హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC : రైలు ఆలస్యమైతే మీరు ఈ సర్వీస్ ను ఫ్రీగా పొందవచ్చు.. అది మీ హక్కు..!

IRCTC : రైలు ఆలస్యమైతే మీరు ఈ సర్వీస్ ను ఫ్రీగా పొందవచ్చు.. అది మీ హక్కు..!

IRCTC : రైలు ఆలస్యమైతే మీరు ఈ సర్వీస్ ను ఫ్రీగా పొందవచ్చు.. అది మీ హక్కు..!

IRCTC : రైలు ఆలస్యమైతే మీరు ఈ సర్వీస్ ను ఫ్రీగా పొందవచ్చు.. అది మీ హక్కు..!

IRCTC : ఫాస్ట్‌గా వెళ్లాలనే ఎవరైనా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ తీసుకుంటారు కానీ అది రెండు, మూడు గంటలు లేట్‌గా నడిస్తే వారికి ఇబ్బందులు తప్పవు. ఇలా ఇబ్బందులకు గురయ్యే వారి కోసం IRCTC కీలక నిర్ణయం తీసుకుంది. వారి కోసం ఒక ఫ్రీ సర్వీస్ తీసుకొచ్చింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కొన్నిసార్లు ఇండియన్ రైళ్లు (Indian Trains) రావాల్సిన టైమ్‌కి స్టేషన్‌కి రావు. కొన్నిసార్లు కొన్ని నిమిషాలు ముందుగా వస్తే మరికొన్నిసార్లు నిమిషాల నుంచి గంటల సమయం కూడా ఇవి ఆలస్యమవుతుంటాయి. పొగమంచు, వర్షాలతో పాటు పలు కారణాల వల్ల ట్రైన్స్ గంటలపాటు ఆలస్యంగా రన్ అవుతుంటాయి. అయితే శతాబ్ది, రాజధాని వంటి ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్‌ (Express Trains) ఆలస్యమైతే ప్రయాణికులు ప్యాసింజర్ ట్రైన్‌లో ప్రయాణించినట్లే అవుతుంది. ఫాస్ట్‌గా వెళ్లాలనే ఎవరైనా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ తీసుకుంటారు కానీ అది రెండు, మూడు గంటలు లేట్‌గా నడిస్తే వారికి ఇబ్బందులు తప్పవు.

ఇలా ఇబ్బందులకు గురయ్యే వారికి ఉపశమనం కలిగించేలా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వారి కోసం ఒక ఫ్రీ సర్వీస్ తీసుకొచ్చింది. ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్‌ ఆలస్యమైతే అందులో ప్రయాణించే ప్రయాణికులకు IRCTC ఉచితంగా ఫుడ్ అందించడం ప్రారంభించింది.

* ఈ ఫ్రీ ఫుడ్ ఎప్పుడు పొందొచ్చు?

ఐఆర్‌సీటీసీ (IRCTC) ప్రయాణికులకు ఫ్రీ ఫుడ్ అందించడానికి కొన్ని నిబంధనలను తీసుకొచ్చింది. ఆ నిబంధనల ప్రకారం, రైలు 30 నిమిషాలు లేదా గంట ఆలస్యమైనా ఫ్రీ ఫుడ్ లభించదు. ట్రైన్ కనీసం రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యమయితేనే క్యాటరింగ్ పాలసీ ప్రకారం ప్రయాణికులు ఉచితంగా ఆహారం పొందొచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఉంది.

అదేంటంటే, శతాబ్ది (Shatabdi), రాజధాని (Rajdhani), దురంతో (Duronto) వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రయాణికులకు మాత్రమే ఈ సదుపాయం లభిస్తుంది. నిజానికి సమయానికి ట్రైన్ నడవకపోతే ప్యాసింజర్లు ఫుడ్ కూడా తినలేరు. దీని వల్ల వారికి ఎంతో అసౌకర్యం కలుగుతుంది. అలా తిప్పలు వారు పడకూడదని ఐఆర్‌సీటీసీ గొప్ప ఆలోచనతో ఈ ఉచిత సేవను పరిచయం చేసింది.

ఇది కూడా చదవండి : హైదరాబాద్ నుంచి తిరుపతికి 4 స్పెషల్ రైళ్లు.. తేదీలు, టైమింగ్స్ వివరాలివే..

* ఐఆర్‌సీటీసీ ఫ్రీగా అందించే ఆహారం ఏంటి?

పైన పేర్కొన్న ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిర్ణీత స్టేషన్‌కు షెడ్యూల్ కంటే రెండు గంటలు లేదా అంతకన్నా ఎక్కువ ఆలస్యంగా నడుస్తున్నట్లయితే ఐఆర్‌సీటీసీ మీకు ఆహారం, ఒక కూల్ డ్రింక్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తుంది.

- బ్రేక్‌ఫాస్ట్‌ టీ/కాఫీ

ఐఆర్‌సీటీసీ పాలసీ ప్రకారం, బ్రేక్‌ఫాస్ట్‌లో కొంచెం టీ లేదా కాఫీ ఉచితంగా అందుకోవచ్చు. అలానే రెండు సీసీఎం- అప్రూవ్డ్‌ బిస్కెట్లు పొందొచ్చు. వీటిలో చక్కెర లేని ఆల్టర్నేటివ్స్‌ కూడా ఎంచుకోవచ్చు.

- ఈవెనింగ్ టీ

గోధుమ/ నాలుగు వైట్ బ్రెడ్ ముక్కలు, 1-బటర్ చిప్లెట్ (8-10 గ్రాములు), 200 ml ఫ్రూట్ డ్రింక్ ఉచితంగా పొందొచ్చు. ఒక బటర్ చిపోట్లే ప్యాక్ ఫ్రీగా తీసుకోవచ్చు.

- లంచ్/డిన్నర్

లంచ్/డిన్నర్ సమయంలో ట్రైన్ ఆలస్యంగా వస్తే ప్రయాణికులు రెండు డైనింగ్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్‌లో 200 గ్రాముల అన్నం, 100 గ్రాముల పప్పు లేదా రాజ్మా చోలే, 15 గ్రాముల ఊరగాయ ప్యాకెట్ ఫ్రీగా తీసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్‌లో 175 గ్రాముల బరువున్న ఏడు పూరీలు, 100 గ్రాముల మిక్స్ వెజ్ లేదా ఆలూ బజ్జి, 15 గ్రాముల ఊరగాయ ప్యాకెట్ (Pickle Packet), ఉప్పు, పెప్పర్ (Pepper) ప్యాకెట్లు పొందొచ్చు. ట్రైన్‌ ఆలస్యంగా కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రతి ప్రయాణికుడు ఈ ఉచిత ఆహార హక్కును సద్వినియోగం చేసుకోవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Indian Railways, IRCTC, IRCTC Tourism, Trains

ఉత్తమ కథలు