PAN Card: పాన్ కార్డు లేదా? ఈ రెండు డాక్యుమెంట్స్ చూపించొచ్చు

PAN Card | పాన్ కార్డు లేనివాళ్లు అందుకు ప్రత్యామ్నాయంగా రెండు డాక్యుమెంట్స్ చూపించొచ్చు. అస్సలు పాన్ కార్డు తీసుకోకపోయినా, అప్పటికప్పుడు పాన్ కార్డు అందుబాటులో లేకపోయినా ఈ రెండు డాక్యుమెంట్స్ చూపించొచ్చు.

news18-telugu
Updated: October 31, 2019, 4:56 PM IST
PAN Card: పాన్ కార్డు లేదా? ఈ రెండు డాక్యుమెంట్స్ చూపించొచ్చు
PAN Card: పాన్ కార్డు లేదా? ఈ రెండు డాక్యుమెంట్స్ చూపించొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పాన్ కార్డ్... తరచూ ఆర్థిక లావాదేవీలు జరిపేవారికి అవసరమైన డాక్యుమెంట్. కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నీ, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా, భారీ లావాదేవీలు జరపాలన్నీ పాన్ కార్డు తప్పనిసరి. ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 139ఏ ప్రకారం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్నవారంతా పాన్ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలి. భారీగా నగదు డిపాజిట్ చేస్తున్నా, విత్‌డ్రా చేస్తున్నా, పెద్దపెద్ద లావాదేవీలు జరుపుతున్నా పాన్ నెంబర్‌ను వెల్లడించాల్సిందే. అయితే అందరి దగ్గరా పాన్ కార్డులు ఉండవు. ఇప్పటికీ భారతదేశంలో పాన్ కార్డులు తీసుకోనివారున్నారు. అయితే పాన్ కార్డు లేకపోతే ఏం చేయాలన్న సందేహాలు చాలామందిలో ఉంటాయి. వారికి ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు కొన్ని మినహాయింపుల్ని ఇచ్చాయి. పాన్ కార్డు లేనివాళ్లు అందుకు ప్రత్యామ్నాయంగా రెండు డాక్యుమెంట్స్ చూపించొచ్చు. అస్సలు పాన్ కార్డు తీసుకోకపోయినా, అప్పటికప్పుడు పాన్ కార్డు అందుబాటులో లేకపోయినా ఈ రెండు డాక్యుమెంట్స్ చూపించొచ్చు.

Aadhaar Card: పాన్ కార్డు బదులు మీరు ఆధార్ కార్డ్ వాడుకోవచ్చు. పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఇంటర్‌ఛేంజబుల్ అంటే పరస్పర మార్పిడి చేసుకోవచ్చని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ నిబంధనలు సెప్టెంబర్ నుంచి అమలులోకి వచ్చేశాయి. అంటే మీరు ఆధార్ నెంబర్ అవసరమైనచోట పాన్ కార్డును, పాన్ కార్డు అవసరమైనచోట ఆధార్ నెంబర్‌ను వాడుకోవచ్చు. కాబట్టి పాన్ కార్డు అవసరమైన ఆర్థిక లావాదేవీల సమయంలో మీ దగ్గర పాన్ కార్డు లేకపోతే ఆధార్ నెంబర్ ఇవ్వొచ్చు. మీరు అప్పటికే మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేసి ఉంటారు కాబట్టి మీరు ఇచ్చిన ఆధార్ నెంబర్ ద్వారా మీ పాన్ నెంబర్‌ను జనరేట్ చేస్తుంది ఆదాయపు పన్ను శాఖ. అయితే మీరు పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి. మరి మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Form 60: పాన్ కార్డు బదులు ఆధార్ నెంబర్‌తో పాటు ఫామ్ 60 కూడా సబ్మిట్ చేయొచ్చు. ఆదాయపు పన్ను చట్టం, 1962 ప్రకారం పాన్ నెంబర్ బదులు ఫామ్ 60 పూర్తి చేసి ఇవ్వొచ్చు. అయితే మీ దగ్గర పాన్ కార్డు లేదని, మీ ఆదాయం పన్ను పరిధిలోకి రాదని వెల్లడించడమే ఈ దరఖాస్తు ఉద్దేశం. పాన్ కార్డు లేనివాళ్లు మాత్రమే ఈ ఫామ్ ఫిల్ చేయాలి. లేకపోతే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బీ ప్రకారం రూ.10,000 జరిమానా చెల్లించాల్సి వస్తుంది.

LG W30 Pro: ఎల్‌జీ డబ్ల్యూ30 ప్రో సేల్ ప్రారంభం... ఫోన్ ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

IRCTC: రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? రీఫండ్ రూల్స్ మారాయి
Loading...
Zero Balance Accounts: మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేని 8 సేవింగ్స్ అకౌంట్స్ ఇవే...

SBI: మీ ఏటీఎం లిమిట్ మీకు నచ్చినంత సెట్ చేయొచ్చు ఇలా...
First published: October 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com