హోమ్ /వార్తలు /బిజినెస్ /

ITR Filing: జులై 31కి ముందు ఐటీఆర్ ఫైల్ చేసినా ఇంకా ట్యాక్స్ రీఫండ్ రాలేదా? కారణాలు ఇవే..

ITR Filing: జులై 31కి ముందు ఐటీఆర్ ఫైల్ చేసినా ఇంకా ట్యాక్స్ రీఫండ్ రాలేదా? కారణాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ITR Filing: గడువు తేదీలోగా ఐటీ రిటర్న్ ఫైల్‌ చేసినా రీఫండ్‌ రాకపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకోవడం ముఖ్యం. అధికారిక వెబ్‌సైట్‌ సర్వీసుల ద్వారా రీఫండ్‌ కాకపోవడానికి కారణాలు తెలుసుకోవచ్చు. అక్కడ కనిపించే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను (Income Tax) చెల్లించేందుకు జులై 31తో గడువు ముగిసింది. అయితే నిబంధనల ప్రకారం ఆర్థిక సంవత్సరం 2021-22 లేదా అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2022-23కి సంబంధించి ఆదాయపన్ను రిటర్న్(ITR) దాఖలు చేసినా ఇంకా రీఫండ్‌ (Refund) అందుకోని వారు చాలామంది ఉన్నారు. గడువు తేదీలోగా ఫైల్‌ చేసినా రీఫండ్‌ రాకపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకోవడం ముఖ్యం. అధికారిక వెబ్‌సైట్‌ సర్వీసుల ద్వారా రీఫండ్‌ కాకపోవడానికి కారణాలు తెలుసుకోవచ్చు. అక్కడ కనిపించే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవచ్చు.

* రీఫండ్ ఎప్పుడు ఇస్తారు?

ఒక వ్యక్తి ITR ప్రాసెస్ అయిన తర్వాతే రీఫండ్‌ అందుతుంది. ఆదాయ పన్ను రిటర్న్‌ను ప్రాసెస్ చేసిన తర్వాత సంబంధిత వ్యక్తి రీఫండ్‌కు అర్హులని పన్ను శాఖ నిర్ధారిస్తే, అప్పుడు మాత్రమే రీఫండ్ అందుతుంది. ఆదాయ పన్ను రీఫండ్‌ ఇంకా రాకపోతే, డిపార్ట్‌మెంట్ ఐటీఆర్‌ను ప్రాసెస్ చేసిందో లేదో చెక్ చేయండి.

* రీఫండ్ స్టేటస్‌ తెలుసుకోవడం ఎలా?

ఆదాయ పన్ను ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ incometaxindiaefiling.gov.in ద్వారా అసెస్సీలు ఆన్‌లైన్‌లో ట్యాక్స్‌ రీఫండ్‌ స్టేటస్‌ను చెక్‌ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో ‘స్టేటస్‌ ఆఫ్‌ ట్యాక్స్‌ రీఫండ్స్‌’ ట్యాబ్‌పై క్లిక్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. పేమెంట్‌ మోడ్‌, రిఫరెన్స్ నంబర్, స్టేటస్‌, రీఫండ్‌ స్టేటస్‌ తేదీని తెలియజేస్తూ ఓ మెసేజ్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(NSDL) - tin.tin.nsdl.com ఇ-గవర్నెన్స్ వెబ్‌సైట్‌లో కూడా స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.

* స్క్రీన్‌పై కనిపించే మూడు ఆప్షన్ల వివరాలు..

- రీఫండ్‌ ఇష్యూడ్‌: రీఫండ్‌ ఇఫ్యూ చేసిన పేమెంట్‌ మోడ్‌, రీఫండ్ మొత్తం, రీఫండ్ క్లియరెన్స్ తేదీ వివరాలు కనిపిస్తాయి.

- రీఫండ్‌ ఫెయిల్యూర్‌: రీఫండ్‌ ఫెయిల్యూర్‌ కావడానికి కారణం, కమ్యూనికేషన్ తేదీ, సంబంధిత ఈమెయిల్ ID కనిపిస్తాయి.

- రీఫండ్‌ కెప్ట్‌ ఆన్‌ హోల్డ్‌: అవుట్‌స్టాండింగ్‌ డిమాండ్‌ స్పందన కోసం 'రీఫండ్ కెప్ట్‌ ఆన్‌ హోల్డ్‌' అని చూపిస్తుంది. కమ్యూనికేట్ చేసిన తేదీ, రిజిస్టర్డ్ ఈమెయిల్ ID వివరాలు కనిపిస్తాయి. రీఫండ్ అభ్యర్థన విఫలమైతే, ఆదాయపన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఆదాయపన్ను రీఫండ్‌ను తిరిగి జారీ చేయడానికి అభ్యర్థనను అందజేయాలి. ఒకవేళ 'నో రికార్డ్స్ ఫౌండ్' అని కనిపిస్తే, పన్ను వాపసు వివరాలను I-T డిపార్ట్‌మెంట్ ఇంకా జారీ చేయలేదని గుర్తించాలి.

* అవుట్‌స్టాండింగ్‌ ట్యాక్సెస్‌

చెల్లించాల్సిన ట్యాక్స్‌ను తప్పుగా లెక్కించిన కారణంగా రీఫండ్‌ అభ్యర్థనను తిరస్కరించి ఉండే అవకాశం ఉంది. చెల్లించాల్సిన అవుట్‌ స్టాండింగ్‌ ట్యాక్స్‌ వివరాలను తెలియజేస్తూ పన్ను చెల్లింపుదారులకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి నోటీసులు వస్తాయి. అలాంటి సమయాల్లో తిరిగి అన్ని పత్రాలను సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇది కూడా చదవండి : రోజూ రూ.50 పెట్టుబడితో రూ.35 లక్షలు అందించే పోస్టాఫీస్‌ స్కీమ్‌.. అర్హత, ప్రయోజనాలు ఇవే..

చెల్లించిన ట్యాక్స్‌, చెల్లించాల్సిన ట్యాక్స్‌, రీఫండ్‌ను తిరిగి లెక్కించాలి. మీరు అందజేసిన వివరాలు అన్నీ సక్రమంగానే ఉంటే.. మీరు రీఫండ్‌ కోసం మరోసారి ఫైల్‌ చేసుకొనే అవకాశం ఉంది. ఏవైనా వివరాలలో తప్పులు దొర్లి ఉంటే.. నిర్ణీత వ్యవధిలోపు బకాయి ఉన్న ట్యాక్స్‌ మొత్తాన్ని చెల్లించాలి.

* బ్యాంక్‌ ఖాతాకు పాన్‌ లింక్‌ అయిందా?

బ్యాంకు ఖాతా వివరాలు మారితే.. రీఫండ్‌ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పోర్టల్‌లోని ప్రాథమిక వివరాలతో ఫోన్‌ నంబరు, ఈ-మెయిల్‌ ఐడీ సరిపోలాలి. బ్యాంకు ఖాతాలో పేర్కొన్న వివరాలనే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పోర్టల్‌లోనూ పొందుపరచాలి. PAN బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉందో లేదో తనిఖీ చేయాలి. పాన్ లింక్‌ అయిందో లేదో ఇలా తెలుసుకోవచ్చు..

1) ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్లి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.

2) లాగిన్ అయిన తర్వాత, 'మై ప్రొఫైల్'పై క్లిక్ చేసి, 'మై బ్యాంక్ అకౌంట్‌' ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

3) స్క్రీన్‌పై ముందుగా ధృవీకరింరిన బ్యాంక్ ఖాతా చూడవచ్చు. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపన్ను రీఫండ్‌ స్వీకరించడానికి అందజేసిన బ్యాంక్ ఖాతా వివరాలను కూడా చూపుతుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Income tax, ITR, Itr deadline, Personal Finance

ఉత్తమ కథలు