హోమ్ /వార్తలు /బిజినెస్ /

Take-home Salary: మీ టేక్ హోమ్ శాలరీని పెంచుకోవాలనుకుంటున్నారా? ఈ సింపుల్ ట్రిక్‌ ఫాలోకండి..

Take-home Salary: మీ టేక్ హోమ్ శాలరీని పెంచుకోవాలనుకుంటున్నారా? ఈ సింపుల్ ట్రిక్‌ ఫాలోకండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Take-home Salary: టేక్-హోమ్ శాలరీ పెంచుకోవాలని భావించే ఉద్యోగులు.. శాలరీ స్ట్రక్చర్‌లో చిన్న మార్పుతో టేక్‌-హోమ్‌ శాలరీని పెంచుకోవచ్చు. దీని కోసం ఉద్యోగులు తాము పని చేస్తున్న సంస్థలోని HR లేదా పేరోల్ విభాగాన్ని సంప్రదించాలి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఉద్యోగాలు (Jobs) చేసేవారు అందరూ తమ టేక్-హోమ్ లేదా ఇన్-హ్యాండ్ శాలరీ (Salary) ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు. అయితే రూల్స్ ప్రకారం డిడక్షన్స్ ఉండటంతో చేతికందే మొత్తం కొంతవరకు తగ్గుతుంది. అంటే కొన్ని రకాల డిడక్షన్లు టేక్‌-హోమ్‌ శాలరీపై ప్రభావం చూపుతాయి. వీటిల్లో ప్రధానంగా ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్‌(EPF- Employees' Provident Fund) కంట్రిబ్యూషన్‌లు, రీయింబర్స్‌మెంట్ స్ట్రక్చర్లు(Reimbursement Structures), ఆదాయ పన్ను డిడక్షన్‌లు ఉంటాయి. అయితే ఎక్కువ పెట్టుబడి లేకుండా టేక్-హోమ్ శాలరీ పెంచుకోవాలని భావించే ఉద్యోగులు.. శాలరీ స్ట్రక్చర్‌లో చిన్న మార్పుతో టేక్‌-హోమ్‌ శాలరీని పెంచుకోవచ్చు. దీని కోసం ఉద్యోగులు తాము పని చేస్తున్న సంస్థలోని HR లేదా పేరోల్ విభాగాన్ని సంప్రదించాలి.

సాధారణంగా ఉద్యోగులు తమ గ్రాస్‌ శాలరీతో పోలిస్తే 20 నుంచి 30 శాతం తక్కువ టేక్-హోమ్ శాలరీ అందుకుంటుంటారు. కానీ ప్రభుత్వ నియమం ప్రకారం.. ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కోసం ప్రతి నెలా బేసిక్‌ శాలరీలో 12 శాతం డిడక్ట్‌ చేస్తారు. ఈ నియమాన్ని ఉల్లంఘించడాన్ని ప్రభుత్వం నేరంగా పరిగణిస్తుంది. ఉద్యోగుల భవిష్యత్తు కోసం తీసుకొచ్చిన ఈ పథకాన్ని ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది.

* ఈపీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ తగ్గించుకొనే అవకాశం

ఉద్యోగి బేసిక్‌ శాలరీ నెలకు రూ.20,000 అయితే.. సంబంధిత నెలకు చెల్లించాల్సిన ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కంట్రిబ్యూషన్‌ 20,000లో 12 శాతంగా ఉంటుంది. అంటే రూ.2400 బేసిక్‌ శాలరీలో డిడక్ట్‌ చేస్తారు. యజమాని కూడా 8.33 శాతం ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్(EPS)కి, 3.67 ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌కి కంట్రిబ్యూట్‌ చేయాల్సి ఉంటుంది.

కాబట్టి రూ.20,000లో 3.67 శాతం.. రూ.734 అవుతుంది. యజమాని కాంట్రిబ్యూషన్‌ ఉద్యోగి CTCలో భాగం కాబట్టి.. ఉద్యోగి శాలరీ నుంచి మొత్తం ఈపీఎఫ్‌ కింద రూ.2400+ రూ.734= రూ.3134 డిడక్ట్‌ అవుతుంది.

ప్రస్తుతం కనీసం రూ.15,000 జీతం ఉన్న వ్యక్తి ఈపీఎఫ్‌లో భాగం కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తప్పనిసరి ఈపీఎఫ్‌ డిడక్షన్‌ రూ.15,000లో 12 శాతం.. అంటే రూ.1800. ఉద్యోగి బేసిక్‌ శాలరీ రూ.20,000 అయినా కానీ.. రూ.1800 మాత్రమే ఈపీఎఫ్‌కి చెల్లించేలా చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కంట్రిబ్యూషన్‌ తగ్గించుకోవడం ద్వారా టేక్-హోమ్ శాలరీ పెరుగుతుంది.

ఇది కూడా చదవండి : డబ్బులు దాచుకునే వారికి మరో కొత్త స్కీమ్.. చేరితే భారీ లాభం!

* రీయింబర్స్‌మెంట్‌ స్ట్రక్చర్‌లో మార్పులు

ఉద్యోగి తన టేక్-హోమ్ శాలరీని పెంచుకోవడానికి ఈపీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ తగ్గించుకోవడంతోపాటు మరొక మార్గం ఉంది. రీయింబర్స్‌మెంట్ స్ట్రక్చర్‌లలో అవసరమైన మార్పులు చేయడం ద్వారా టేక్‌- హోమ్‌ శాలరీని పెంచుకోవచ్చు. అయితే ఎంప్లాయీస్‌ ప్రావిడెంగ్ ఫండ్‌ లాగానే ఇది కూడా చెల్లించాల్సిన పన్నుపై ప్రభావం చూపుతుంది.

కొన్ని ట్యాక్స్‌ సేవింగ్స్‌ పెట్టుబడులు చేయాల్సి రావచ్చు. టేక్‌-హోమ్‌ శాలరీని పెంచుకోవడానికి ఉద్యోగులు తాము పనిచేస్తున్న సంస్థలోని హెచ్‌ఆర్‌లను సంప్రదించి, పూర్తి నియమాలు తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో అనవసరమైన సమస్యలను ఎదుర్కోకుండా సరైన ప్రణాళికతో డిడక్షన్స్‌ను తగ్గించుకోవాలని తెలిపారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: EPFO, Full salary, Hike salary, Personal Finance

ఉత్తమ కథలు