Personal Finance: జీరో బ్యాలెన్స్ అకౌంట్‌కు ఈ 5 బ్యాంకులు బెస్ట్

Zero Balance Saving Account | ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. అయితే వీటి గురించి తెలియక ఈ అకౌంట్ సేవల్ని ఉపయోగించుకోలేకపోతున్నారు కస్టమర్లు.

news18-telugu
Updated: February 21, 2019, 3:25 PM IST
Personal Finance: జీరో బ్యాలెన్స్ అకౌంట్‌కు ఈ 5 బ్యాంకులు బెస్ట్
జీరో బ్యాలెన్స్ అకౌంట్‌కు ఈ 5 బ్యాంకులు బెస్ట్
news18-telugu
Updated: February 21, 2019, 3:25 PM IST
సేవింగ్స్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ తప్పనిసరైపోయింది. మినిమమ్ బ్యాలెన్స్ పరిమితిని బట్టి బ్యాంకులు సేవల్ని అందిస్తుంటాయి. అయితే మీరు ఎలాంటి బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు జీరో బ్యాలెన్స్‌తో బ్యాంక్ అకౌంట్ మంచి ఆప్షన్. ఈ అకౌంట్ తీసుకుంటే అందులో మీరు కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అకౌంట్‌లో డబ్బులు లేకపోతే ఛార్జీలు చెల్లించనక్కర్లేదు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. అయితే వీటి గురించి తెలియక ఈ అకౌంట్ సేవల్ని ఉపయోగించుకోలేకపోతున్నారు కస్టమర్లు. మరి ఏఏ బ్యాంకులు ఎలాంటి అకౌంట్లను ఇస్తున్నాయో తెలుసుకోండి.

Read this: PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్‌ లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి

Zero Balance Saving Account, how to open Zero Balance Saving Account, zero balance saving account in hdfc, zero balance saving account in axis bank, axis asap account, hdfc zero balance account, sbi zero balance account, జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్, ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్, హెచ్‌డీఎఫ్‌సీ జీరో బ్యాలెన్స్ అకౌంట్



BSBD-స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జీరో బ్యాలెన్స్‌తో 'బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్'(బీఎస్‌బీడీ) అకౌంట్ ఉంటుంది. మీ దగ్గర కేవైసీ డాక్యుమెంట్లు అన్నీ పక్కాగా ఉంటే ఈ అకౌంట్ తెరవచ్చు. ఇందులో ఎలాంటి ఛార్జీలు, ఫీజులు ఉండవు. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్‌బీడీ) అకౌంట్‌ను వ్యక్తిగతంగా, జాయింట్‌‌గా మెయింటైన్ చేయొచ్చు. ఈ అకౌంట్‌‌లో రూ.1 కోటి వరకు 3.5 శాతం, రూ. 1 కోటి పైన 4 శాతం వడ్డీ లభిస్తుంది. ఎంత డబ్బైనా ఇందులో జమ చేయొచ్చు. అకౌంట్ హోల్డర్లకు రూపే డెబిట్ కార్డు ఇస్తుంది బ్యాంకు. అయితే ఈ బ్యాంకులో ఇతర సేవింగ్స్ అకౌంట్ లేనివాళ్లే 'బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్'(బీఎస్‌బీడీ) అకౌంట్ తెరవచ్చు.



Read this: Personal Finance: మీ బ్యాంక్ అకౌంట్ వాడట్లేదా? ఇలా క్లోజ్ చేసెయ్యండి

ASAP- యాక్సిస్ బ్యాంక్

Loading...
యాక్సిస్ బ్యాంక్ కూడా ASAP పేరుతో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎక్కువ వివరాలు అవసరం లేదు. కేవలం మీ మొబైల్ నెంబర్, ఆధార్, పాన్ వివరాలు ఉంటే చాలు. రూ.50 లక్షల వరకు 3.5 శాతం, రూ.50 లక్షల నుంచి రూ.100 కోట్ల వరకు 4 శాతం, రూ.100 కోట్లకు పైన డిపాజిట్లకు 6 శాతం వడ్డీ లభిస్తుంది. రూ.1,000 కన్నా ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే ఆటో స్వీప్ ఫ్లెక్సీ ఎఫ్‌డీ సదుపాయం ఉంటుంది. అంటే... మీ అకౌంట్‌లో రూ.10,000 ఉంటే రూ.9,000 ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోకి వెళ్తాయి. ఆ డబ్బుకు ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ఎంత వడ్డీ ఉంటే అంత వస్తుంది. అయితే గరిష్టంగా రూ.1,00,000 మాత్రమే డిపాజిట్ చేయొచ్చు.

Read this: LIC Micro Bachat: ఎల్ఐసీ నుంచి 'మైక్రో బచత్ ప్లాన్'... వివరాలివే

BSBDA Small Account- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్


బీఎస్‌బీడీఏ స్మాల్ అకౌంట్ పేరుతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీసుకోవచ్చు. ఈ అకౌంట్‌లో రూ.50 లక్షల వరకు 3.5 శాతం, రూ.50 లక్షల కన్నా ఎక్కువ మొత్తానికి 4 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ ఖాతా తెరిచిన వారికి రూపే డెబిట్ కార్డు ఇస్తుంది బ్యాంకు.

Read this: SBI Offer: హోమ్‌ లోన్‌పై జీరో ప్రాసెసింగ్ ఫీజ్... ఫిబ్రవరి 28 వరకే అవకాశం

Zero Balance Saving Account, how to open Zero Balance Saving Account, zero balance saving account in hdfc, zero balance saving account in axis bank, axis asap account, hdfc zero balance account, sbi zero balance account, జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్, ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్, హెచ్‌డీఎఫ్‌సీ జీరో బ్యాలెన్స్ అకౌంట్


Zero Balance Saving Account- ఐసీఐసీఐ బ్యాంక్


ఐసీఐసీఐలో జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే డెబిట్ కార్డుతో పాటు ఉచితంగా చెక్ బుక్ లభిస్తుంది. ఈ అకౌంట్‌లో రూ.50 లక్షల వరకు 3.5 శాతం, రూ.50 లక్షల కన్నా ఎక్కువ మొత్తానికి 4 శాతం వడ్డీ లభిస్తుంది. వడ్డీని ఆరు నెలలకోసారి చెల్లిస్తారు. యాక్సిస్ బ్యాంకులో ఎలాంటి సేవింగ్స్ అకౌంట్ లేనివాళ్లే జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

AASAAN- స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్


స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌లో ఆసాన్ పేరుతో జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీసుకోవచ్చు. ఇది డిజిటల్ అకౌంట్. ఈ అకౌంట్‌లో రూ.50 లక్షల వరకు 3.5 శాతం, రూ.50 లక్షల కన్నా ఎక్కువ మొత్తానికి 4 శాతం వడ్డీ లభిస్తుంది. డెబిట్ కార్డుతో పాటు చెక్ బుక్ లభిస్తాయి.

Vivo V15 Pro: 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వివో వీ15 ప్రో రిలీజ్


ఇవి కూడా చదవండి:

Railway Jobs: 1,30,000 రైల్వే ఉద్యోగాలకు ఆర్ఆర్‌బీ ప్రకటన

Jobs: మీ దగ్గర ఈ స్కిల్స్ ఉంటే మంచి ఉద్యోగాలు... భారీ జీతాలు...
First published: February 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...