మీరు మీ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేశారా? ఇంకా చేయలేదా? పాన్ కార్డును ఆధార్ నెంబర్‌తో లింక్ చేయకపోతే ఇక ఆ కార్డు పనిచేయకపోవచ్చు. ఆ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తోంది. పాన్ కార్డ్-ఆధార్ నెంబర్ లింకేజ్ కోసం 2019 మార్చి 31 వరకే గడువు ఉండగా... 2019 సెప్టెంబర్ 30 వరకు తేదీని పొడిగించింది కేంద్రం. ఇంకా 20 కోట్ల పాన్ కార్డుల్ని ఆధార్‌తో లింక్ చేయలేదని తాజా లెక్కలు చెబుతున్నాయి. కేంద్రం మొత్తం 44 కోట్ల పాన్ కార్డుల్ని జారీ చేయగా... అందులో 20 కోట్ల పాన్ కార్డుల్ని ఇంకా లింక్ చేయలేదు. కేవలం 24 కోట్ల పాన్ కార్డుల్ని మాత్రమే ఆధార్ నెంబర్‌తో లింక్ చేశారని ఆదాయపు పన్ను శాఖ అధికారులు తాజాగా వెల్లడించారు. ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులు భారీగా ఉండటంతో అవన్నీ నకిలీ కార్డులు కావొచ్చని ఆదాయపు పన్ను శాఖ భావిస్తోంది. వాస్తవానికి ఇలా నకిలీ కార్డుల్ని గుర్తించేందుకే పాన్ కార్డుల్ని ఆధార్ నెంబర్‌తో లింక్ చేయాలన్న నిర్ణయం తీసుకుంది ఆదాయపు పన్ను శాఖ. పన్ను ఎగవేసేందుకు డూప్లికేట్ కార్డులు వాడుతున్నారన్న అనుమానాలున్నాయి.
Read this: PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్ లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి
ఇప్పటివరకు పాన్ కార్డుల్ని ఆధార్ నెంబర్‌తో లింక్ చేయనివారికి 2019 సెప్టెంబర్ 30 వరకు గడువుంది. పాన్-ఆధార్ లింకేంజ్ కోసం ఆదాయపు పన్ను శాఖ గడువు పెంచడం ఇది ఆరోసారి. సెప్టెంబర్ 30 తర్వాత ఇక గడువు పెంచే అవకాశం లేకపోవచ్చు. ఆ తర్వాత ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులన్నీ డీయాక్టివేట్ అయ్యే అవకాశముంది. కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకోవచ్చు. అంతేకాదు పాన్, ఆధార్ లింక్ చేయకపోతే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే అవకాశం కూడా లేదు. 2019 జూలై 31 లోగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేయాలనుకునేవాళ్లు జూలై 31 లోపే పాన్, ఆధార్ లింక్ చేయాలి. లేకపోతే ఐటీ రిటర్స్ ఫైల్ చేయడం సాధ్యం కాదు.
Read this: పాన్‌తో ఆధార్ లింక్ చేయడానికి 4 మార్గాలు... ఐటీ శాఖ టిప్స్
పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయడం రాకెట్ సైన్స్ ఏమీ కాదు. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో రెండు నిమిషాల్లో ఆధార్, పాన్ లింక్ చేయొచ్చు. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ incometaxindiaefiling.gov.in ఓపెన్ చేయాలి. మొదటి పేజీలోనే 'Linking Aadhaar' పేరుతో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీ పేరు, పుట్టిన తేదీ లాంటి వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయాలి. ఆ వివరాలన్నీ మీ ఆధార్ కార్డుపై ఉన్నట్టుగా ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి
'Link Aadhaar' పైన క్లిక్ చేస్తే మీ పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.
Photos: అదిరిపోయిన ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్
ఇవి కూడా చదవండి:
PAN Card: పాన్ కార్డులో తప్పుల్ని సరిచేసుకోండి ఇలా...
Pan card: ఉమాంగ్ యాప్‌లో పాన్ కార్డు సేవలు... ఇలా అప్లై చేయొచ్చు
PAN Card: మీ పాన్ కార్డులో అడ్రస్ ఇలా మార్చుకోవచ్చు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar Card, PAN, Personal Finance