Diwali shopping: పండగ షాపింగ్ కు పైసల్లేవా? అయితే, డబ్బులు లేకుండానే ఇలా కొనేయండి

ప్రతీకాత్మక చిత్రం

కరోనా (Corona) మహమ్మారి ప్రభావం వల్ల ఉద్యోగుల వేతనాల్లో కోతలు, ఉద్యోగం కోల్పోవడం పలు కారణాల వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గింది. అయితే ఈ నేపథ్యంలో ప్రజలు దీపావళి షాపింగ్ (Diwali 2021) కు భయపడుతున్నారు. అయితే ఈ విషయాలు తెలుసుకోండి.

  • Share this:
పండుగ సీజన్ (Festival Season) వచ్చేసిందంటే షాపింగులని (Shopping), పిండి వంటలని, ఇతర లగ్జరీ వస్తువులపై ఖర్చు పెట్టి జేబుకు చిల్లు పడుతుంది. ముఖ్యంగా హిందువుల ముఖ్యమైన పండుగ అయిన దీపావళి (Diwali 2021) సమయంలో ఈ ఖర్చు ఇంకా ఎక్కువ ఉంటుంది. అయితే కరోనా (Corona) మహమ్మారి ప్రభావం వల్ల ఉద్యోగుల వేతనాల్లో కోతలు (Salary Cuttings), ఉద్యోగం(Jobs) కోల్పోవడం పలు కారణాల వల్ల కొనుగోలు శక్తి తగ్గింది. ఇలాంటి సమయంలో క్రెడిట్ కార్డులపై(Credit Cards) ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇప్పటికే చాలా సంస్థలు పలు రకాల క్రెడిట్ ఆప్షన్లు ఇస్తున్నాయి. ముఖ్యంగా బై నౌ పే లేటర్(BNPL) లాంటి ఆప్షన్లతో పాటు, ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలను (Personnel Loans)  అందిస్తున్నాయి. క్రెడిట్ కార్డులకు ద్వారా 45 రోజుల వరకు వడ్డీ లేని మొత్తాన్ని ఉపయోగించుకోవడమే కాకండా 12 నెలల వరకు ఆమోద యోగ్యమైన ఈఎంఐ ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది. వీటితో పాటు రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్స్, బై నౌ పే లేటర్ లాంటి ఆఫర్లు అదనం.

బీఎన్‌పీఎల్ లో తక్షణమే డబ్బు రుణంగా తీసుకొని 15 రోజుల వరకు వడ్డీ రహిత సొమ్మును వాడుకోవచ్చు.అదే, వ్యక్తిగత రుణాల విషయంలో మాత్రం కచ్చితమైన అర్హత ప్రమాణాలుంటాయి.అంతేకాకుండా ఆమోదానికి 1 నుంచి 2 వారాల సమయం పడుతుంది. కాబట్టి డబ్బు అవసరం ఎక్కువగా ఉన్న సమయాల్లో వ్యక్తిగత రుణాలు అనువైనవిగా ఉంటాయి. వీటిలో మరో ప్రయోజనం ఏంటంటే క్రెడిట్ కార్డుల కంటే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. బీఎన్‌పీఎల్ విషయానికొస్తే ఇది వినియోగదారులు ఏదైనా వస్తువును కొనుగోలు చేయడానికి, నిర్ణీత వ్యవధిలో చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది.
Mahindra Marazzo: దీపావళికి ఏడు సీటర్ల పెద్ద కారు రూ.13 లక్షల కారు కేవలం రూ.8 లక్షలకే..

అయితే వినియోగదారులు సకాలంలో చెల్లింపులు చేయడంలో విఫలమైతే మీ బిల్లు మొత్తాన్ని బట్టి వడ్డీ ఛార్జీలు విధిస్తారు. ఈ బీఎన్‌పీఎల్ పథకాల్లో కొన్ని వినియోగదారుల కొనుగోలును మూడు నుంచి ఆరు నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ విభజించడానికి అనుమతిస్తాయి. ఆ సమయంలో బిల్లును సెటిల్మెంట్ చేయాలి. 3 వేల నుంచి 10 వేల వరకు చిన్న కొనుగోళ్లకు బీఎన్‌పీఎల్ అనువైనవిగా చెప్పవచ్చు. ఇక, క్రెడిట్ కార్డుల విషయానికొస్తే పెట్రోల్, డీజిల్ చెల్లించడానికి యుటిలిటీ బిల్లు చెల్లింపులు చేయడానికి ఇతర ఖర్చులకు కూడా వీటిని ఉపయోగించవచ్చు. కార్డు హోల్డర్ ప్రతి నెలా వారీగా బ్యాలెన్స్ ను పూర్తిగా చెల్లిస్తే.. ఎలాంటి వడ్డీని కట్టాల్సిన పని ఉండదు.
FilpKart Diwali Sale: రూ. 20 వేల స్మార్ట్ టీవీ కేవలం రూ. 3999కే.. ఆఫర్ మరి కొన్ని రోజులే..

BNPL vs క్రెడిట్ కార్డ్ vs వ్యక్తిగత రుణాలు..
మీకు ఇప్పటికే క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే.. క్రెడిట్ కార్డు ద్వారా షాపింగ్​ చేయడంఅన్నింటికంటే ఉత్తమమైన ఎంపిక. ఒకవేళ మీకు క్రెడిట్ కార్డు లేకపోతే బీఎన్‌పీఎల్ ను ఎంచుకోవచ్చు. అయితే మీరు ఈఎంఐల్లో కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే బీఎన్‌పీఎల్ కంటే క్రెడిట్ కార్డులు మెరుగైన రేటును అందిస్తాయి. అంతేకాకుండా బీఎన్‌పీఎల్ ఆప్షన్లు నిర్దిష్ట వ్యాపారి నుంచి కొనుగోలుకు మాత్రమే వర్తిస్తాయి. క్రెడిట్ కార్డులు సాధారణంగా అనేక రకాల కొనుగోలు చేయడానికి ఎక్కడైనా ఉపయోగించవచ్చు. క్రెడిట్ కార్డు ఉంటే నెలాఖరులో చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని చెల్లించాలి. బీఎన్‌పీఎల్ లో 3,5, 12 నెలల ఆప్షన్ ఉంటుంది.
Business Loan: బిజినెస్ చేస్తారా? రూ.50 లక్షల లోన్ ఇస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా

అంతేకాకుండా వడ్డీ రేట్లు, ఫీజులు కూడా బీఎన్‌పీఎల్ లో విస్తృతంగా మారుతుంటాయి. కొన్ని ఆప్షన్లలో ఎలాంటి వడ్డీలు, రుసుములు ఉండవు. అంటే ఉచితంగా ఫైనాన్సింగ్ చేస్తుంది.బీఎన్‌పీఎల్ ద్వారా అందించే దీర్ఘకాలిక రుణాలు 48 నెలల వరకు కాలపరిమితి ఉంటుంది. అంతేకాకుండా సాధారణ వ్యక్తిగత రుణం వలే వడ్డీ రేటును కలిగి ఉంటుంది. లోన్, క్రెడిట్ కార్డుల మాదిరి కాకుండా బీఎన్‌పీఎల్ ప్రొవైడర్లు క్రెడిట్ ను పెద్దగా తనిఖీ చేయరు. ఇది ఫైనాన్సింగ్ యాక్సెస్ ను సులభతరంగా చేస్తుంది.

మరోవైపు క్రెడిట్ కార్డు జారీ చేసే వారు మీరు దరఖాస్తు చేసుకున్నప్పుడల్లా మీ క్రెడిట్ స్కోర్ ప్రకారం క్రెడిట్ ను పెంచవచ్చు. అయితే, పెద్ద మొత్తంలో డబ్బు కావాలంటే వ్యక్తిగత రుణాలు అనువైనవి. కుటుంబంలో ఏదైనా శుభకార్యం, సమావేశాలు, ఇంటి మరమ్మతులు, హాలీడేస్ లాంటి పెద్ద ఖర్చుల కోసం వ్యక్తిగత రుణాలు బెస్ట్ ఆప్షన్ గా పరిగణిస్తారు. ఈ విధంగా ఈ మూడు ఆప్షన్లతో మీకు అనువైన రీతిలో క్రెడిట్ పొందవచ్చు. అయితే వడ్డీ రేట్లు, కాలపరిమితి లాంటి విషయాలను పరిగణనలోకి తీసుకొని ముందడుగు వేయాల్సి ఉంటుంది. సంస్థల నిబంధనల ప్రకారం వడ్డీ రేట్లలో వ్యత్యాసం ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published: