వారి డిగ్రీని పాలు చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. చిత్రాంజన్ అగర్వాల్ అనే మరో వినియోగదారు ట్వీట్ చేస్తూ..‘పాలుకు క్రెడిబిలిటీని జోడించాలని చేస్తుంటే.. అది అంత విశ్వసనీయంగా ఉండకపోవచ్చు?’ అన్నారు. అదే విధంగా ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వికాష్ ప్రకాస్ సింగ్ చేసిన ట్వీట్‌లో.. ‘అలాంటి ముద్రలకు విలువ ఇస్తున్న ప్రజలది అసలు తప్పు. అలాంటి వారు ఉండబట్టే ఇలాంటి అడ్వెర్టైజ్‌మెంట్లు చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో స్టార్టప్ కంపెనీలకు వచ్చే ఫండ్స్‌పై ప్రభావం కనిపిస్తుంది. పాల ప్యాకెట్ కొనుగోలుపై ఎవరి అభిప్రాయాలు వారివి.’ అని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.