ఇండియన్ మార్కెట్లోకి కొత్త ఈవీ బైక్స్(E Bikes) లాంచ్ అవుతున్నాయి. ఈ సెగ్మెంట్లో ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ మెజారిటీ షేర్‌ను ఆక్రమించింది. ఇప్పుడు బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ ఐగోవైస్ మొబిలిటీ (iGowwise Mobility) కూడా ఇ-బైక్ లాంచింగ్‌కు(Launching) సిద్ధమవుతోంది. ఈ కంపెనీ 2W ఎలక్ట్రిక్ వెహికల్ Trigo BX4ను ప్రీ లాంచ్ చేయనుంది. 2023 జనవరి 26 నాటికి దీన్ని ఇండియన్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రకటించింది. స్పేస్, సేఫ్టీ, SUV కంఫర్ట్ కోరుకునే అర్బన్ ఇండియన్ ఫ్యామిలీస్‌ను లక్ష్యంగా చేసుకొని ట్రిగో BX4 ఇ-బైక్‌ను రూపొందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ SUV ఇ-బైక్‌ను తక్కువ ధరకే అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది.
ట్రిగో BX4 బైక్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. బ్యాటరీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని కంపెనీ తెలిపింది. Trigo BX4 బేస్ ధర రూ.1.1 లక్షల నుంచి రూ.1.2 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 145 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బైక్ 180 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, గరిష్టంగా 75 KMPH వేగంతో ప్రయాణిస్తుంది.
FD Rates Hike: ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు పెంచిన మరో బ్యాంక్.. గరిష్టంగా 8 శాతం.. పూర్తి వివరాలు
ఇ-బైక్ ఫీచర్లు
ఈ SUV ఇ-బైక్ ఆప్టిమల్ స్టెబిలిటీ, తక్కువ వేగంలో సెల్ఫ్ స్టెబిలైజేషన్, అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఆటో-స్వివెల్లింగ్ వంటి ఫీచర్లను అందిస్తోంది. 6 అంగుళాల ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ డిస్ప్లే, సెన్సిబుల్ స్మార్ట్ ఛార్జింగ్ ఆప్షన్లు దీంట్లో ఉంటాయి. బైక్‌లోని 15 ఆంప్స్ హైపర్-ఫాస్ట్ ఆన్‌బోర్డ్ ఛార్జర్‌ను ఇప్పటికే ఉన్న ఏదైనా పోర్ట్‌లో కూడా ప్లగ్ చేయవచ్చు.
ట్రిగో హై-ఎండ్ టెక్ వేరియంట్ ప్రత్యేకమైన ఫీచర్లతో రానుంది. ఆల్వేస్ ఫుట్ ఆన్‌బోర్డ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు ఎలక్ట్రానిక్ ఇంటెలిజెంట్ స్టెబిలైజర్‌తో సహా అనేక ఆప్షన్లు దీంట్లో అందిస్తోంది. ఈ స్పెసిఫికేషన్లతో.. రోడ్డు ఎంత బురదగా లేదా గుంతలు పడినప్పటికీ, రైడర్ తన కాళ్లను నేలపై ఉంచాల్సిన అవసరం ఉండదు. Trigo BX4 ద్వారా టూవీలర్ సౌలభ్యం, ఎజిలిటీ & పార్కింగ్ సౌలభ్యం వంటి వాటితో పాటు సేఫ్టీ, కంఫర్ట్‌ను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
5 వేల మందికి ప్రీ బుకింగ్ బెనిఫిట్స్
ఈ లేటెస్ట్ బైక్‌ను ఇన్వైట్-ఓన్లీ రెఫరల్ ప్రోగ్రాం ద్వారా పయనీర్స్, ఎర్లీ అడాప్టర్స్ ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. మొదటి 5000 మంది వినియోగదారులు ఎక్స్టెండెడ్ వారంటీలు, ఫ్రీ యాక్సెసరీలు, గ్యారంటీడ్ రీసేల్/బై-బ్యాక్ ఆప్షన్ల వంటి స్పెషల్ బెనిఫిట్స్ పొందవచ్చు.
ఇండియన్ రోడ్స్ కోసం తయారీ
ఐగోవైస్ మొబిలిటీ ఈసీవో శ్రవణ్ అప్పన మాట్లాడుతూ.. ట్రిగో BX4 అనేది భారత్ కోసం తయారు చేసిన స్మార్ట్ SUV అని చెప్పారు. ఈ ప్రొడక్ట్‌ను భారతీయ రహదారి పరిస్థితులు, భారతీయ వినియోగ విధానాలను దృష్టిలో ఉంచుకుని భారతీయ ఇంజినీర్ల సహకారంతో రూపొందించినట్లు స్పష్టం చేశారు. ఈ ప్రొడక్ట్ అన్ని వయసుల వారిని, జెండర్స్‌ను ఆకట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు. కస్స్యూమర్ ఫస్ట్ అండ్ టెక్నాలజీ కంపెనీగా కొత్త, వినూత్నమైన హై-టెక్ మొబిలిటీ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడానికి, ఎలక్ట్రిక్ మొబిలిటీలో కొత్త నమూనాలను ఆవిష్కరించే ప్రయత్నాలను కొనసాగిస్తామని శ్రవణ్ వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto, Automobiles, Electric bike, New electric bike