హోమ్ /వార్తలు /బిజినెస్ /

Draft Telecom Bill: సిమ్ కార్డ్, OTT సేవల కోసం ఫేక్‌ డీటైల్స్‌ ఇస్తే ఏడాది జైలు శిక్ష.. కొత్త రూల్స్ ఇవే..

Draft Telecom Bill: సిమ్ కార్డ్, OTT సేవల కోసం ఫేక్‌ డీటైల్స్‌ ఇస్తే ఏడాది జైలు శిక్ష.. కొత్త రూల్స్ ఇవే..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Draft Telecom Bill: సైబర్‌ నేరాలను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రాఫ్ట్ ఇండియన్ టెలికమ్యూనికేషన్స్ బిల్లు, 2022ను టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ సిద్ధం చేసింది. ఇకపై ఫేక్‌ ఐడీ ప్రూఫ్‌లతో సిమ్‌ కార్డ్‌లను పొందడం, ఆన్‌లైన్‌లో OTT సేవలను పొందడానికి ఫేక్‌ డీటైల్స్ ఇస్తే..

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

సైబర్‌ నేరాలను అరికట్టేందుకు కేంద్రం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. డ్రాఫ్ట్ ఇండియన్ టెలికమ్యూనికేషన్స్ బిల్లు (Draft Telecom Bill), 2022ను టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ సిద్ధం చేసింది. ఇకపై ఫేక్‌ ఐడీ ప్రూఫ్‌ల (Fake Id Proofs)తో సిమ్‌ కార్డ్‌లను పొందడం, ఆన్‌లైన్‌లో OTT సేవలను పొందడానికి ఫేక్‌ డీటైల్స్‌ ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు. నిబంధనలు ఉల్లంఘించిన వారు జైలు శిక్ష లేదా భారీ జరిమానా ఎదుర్కొనే అవకాశం ఉంది. సైబర్ నేరాలను నిరోధించేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందని కేంద్రం తెలిపింది. ఈ కొత్త బిల్లు నియమ నిబంధనలు, ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

* జైలు శిక్ష లేదా రూ.50 వేలు జరిమానా

ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్లు 2022కు సంబంధించిన డ్రాఫ్ట్‌ ప్రకారం.. మొబైల్ సిమ్ కార్డ్‌ తీసుకోవడానికి లేదా ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫామ్‌లలో, వాట్సాప్‌(WhatsApp), టెలిగ్రామ్(Telegram) వంటి ఇతర అకౌంట్‌లను క్రియేట్‌ చేయడానికి ఫేక్‌ డాక్యుమెంట్లు అందిస్తే ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా రూ.50,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఎకనామిక్‌ టైమ్స్‌ తెలిపిన వివరాల మేరకు.. ఆన్‌లైన్ ఐడెంటిటీ ఫ్రాడ్‌ సమస్యలను తొలగించడానికి డ్రాఫ్ట్‌లో ఈ నిబంధనలను చేర్చారు.

ఇప్పటి వరకు టెలికమ్యూనికేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ను నియంత్రిస్తున్న లీగల్‌ ఫ్రేమ్‌వర్క్‌ను డ్రాఫ్ట్ ఇండియన్ టెలికమ్యూనికేషన్స్ బిల్లు, 2022 భర్తీ చేయనుంది. ఈ బిల్లు ప్రస్తుతం టెలికమ్యునికేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ను నియంత్రించే మూడు చట్టాలైన ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885, వైర్‌లెస్ టెలిగ్రాఫీ చట్టం 1933, టెలిగ్రాఫ్ వైర్లు (చట్టవిరుద్ధమైన స్వాధీనం) చట్టం 1950ను ఒక గొడుగు కిందకు తీసుకొస్తుంది.

* వారెంట్‌ లేకుండానే అరెస్టు

బిల్లులోని సెక్షన్ 4, సబ్ సెక్షన్ 7 ప్రకారం టెలికాం వినియోగదారులు తమ ట్రూ ఐడెండిటీని ప్రకటించాలని ఎకనామిక్‌ టైమ్స్‌ పేర్కొంది. ఫేక్‌ ఐడెండిటీని అందజేయడం నేరంగా పరిగణిస్తారని, ఒక పోలీసు అధికారి వారెంట్ లేకుండా ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయవచ్చు, అదే విధంగా కోర్టు ఆదేశంతో దర్యాప్తు ప్రారంభించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి : మధ్యతరగతికి మోదీ అదిరిపోయే శుభవార్త.. అక్టోబర్ 1 నుంచి..

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌ రూపొందించిన డ్రాఫ్ట్‌లో..‘టెలికాం సేవలను ఉపయోగించి చేసే సైబర్ మోసాలను నిరోధించడంలో కొత్త నిబంధన సహాయపడుతుంది. అందుకే సంబంధిత అంశాల్లో ఐడెంటిటీకి సంబంధించిన నిబంధనలు బిల్‌లో పొందుపరిచాం.’ అని పేర్కొంది.

* అక్టోబర్‌ 20లోపు అభిప్రాయాలు తెలియజేయాలి

ఇటీవల ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్‌ అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..‘కొత్త బిల్లు సైబర్ మోసాలను నిరోధిస్తుంది. మోసాలు జరిగిన తర్వాత కాకుండా జరగకముందే చాలా కోణాల్లో నేరాల నియంత్రణకు సహకరిస్తుంది. సక్రమంగా KYC రూల్స్‌ అమలుకావడానికి, వినియోగదారులు ఫేక్‌ ఐడెంటిటీలు వినియోగించకుండా ఉండేందుకు, డ్రాఫ్ట్‌ టెలికాం బిల్లులో వివిధ రకాల నిబంధనలు అమలు చేయాలని నమ్ముతున్నాం.’ అని చెప్పారు. డ్రాఫ్ట్‌ బిల్లును అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. బిల్లుపై ప్రజల అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 20లోపు అభిప్రాయాలను తెలియజేయాలని సూచించారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Central Government, CYBER CRIME, Ott, Sim card

ఉత్తమ కథలు