LIC Policy: ఎల్ఐసీ పాలసీ నచ్చలేదా? వెనక్కి ఇచ్చేయండి ఇలా

LIC Free Look period Rule | 'ఫ్రీ లుక్ పీరియడ్' దరఖాస్తు ఫామ్‌లో మీ పాలసీ వివరాలు, ఏజెంట్ వివరాలు, పాలసీ క్యాన్సిల్ చేయడానికి గల కారణాలను వెల్లడించాలి. పాలసీ ఒరిజినల్ బాండ్, మొదటి ప్రీమియం రసీదు, క్యాన్సలేషన్ చెక్ జత చేయాలి.

news18-telugu
Updated: May 14, 2019, 6:18 PM IST
LIC Policy: ఎల్ఐసీ పాలసీ నచ్చలేదా? వెనక్కి ఇచ్చేయండి ఇలా
LIC Policy: ఎల్ఐసీ పాలసీ నచ్చలేదా? వెనక్కి ఇచ్చేయండి ఇలా
  • Share this:
ఏజెంట్ చెప్పాడని లేదా ఆన్‌లైన్‌లో యాడ్ చూసి పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఎల్ఐసీ పాలసీ తీసుకోవడం చాలామందికి అలవాటు. అసలు ఆ పాలసీ లాభాలేంటీ? తన ఆర్థిక పరిస్థితికి ఆ పాలసీ సూటవుతుందా? లేదా? అన్న అంశాలేవీ ఆలోచించకుండా డబ్బులు కట్టేస్తారు. పాలసీ తీసుకుంటారు. ప్రీమియం చెల్లించిన తర్వాత అయ్యో ఆ పాలసీ తీసుకోవాల్సింది కాదు, అనవసరంగా తీసుకున్నాం కదా అని బాధపడుతుంటారు. మరి మీరు కూడా పాలసీ తీసుకొని ఇలాగే బాధపడుతున్నారా? మీరు తీసుకున్న పాలసీ మీకు సూటవదని అనిపిస్తుందా? ఏం పర్లేదు. మీరు తీసుకున్న ఎల్ఐసీ పాలసీ వెనక్కి ఇచ్చేయొచ్చు. మీరు చెల్లించిన ప్రీమియం మొత్తం మీరు పొందొచ్చు. పాలసీలో ఉండే 'ఫ్రీ లుక్ పీరియడ్' నిబంధన ఇది. ఫ్రీ లుక్ పీరియడ్‌తో మీకు లాభమేంటీ? తెలుసుకోండి.

Read this: LIC Policy: ఏడాదికి రూ.100 ప్రీమియంతో ఎన్నో లాభాలు

ఎల్ఐసీ పాలసీకి ఫ్రీ లుక్ పీరియడ్‌


ఎల్ఐసీలో మీరు తీసుకునే ప్రతీ పాలసీకి ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. అంటే మీరు పాలసీ తీసుకున్నాక ఆ పాలసీ నచ్చకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీరు చెల్లించిన ప్రీమియం మీకు వెనక్కి ఇచ్చేస్తుంది ఎల్ఐసీ. మీరు పాలసీ తీసుకున్నాక ఆ పాలసీపై సమీక్ష చేసుకోవడానికి ఎల్ఐసీ మీకు 15 రోజుల పాటు గడువు ఇస్తుంది. ఒకవేళ మీకు పాలసీ నచ్చకపోతే 15 రోజుల్లో వెనక్కి ఇచ్చేయొచ్చు. దాన్నే 'ఫ్రీ లుక్ పీరియడ్' అంటారు. అయితే మీ చేతికి పాలసీ బాండ్ వచ్చిన 15 రోజుల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు పాలసీ వెనక్కి ఇచ్చేయాలనుకుంటే ఎల్ఐసీకి దరఖాస్తు చేయాలి. 'ఫ్రీ లుక్ పీరియడ్' దరఖాస్తు ఫామ్‌ను ఎల్ఐసీ కంపెనీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read this: Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 11 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

'ఫ్రీ లుక్ పీరియడ్' దరఖాస్తు ఫామ్‌లో మీ పాలసీ వివరాలు, ఏజెంట్ వివరాలు, పాలసీ క్యాన్సిల్ చేయడానికి గల కారణాలను వెల్లడించాలి. పాలసీ ఒరిజినల్ బాండ్, మొదటి ప్రీమియం రసీదు, క్యాన్సలేషన్ చెక్ జత చేయాలి. మీ పాలసీ డబ్బులు తిరిగి పొందేందుకు బ్యాంకు వివరాలను తెలపాల్సి ఉంటుంది. మీరు పాలసీ కోసం చెల్లించిన మొత్తం మీ అకౌంట్‌లోకి తిరిగొస్తుంది. అయితే పాలసీ తీసుకునే సమయంలో మెడికల్ ఎగ్జామినేషన్, స్పెషల్ రిపోర్ట్స్, స్టాంప్ డ్యూటీ ఛార్జీల్లాంటివి ఏవైనా ఉంటే వాటిని తీసుకొని మిగతా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. రీఫండ్ మీకు రెండు వారాల్లో లభిస్తుంది. 'ఫ్రీ లుక్ పీరియడ్' దరఖాస్తు ఫామ్‌లో వివరాలన్నీ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. పాలసీ తీసుకున్న 15 రోజుల వరకే ఈ నిబంధన వర్తిస్తుంది.

Realme C2: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ సీ2... ధర రూ.5,999 మాత్రమే
ఇవి కూడా చదవండి:

PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...

Post Office Franchise: రూ.5 వేలతో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్... వివరాలు ఇవే...

బంగారం కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
First published: May 14, 2019, 3:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading