IF YOU FORGOT TO PAY LIC PREMIUM YOU CAN DO PAYMENTS LIKE THIS SS
LIC Payment: ఎల్ఐసీ ప్రీమియం కట్టడం మర్చిపోయారా? ఇలా చేయొచ్చు
LIC Navjeevan Plan: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ... నవజీవన్ ప్లాన్‌తో లాభాలు ఇవే
మీరు ప్రీమియం చెల్లించడం తరచూ మర్చిపోతుంటే ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్(ECS) ఆప్షన్ ఎంచుకోవచ్చు. మీరు ముందే సూచించిన తేదీలో మీ అకౌంట్ నుంచి పేమెంట్ పూర్తవుతుంది.
మీ దగ్గర ఎల్ఐసీ పాలసీ ఉందా? ప్రీమియం చెల్లించడం మర్చిపోయారా? చాలా ఆలస్యమైందంటే మీ పాలసీ ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. మీరే కాదు చాలామంది ఎల్ఐసీ ప్రీమియం చెల్లించడం మర్చిపోతుంటారు. ఆ తర్వాత లేట్ ఫీజ్‌తో చెల్లిస్తుంటారు. అందుకే మార్చి 1 నుంచి ఎల్ఐసీ ప్రీమియం డ్యూపై ఇంటిమేషన్స్ పంపనుంది. ఒకవేళ మీరు ఎల్ఐసీ ప్రీమియం చెల్లించడం మర్చిపోతే పేమెంట్ చేయడానికి ఇవే మార్గాలు.
మీ దగ్గర పేటీఎం అకౌంట్ ఉందా? అయితే ఎల్ఐసీ పాలసీ చెల్లించడం చాలా సులువు. పేటీఎం యాప్‌లో రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్‌లో మీకు ఎల్ఐసీ ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేసి మీ పాలసీ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు. ఎంత చెల్లించాలో కనిపిస్తుంది. ఒకసారి వివరాలన్నీ సరిచూసుకొని పేమెంట్ చేయాలి. ఏవైనా ఆఫర్లు ఉంటే ప్రోమో కోడ్ ఎంటర్ చేసి క్యాష్‌బ్యాక్స్ డీల్స్ పొందొచ్చు. పేటీఎం వ్యాలెట్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేయొచ్చు. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు, ఇమెయిల్ ఐడీకి సమాచారం వస్తుంది.
ఎల్ఐసీ వెబ్సైట్ licindia.in లో మీకు పే ప్రీమియం ఆన్లైన్ ట్యాబ్ కనిపిస్తుంది. 'Pay Direct', 'Through customer portal' అని రెండు ఆప్షన్లు ఉంటాయి. మీరు ముందే రిజిస్టర్ చేసుకున్నట్టైతే యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి పేమెంట్ చేయొచ్చు. లేదా రిజిస్టర్ చేసుకొని పేమెంట్ పూర్తి చేయొచ్చు.
యాక్సిస్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ ఏటీఎంల ద్వారా ఎల్ఐసీ ప్రీమియం పేమెంట్ చేయొచ్చు. ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతకంటే ముందు బ్యాంకు వెబ్సైట్లో మీ పాలసీలను రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది.
మీరు ప్రీమియం చెల్లించడం తరచూ మర్చిపోతుంటే ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్(ECS) ఆప్షన్ ఎంచుకోవచ్చు. మీరు ముందే సూచించిన తేదీలో మీ అకౌంట్ నుంచి పేమెంట్ పూర్తవుతుంది. ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్‌కు ఒప్పుకుంటూ మీరు ఎల్ఐసీకి దరఖాస్తు చేసుకోవాలి.