మీ దగ్గర పాత కరెన్సీ నోట్లు ఉన్నాయా? అవేమీ ఉపయోగపడవని అలా బీరువాలో లేదా ఏదైనా బాక్సులో వదిలేశారా? ఆ పాత కరెన్సీ నోట్లే మిమ్మల్ని లక్షాధికారుల్ని చేయగలవు. అవును... ఇది అక్షరాలా నిజం. మీ దగ్గర పాత కరెన్సీ నోట్లు ఉంటే వాటితో లక్షాధికారులు కావొచ్చు. మీ దగ్గర పాత రూ.1, రూ.5, రూ.10 నోట్లు ఉంటే వాటితో ఈజీగా రూ.1 లక్ష వరకు సంపాదించొచ్చు. ఇన్నాళ్లూ బీరువాలో ఊరికే ఉన్న ఆ పాత నోట్లే మీకు లక్ష రూపాయల వరకు లాభం చేయొచ్చు. ఇటీవల కాలంలో పాత కరెన్సీ నోట్లకు విలువ పెరిగింది. అందుకే మీ గల్లా పెట్టెలో, బీరువాలో ఉన్న పాత నోట్లను బయటకు తీసి వాటితో డబ్బు సంపాదించండి. ఆ పాత కరెన్సీ నోట్లను ఆన్లైన్లో అమ్మేసి సొమ్ము చేసుకోండి.
రూ.1 నోటుకు రూ.45,000
మీ దగ్గర పాత ఒక్క రూపాయి నోటు ఉంటే ఇంట్లో కూర్చొనే వేలు సంపాదించొచ్చు. భారత ప్రభుత్వం ఈ పాత నోట్లను ప్రింట్ చేయట్లేదు. అయితే కొందరి దగ్గర ఈ పాత నోట్లు ఉంటాయి. వాటిని ఆన్లైన్లో అమ్మితే రూ.45,000 వరకు వస్తాయి. 1957 లో ముద్రించిన ఈ నోటుపై గవర్నర్ హెచ్ఎం పాటిల్ సంతకం ఉంటుంది. సీరియల్ నెంబర్ 123456 ఉండాలి. ఈ నోటును కాయిన్ బజార్ వెబ్సైట్లో రూ.44,999 ధరకు అమ్మొచ్చు.
మీ దగ్గర పాత ఐదు రూపాయల నోటు ఉందా? అయితే రూ.30,000 వరకు సొంతం చేసుకోవచ్చు. ఈ పాత ఐదు రూపాయల నోటుపై ట్రాక్టర్ బొమ్మ ఉండాలి. నెంబర్ 786 ఉండాలి. ఇలాంటి నోట్లు దొరకడం చాలా అరుదు. ఒకవేళ మీ దగ్గర ఈ రూ.5 నోటు ఉందంటే బజార్ వెబ్సైట్లో రూ.30,000 ధరకు అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. మరి మీ దగ్గర ఈ నోటు ఉందేమో ఓసారి చెక్ చేయండి.
మీ దగ్గర పాత రూ.10 నోటు ఉందా? ఒక రూపాయి, ఐదు రూపాయల పాత నోట్లు దొరకడం కష్టం కానీ... రూ.10 నోట్లు దాచుకునేవారు ఉంటారు. అయితే 1943లో బ్రిటీష్ కాలంలో ముద్రించిన ఈ నోటుకు విలువ ఎక్కువ. దీనిపై అశోక స్తంభం ఉంటుంది. సీడీ దేశ్‌ముఖ్ సంతకం ఉంటుంది. ఒకవైపు అశోక స్తంభం, మరోవైపు బోటు ఉంటుంది. రెండు వైపులా ఇంగ్లీష్‌లో టెన్ రుపీస్ అని రాసి ఉంటుంది. ఈ నోటు మీ దగ్గర ఉంటే రూ.20,000 నుంచి రూ.25,000 వరకు సొంతం చేసుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.