Home /News /business /

IF YOU ARE PREPARING TO BUY A HOUSE THEN CHECK THESE THINGS THERE WILL BE NO LOSS MK

Real Estate: కొత్త ఇల్లు కొంటున్నారా...అయితే ఈ 5 విషయాలు తెలుసుకోవాల్సిందే...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు పరిగణించవలసిన అనేక అంశాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది సాధారణంగా మీ జీవితంలో అతిపెద్ద అచీవ్ మెంట్. కేవలం ధర ఒక్కటే కాకుండా...చాలా విషయాలు గమనించదగినవి ఉన్నాయి...అవేంటో చూద్దాం...

  ఏదైనా ప్లాట్ లేదా అపార్టుమెంటులో ఫ్లాట్ కానీ కొనుగోలు చేసేటప్పుడు మీరు అనేక విషయాలను  పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అనే సామెత మనకు పెద్దల కాలం నుంచి ఉంది. ప్రతీ వ్యక్తి జీవితంలో పెళ్లి, ఇల్లు కట్టడం అనేవి చాలా పెద్ద లక్ష్యాలు అనే చెప్పాలి. పైగా వీటి కోసం జీవితాంతం దాచుకున్న సొమ్ముును ఖర్చు చేయాల్సి ఉంటుంది.  ఇక ఇల్లు విషయానికి వస్తే మీ జీవితంలో అతిపెద్ద వ్యయం అనే చెప్పాలి. ఇల్లు కట్టే సమయంలో కేవలం ధర ఒక్కటే ప్రమాణం కాదు. అవి కాకుండా, చాలా విషయాలు గమనించదగినవి ఉన్నాయి. మీ ఆదాయం, EMI ( నెలవారీ వాయిదాలు), నగరం, అనువైన ప్రదేశంతో సహా ఇల్లు కొనడానికి చాలా అంశాలు  పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. మీరు మీ కోసం ఇల్లు కొంటున్నారా లేదా అద్దె ఆదాయం పొందేందుకు కొంటున్నారా...అనేది నిర్ణయించుకోవాల్సి ఉంది. అంతేకాదు కరోనా సంక్షోభంలో పలు అంశాలపై (ముఖ్యంగా గృహ రుణాలు మరియు EMI లను తిరిగి చెల్లించే సామర్థ్యం) దృష్టి మరింత పెరిగింది.

  ధరలు తగ్గుతాయో లేదో వేచి చూడాలి...

  గత కొన్ని సంవత్సరాలుగా ఆస్తి ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ కరోనా వచ్చిన తరువాత, కొన్ని చోట్ల ధరలు స్వల్పంగా తగ్గాయి. నిపుణులు, అయితే, ఇక్కడ నుండి చాలా పతనం ఉండదని చెబుతున్నారు. కరోనా తరువాత, ధరలు 5-10% తగ్గాయి. అయితే ఇటువంటి పరిస్థితిలో మరింత పడిపోయే అవకాశం లేదు. పండుగ సీజన్లో మీరు ఖచ్చితంగా మంచి ఇంటిని ఎంపిక చేసుకొని కొనవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఆ సమయంలో బిల్డర్లు ప్రత్యేక పథకాలను అందించవచ్చు.

  బడ్జెట్ గురించి జాగ్రత్తగా చూసుకోండి...

  మీరు ఇల్లు కొనడానికి సన్నద్ధమవుతుంటే, మీకు సరిపడా డబ్బు ఉందో లేదో చూసుకోండి. ఫైనాన్స్ రంగ నిపుణులు ఇల్లు కొనుగోలు లాంటి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు, మొదట మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోండి. అంటే, మీ ఉద్యోగం లేదా వ్యాపారం ఎంత సురక్షితమైనదో పరిశీలించడం చాలా ముఖ్యం. ఇల్లు కొనడం గురించి మీకు ఖచ్చితంగా తెలిస్తే, మీరు తీసుకుంటున్న రుణాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అదనపు రుణం కారణంగా మీ బడ్జెట్ ఎక్కువ అయిపోయి ఉద్యోగాన్ని వదిలివేసే పరిస్థితి రాకూడదు.

  నిర్మాణంలో ఉంది లేదా సిద్ధంగా ఉంది...

  గృహ కొనుగోలుదారులకు ఇది చాలా సాధారణ గందరగోళం. నిర్మాణ దశలో లేదా నిర్మాణ ప్రణాళికల పరంగా డెవలపర్లు సరళమైన చెల్లింపు ప్రణాళికలను అందిస్తున్నందున, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ఎంచుకుంటారు. మొత్తం ధరలో 10-20% చెల్లించిన తర్వాత వీటిని బుక్ చేసుకోవచ్చు. మిగిలినవి ఇల్లు కొనుగోలు చేసిన తరువాత చెల్లించవచ్చు. కానీ ఈ పథకాలు ఆకర్షణీయంగా ఉంటాయని గుర్తుంచుకోండి, అయితే ఆస్తి నిర్మాణం సకాలంలో పూర్తవుతుందా అనే విషయంపై కన్ను వేసి ఉంచాలి.  అందుకే సిద్ధంగా ఉన్న ఇంటిని( రెడీ టూ ఆక్యూపై) కొనాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

  సొంత ఇల్లు లేదా అద్దె

  ఇల్లు కొనడం అంటే మీ పొదుపులో ఎక్కువ భాగం స్థిరాస్తిలో చిక్కుకుపోతుంది. మీరు అద్దెకు నివసిస్తుంటే, మీ చేతిలో ఎక్కువ డబ్బు ఉండవచ్చు మిగిలిన మొత్తాన్ని కూడా పెట్టుబడి పెట్టవచ్చు.  అయితే అద్దె భారం మీకు ఎక్కువ అయితే, మీరు కొనుగోలు చేయడం మంచి ఎంపిక. ఈ రకమైన  నిర్ణయం మీరు చేసే ఉద్యోగం ముడి పడి ఉంటుంది. ఎందుకంటే కొత్త నగరంలో, అద్దెకు ఉన్న ఇల్లు మంచిది. కానీ మీ నగరంలో మీకు ఉద్యోగం ఉంటే అప్పుడు మీరు ఇల్లు కొనడానికి వెనుకాడకూడదు.

  రియాల్టీలో పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం ఏది...


  ఒక ఆస్తి పెట్టుబడి కోసం అంటే అద్దె ఆదాయాన్ని పొందటానికి కొనుగోలు చేస్తుంటే, నిపుణులు దాని వద్దని తిరస్కరిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అద్దె రాబడి గణనీయంగా తగ్గింది. ఇటువంటి పరిస్థితిలో, మీ డబ్బును వేరే పెట్టుబడి ప్రదేశంలో పెట్టుబడి పెట్టండి. ఇల్లు కొనడానికి తొందరపడకుండా ఉండటం మంచిది. నిర్ణయం తీసుకునే ముందు అన్ని అంశాలను అంచనా వేయండి.
  Published by:Krishna Adithya
  First published:

  Tags: Real estate

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు