హోమ్ /వార్తలు /బిజినెస్ /

Leave Travel Concession: గవర్నమెంట్ ఉద్యోగులకు కొత్త LTC రూల్స్.. వీటిలో హైలైట్స్ ఇవే..

Leave Travel Concession: గవర్నమెంట్ ఉద్యోగులకు కొత్త LTC రూల్స్.. వీటిలో హైలైట్స్ ఇవే..

Leave Travel Concession: గవర్నమెంట్ ఉద్యోగులకు కొత్త LTC రూల్స్.. వీటిలో హైలైట్స్ ఇవే..

Leave Travel Concession: గవర్నమెంట్ ఉద్యోగులకు కొత్త LTC రూల్స్.. వీటిలో హైలైట్స్ ఇవే..

Leave Travel Concession: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టీసీ) నిబంధనలను కేంద్రం రిలీజ్ చేసింది. కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ (DoP) జారీ చేసిన ఈ మార్గదర్శకాలను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ తప్పక తెలుసుకోవాలి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులా, సెలవుల్లో విమానాల్లో ప్రయాణాలు చేయాలనుకుంటున్నారా... అయితే అలర్ట్.. రీసెంట్‌గా విమాన ప్రయాణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC) నిబంధనలను కేంద్రం (Central Government) రిలీజ్ చేసింది. కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ (DoP) జారీ చేసిన ఈ మార్గదర్శకాలను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ నిబంధనలలో ఫ్లైట్ టిక్కెట్ బుకింగ్ ఏజెంట్లు, టిక్కెట్ ఛార్జీలు, తదితర ముఖ్య వివరాలకు సంబంధించిన నియమాలు ఉన్నాయి.

ఈ నియమాలను తెలుసుకుని, వాటిని సరిగా పాటిస్తేనే ఉద్యోగులకు విమాన ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావు. లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC) అనేది ప్రయాణ ఖర్చుల కోసం ఇచ్చే భత్యం (Allowance). ఈ ప్రయాణ ఖర్చులు ఐటీ పన్ను చట్టం కింద పన్ను చెల్లించాల్సిన పరిధిలోకి కూడా రావు.

* ఎప్పుడు టిక్కెట్లు బుక్ చేసుకోవాలి?

సరైన టికెట్ల ధరలను పొందడానికి, ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా ఉండటానికి ఉద్యోగులు ప్రయాణ తేదీకి కనీసం 21 రోజుల ముందు విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవాలి.

* టిక్కెట్లు ఎక్కడ బుక్ చేసుకోవాలి?

ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC), బల్‌మేర్ లారీ & కంపెనీ లిమిటెడ్ (BLCL), అశోక్ ట్రావెల్స్ & టూర్స్ (ATT) అనే మూడు ఆటోరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్ల నుంచి విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవాలని కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు సూచించింది. ఈ ట్రావెల్ ఏజెంట్లలో టికెట్ బుకింగ్‌కు ఆన్‌లైన్ బుకింగ్ వెబ్‌సైట్‌ను ఉపయోగించాలి. విమాన టిక్కెట్లను డిజిటల్‌గా బుక్ చేసుకోవడానికి ఈ ఏజెన్సీలతో తమ అధికారిక ప్రభుత్వ ఈ-మెయిల్ ఐడీని షేర్ చేయాల్సి ఉంటుంది. LTC కింద ప్రయాణం చేయకపోయినా ఉద్యోగులు ఈ ఏజెన్సీల ద్వారానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

అనివార్య పరిస్థితులలో, అనధికారిక ట్రావెల్ ఏజెంట్/వెబ్‌సైట్ నుంచి టికెట్ బుకింగ్ జరిగితే, మంత్రిత్వ శాఖ/డిపార్ట్‌మెంట్ ఆర్థిక సలహాదారులు, సబార్డినేట్/అటాచ్డ్ ఆఫీస్‌లలో జాయింట్ సెక్రటరీ స్థాయి కంటే తక్కువకాని డిపార్ట్‌మెంట్ హెడ్‌కు సడలింపు మంజూరు చేసే అధికారం ఉంటుంది.

* టిక్కెట్లను రద్దు చేస్తే ఏం జరుగుతుంది?

అనవసరంగా టికెట్ క్యాన్సిల్ చేయొద్దని ప్రభుత్వం కోరుతోంది. LTC కింద చేసే ప్రయాణానికి 24 గంటల కంటే తక్కువ వ్యవధిలో చేసిన టికెట్ క్యాన్సిలేషన్లకు కారణాన్ని చెబుతూ ఉద్యోగి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మూడు బుకింగ్ ఏజెంట్లను జీరో/నిల్ క్యాన్సిలేషన్ ఛార్జీలను అందించాలని కేంద్రం ఆదేశించింది. ఎంప్లాయిస్ చేతిలో లేని క్యాన్సిలేషన్లకు ఛార్జీలు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది.

* రీయింబర్స్‌మెంట్ నిబంధనలు ఏంటి?

ఒకవేళ అడ్వాన్స్‌ని తీసుకున్నాక టిక్కెట్‌ని బుకింగ్ చేసే సమయంలో ఛార్జీలో ఏదైనా తేడా వస్తే.. ఆ ఛార్జీల వ్యత్యాసం సెటిల్మెంట్ సమయంలో సర్దుబాటు చేస్తారు.

* ఎన్ని టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు?

ఎల్‌టీసీలో ప్రయాణించే వారు ఒక టిక్కెట్‌ను మాత్రమే బుక్ చేసుకోవాలి.

* ఎల్‌టీసీ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

విమాన ప్రయాణానికి అర్హత ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అథరైజ్డ్‌ ట్రావెల్ ఏజెన్సీ వెబ్‌పేజీ ప్రింట్ అవుట్, విమాన ఛార్జీల వివరాలు, ఎల్‌టీసీ అడ్వాన్స్‌ ఫారంతో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Central govt employees, IRCTC, Personal Finance

ఉత్తమ కథలు