IF YOU WANT AN UNSECURED LOAN OF UP TO RS 1 CRORE PROVIDED BY THE MODI GOVERNMENT FOR BUSINESS MK
Business Ideas: వ్యాపారం కోసం మోదీ ప్రభుత్వం అందిస్తున్న 1 కోటి వరకు సెక్యూరిటీ లేని రుణం కావాలా..ఇలా అప్లై చేయండి..
ప్రతీకాత్మక చిత్రం
ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా... సొంత కాళ్లపై నిలబడి వ్యాపారంలో రాణించాలనేది ప్రతీ ఒక్కరి కల. అయితే అందుకు పెట్టుబడి ఎలా పొందాలి అనేది ప్రతీ ఒక్కరు ఆలోచిస్తుంటారు. అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్టాండప్ ఇండియా (Standup India) స్కీమ్ ద్వారా నిరుద్యోగులు ఒకటి కాదు రెండు కాదు 10 లక్షల నుండి 1 కోటి వరకు సెక్యూరిటీ లేకుండా లోన్ పొందే అవకాశం కల్పించింది.
ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా... సొంత కాళ్లపై నిలబడి వ్యాపారంలో రాణించాలనేది ప్రతీ ఒక్కరి కల. అయితే అందుకు పెట్టుబడి ఎలా పొందాలి అనేది ప్రతీ ఒక్కరు ఆలోచిస్తుంటారు. అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్టాండప్ ఇండియా (Standup India) స్కీమ్ ద్వారా నిరుద్యోగులు ఒకటి కాదు రెండు కాదు 10 లక్షల నుండి 1 కోటి వరకు సెక్యూరిటీ లేకుండా లోన్ పొందే అవకాశం కల్పించింది. పేదల అభివృద్ధి కోసం, యువతకు, మహిళలకు, చిరు వ్యాపారవేత్తలకు, ఔత్సాహికులకు.. సంక్షేమ పథకాలను మోదీ అందుబాటులోకి తెచ్చారు. అందులో ప్రధానమైనది స్టాండప్ ఇండియా స్కీమ్. ఈ పథకం ద్వారా షెడ్యూల్డ్ కులాల మరియు తెగలకు చెందిన మహిళలకు అందిస్తారు. ఈ పథకం ఆర్థిక సేవల శాఖ (DFS), ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతోంది. ఒక బ్యాంకు శాఖ కనీసం ఒక షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) లేదా షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) మహిళకు స్టాండ్ అప్ ఇండియా(Standup India) పథకం కింద రూ 10 లక్షల నుంచి 1 కోటి రూపాయలు రుణాన్ని అందించవచ్చు. ఒకవేళ మీరు ఒక సంస్థ ద్వారా రుణం అప్లై చేసుకున్నట్లయితే అందులో కనీసం 51 శాతం వాటా ఒక SC / ST లేదా మహిళ పారిశ్రామికవేత్త కలిగి ఉండాలి. అప్పుడు మీకు రుణం సులభంగా లభిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం స్టాండ్-అప్ ఇండియా పథకం కింద షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన మహిళలకు రుణాలు అందిస్తున్నారు. ఈ పథకం ఏప్రిల్ 5, 2016న ప్రారంభించగా, 2025 వరకు పొడిగించారు. స్టాండ్ అప్ ఇండియా పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుంటే. వ్యాపారం కోసం ఏదైనా ఒక పరిశ్రమను ఏర్పాటు చేయడానికి కనీసం ఒక షెడ్యూల్డ్ కులం (SC) లేదా షెడ్యూల్డ్ తెగ (ST) రుణగ్రహీతకు , బ్యాంకు శాఖలో కనీసం ఒక మహిళ రుణగ్రహీతకు 10 లక్షల నుండి 1 కోటి మధ్య బ్యాంకు రుణాలను అందించడం స్టాండ్-అప్ ఇండియా పథకం , లక్ష్యం. సౌకర్యం కల్పించాలి.
స్టాండ్ అప్ ఇండియాకు అర్హులు ఎవరు..
దరఖాస్తుదారుడి వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్లు మాత్రమే రుణ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న సంస్థలు , వ్యాపారాలు వంటి వ్యక్తులు కాని వ్యక్తులు కూడా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సంస్థ 51 శాతం నియంత్రణ వాటాను SC/ST లేదా మహిళా పారిశ్రామికవేత్తకు ఇవ్వాల్సి ఉంటుంది.
ఎక్కడ అప్లై చేయాలి...
>> షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్, అన్ని శాఖల్లోనూ ఈ పథకం అందుబాటులో ఉంది.
>> నేరుగా బ్యాంకు శాఖను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.
>> SIDBI స్టాండ్-అప్ ఇండియా పోర్టల్ ద్వారా కూడా అప్లై చేయవచ్చు.
>> లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.
చెల్లింపు - 18 నెలల గరిష్ట విరామం (మారటోరియం) కాలంతో 7 సంవత్సరాలలో తిరిగి చెల్లించాలి.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.