SBI Card: మీ ఎస్‌బీఐ కార్డు పోయిందా? వెంటనే ఇలా బ్లాక్ చేయొచ్చు

SBI Card: మీ ఎస్‌బీఐ కార్డు పోయిందా? వెంటనే ఇలా బ్లాక్ చేయొచ్చు

SBI Card | మీ కార్డును ఇతరులు దుర్వినియోగం చేసేలోపే కార్డును బ్లాక్ చేసే చేయొచ్చు. మరి మీ కార్డు పోగొట్టుకుంటే వెంటనే ఎలా బ్లాక్ చేయాలో తెలుసుకోండి.

  • Share this:
    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో లక్షలాది మందికి అకౌంట్లు ఉన్నాయి. మరి మీరు కూడా ఎస్‌బీఐ ఖాతాదారులా? అయితే మీ కార్డు పోగొట్టుకున్నా, ఎవరైనా చోరీ చేసినా వెంటనే బ్లాక్ చేయొచ్చు. కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ కార్డును ఇతరులు దుర్వినియోగం చేసేలోపే కార్డును బ్లాక్ చేసే చేయొచ్చు. మరి మీ కార్డు పోగొట్టుకుంటే వెంటనే ఎలా బ్లాక్ చేయాలో తెలుసుకోండి.

    స్టెప్ 1: ముందు మీరు www.onlinesbi.com వెబ్‌సైట్ ఓపెన్ చేసి లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి.
    స్టెప్ 2: "e-Services" ట్యాబ్‌లో "Block ATM Card" క్లిక్ చేయండి.
    స్టెప్ 3: ఏ డెబిట్ కార్డు బ్లాక్ చేయాలో ఎంచుకోవచ్చు.
    స్టెప్ 4: ఇక్కడే మీకు బ్లాక్ చేసిన, అన్‌బ్లాక్ చేసిన కార్డుల వివరాలు ఉంటాయి. మొదటి, చివరి నాలుగు అంకెల ద్వారా కార్డులను గుర్తించొచ్చు.
    స్టెప్ 5: మీరు బ్లాక్ చేయాలనుకున్న కార్డును ఎంచుకొని సబ్మిట్‌పైన క్లిక్ చేయండి.
    స్టెప్ 6: ఆథెంటికేషన్ కోసం ప్రొఫైల్ పాస్‌వర్డ్ లేదా ఓటీపీ ఎంచుకోండి.
    స్టెప్ 7: తర్వాతి స్క్రీన్‌లో ప్రొఫైల్ పాస్‌వర్డ్ లేదా ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫమ్ పైన క్లిక్ చేయండి.
    స్టెప్ 8: క్షణాల్లో మీ డెబిట్ కార్డ్ బ్లాక్ అవుతుంది. మీకు టికెట్ నెంబర్ కనిపిస్తుంది. రిఫరెన్స్ కోసం టికెట్ నెంబర్ నోట్ చేసుకోండి.

    Photos: ఫోటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించిన శీతాకాల అందాలు

    ఇవి కూడా చదవండి:

    PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా చేయండి

    Good News: ఐటీ ఉద్యోగులకు డబుల్ ధమాకా... భారీగా పెరగనున్న జీతాలు

    Uber Free Calls: మీ నెంబర్ కనిపించకుండా ఊబెర్ డ్రైవర్‌కు ఇలా కాల్ చేయొచ్చు...

     
    First published: