IF YOU FORGOT TO PUT ONE LAKH IN THIS STOCK EXACTLY 10 YEARS AGO 4 CRORES WOULD BE YOURS MK
GRM Overseas: సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఓ లక్ష ఈ స్టాకులో పెట్టి మరిచిపోయి ఉంటే, 4 కోట్లు మీ సొంతం అయ్యేవి...
ప్రతీకాత్మక చిత్రం
GRM ఓవర్సీస్ షేర్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఈ స్మాల్ క్యాప్ రైస్ మిల్లింగ్ కంపెనీ షేర్ ధర గత ఏడాది కాలంలో రూ.34 నుంచి రూ.782.40కి పెరిగింది. ఈ ఏడాది కాలంలో ఈ స్టాక్ తన వాటాదారులకు 2,171.78 శాతం రాబడిని ఇచ్చింది.
GRM Overseas: స్టాక్ మార్కెట్ ఒక్కోసారి పట్టిందల్లా బంగారమవుతుంది, లేకుంటే చేతికి వచ్చిన బంగారం కూడా మట్టి అవుతుంది. ఈ బజారులో ఓపిక ఉంటే కలిసి వస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ విషయం మనం ప్రతిరోజూ స్టాక్ మార్కెట్లో చూస్తూనే ఉంటాము. ఇప్పుడు ఓ పెన్నీ స్టాక్ గురించి తెలుసుకుందాం. GRM ఓవర్సీస్ షేర్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఈ స్మాల్ క్యాప్ రైస్ మిల్లింగ్ కంపెనీ షేర్ ధర గత ఏడాది కాలంలో రూ.34 నుంచి రూ.782.40కి పెరిగింది. ఈ ఏడాది కాలంలో ఈ స్టాక్ తన వాటాదారులకు 2,171.78 శాతం రాబడిని ఇచ్చింది. అంటే ఒక ఇన్వెస్టర్ ఏడాది క్రితం ఈ స్టాక్‌లో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే, ఈ రోజు అతనికి 23 లక్షల రూపాయలు వచ్చేవి. 10 సంవత్సరాలలో, GRM ఓవర్సీస్ స్టాక్ 1.93 నుండి రూ. 782.40 స్థాయికి పెరిగింది. ఈ కాలంలో ఈ స్టాక్ తన వాటాదారులకు దాదాపు 40,450 శాతం రాబడిని ఇచ్చింది. గత 5 ఏళ్లలో ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ రూ.4.49 స్థాయి నుంచి రూ.782.40కి పెరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో, ఈ స్టాక్ దాదాపు 17,325 శాతం పెరిగింది. ఈ వారం ప్రారంభంలో ఈ స్టాక్ రూ.856 స్థాయికి చేరుకుంది.
GRM ఓవర్సీస్ (GRM Overseas)
గత 6 నెలల కదలికను పరిశీలిస్తే, ఈ మల్టీబ్యాగర్ స్టాక్ దాదాపు రూ. 156 నుండి 782 స్థాయిలకు చేరుకుంది. ఈ కాలంలో GRM ఓవర్సీస్ స్టాక్ ధర 400 శాతం పెరిగింది. గత నెలలో ఈ స్టాక్ 55 శాతం పెరిగింది. డిసెంబర్ 15న రూ.504 వద్ద ఉండగా, రూ.277 పెరుగుదలతో 782 వద్ద ట్రేడవుతోంది.
ప్రతీకాత్మకచిత్రం
పెట్టుబడిదారులకు ఎంత లాభం వచ్చిందో తెలుసుకోండి
ఒక ఇన్వెస్టర్ 6 నెలల క్రితం ఈ పెన్నీ స్టాక్ GRM ఓవర్సీస్ షేర్లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, అతని 1 లక్ష ఈ రోజు రూ. 5 లక్షలు అవుతుంది. ఒక ఇన్వెస్టర్ ఒక నెల క్రితం ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లో 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే, ఈ రోజు అతని 1 లక్ష రూపాయలు 1.55 లక్షల రూపాయలకు పెరిగాయి. మరి 10 ఏళ్ల క్రితం ఒక ఇన్వెస్టర్ ఈ స్టాక్‌లో 1.93 స్థాయిలో కొనుగోలు చేసి అందులో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈరోజు రూ.4.05 కోట్లకు యజమాని అయ్యి ఉండేవాడు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.