Home /News /business /

Beevi Toilet: అక్కడ టాయ్‌లెట్‌ కి వెళ్తే తిరిగి మనకే డబ్బులు ఇస్తారు.. ఆ వ్యర్థాలను ఏం చేస్తారంటే..

Beevi Toilet: అక్కడ టాయ్‌లెట్‌ కి వెళ్తే తిరిగి మనకే డబ్బులు ఇస్తారు.. ఆ వ్యర్థాలను ఏం చేస్తారంటే..

ది బీవీ టాయిలెట్ (imagae credit : twitter)

ది బీవీ టాయిలెట్ (imagae credit : twitter)

Beevi Toilet: హీరో సూర్య నటించిన బందోబస్తు సినిమా గుర్తు ఉందిగా అందులో హీరో టాయిలెట్ కి వెళ్లిన ప్రతీ ఒక్కరికి డబ్బులు ఇచ్చి పంపిస్తుంటారు. కారణం ఏంటని ఓ జర్నలిస్టు అడగ్గా ఇలా దానిని ఒక ఎరువుగా మార్చి పంట పొలాలకు ఉపయోగిస్తుంటామని చెప్పాడు. అలాంటిదే అక్కడ టాయిలెట్ కి వెళ్లిన వారికి డబ్బులు ఇస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో అయినా దేశ వ్యాప్తంగా అయినా సాధారణంగా మనం టాయిలెట్స్ కి వెళ్లాలంటే కొన్ని ప్రదేశాల్లో ఎంతోకొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే అనుమతి ఉండదు. అక్కడక్కడ పబ్లిక్ టాయ్‌లెట్స్ లో మాత్రం డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. వాటిని మనం ఫ్రీగానే ఉపయోగించుకోవచ్చు. ఇంకా కొన్ని దాబాలు, హోటల్ వద్దకు వెళ్లినప్పుడు కూడా డబ్బులివ్వాల్సి ఉంటుంది. అక్కడే కూర్చున్న మనిషి డబ్బులిస్తేనే గానీ లోపలికి పోనీయడు. ఇలా ఎమర్జెన్సీ వాటికి కూడా డబ్బలను పే చేసే పరిస్థితిలో మనం ఉండాల్సి వచ్చింది. అయితే ఓ ప్రదేశంలో మాత్రం టాయిలెట్ కి వెళ్తే అదే మనకు తిరిగి డబ్బులు ఇస్తుంది. ఇదేదో హీరో సూర్య నటించిన బందోబస్త్ సినిమాలో సీన్ అనుకుంటే పొరపాటే.. అందులో హీరో టాయిలెట్ కి వెళ్లిన ప్రతీ ఒక్కరికి డబ్బులు ఇచ్చి పంపిస్తుంటారు. కారణం ఏంటని ఓ జర్నలిస్టు అడగ్గా ఇలా దానిని ఒక ఎరువుగా మార్చి పంట పొలాలకు ఉపయోగిస్తుంటామని చెబుతుంటారు. ఇలానే ఓ దేశంలో ఇలా టాయిలెట్ ను ఉపయోగించిన వ్యర్థాలను వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

    దక్షిణా కొరియాలో టాయ్‌లెట్‌ ఉపయోగిస్తే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. పైగా మనకే ఎదురు డబ్బులిస్తారు. ఆ టాయ్‌లెట్‌లో ఓ క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే డబ్బులు నేరుగా మీ అకౌంట్‌లో వచ్చి పడతాయి. ఉల్సాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పనిచేసే అర్బన్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ చో జై-వూన్ ఆ టాయ్‌లెట్‌ను రూపొందించారు. ఆ టాయ్‌లెట్ మానవ వ్యర్థాలతో విద్యుత్‌ను తయారు చేస్తుంది. ఈ వింత టాయ్‌లెట్‌ పేరు `ది బీవి టాయ్‌లెట్`. ఆ టాయ్ లెట్ ఉపయోగించిన మానవ వ్యర్థాలను టాయ్‌లెట్ ద్వారా ఒక ట్యాంక్‌లోకి వెళ్లేలా చేస్తారు. వాటికి కొన్ని రకాల సూక్ష్మజీవులను ఊపయోగించి మానవ వ్యర్థాలను మీథేన్‌గా మారుస్తారు. ఆ మీథేన్ సహాయంతో హాట్ బాయిలర్, గ్యాస్ స్టవ్, ఇతర ఎలక్ట్రానిక్ వంటి పరికరాలకు విద్యుత్ ను అందించవచ్చు.


    50 లీటర్ల మీథేన్ 0.5 కిలో వాల్టుల విద్యుత్తును తయారు చేస్తుంది. దాని సహాయంతో 1.2 కిలో మీటర్లు కారును డ్రైవ్ చేయవచ్చు. అలాగే ఎన్నో విద్యుత్ పరికరాలకు శక్తిని అందించవచ్చని జై-వూన్ తెలిపారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉన్న ఈ టాయ్‌లెట్‌ను ఉపయోగించడం ద్వారా విద్యార్థులు వర్చువల్ కరెన్సీని పొందవచ్చు.కాగా..ఓ వ్యక్తి సగటున రోజుకు 500 గ్రాముల మలవిసర్జన చేస్తాడు. దీనిని 50 లీటర్ల మీథేన్ వాయువుగా మార్చవచ్చని పర్యావరణ ఇంజనీర్ తెలిపారు. దీని ద్వారా తయారు అయిన గ్యాస్ 0.5 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు లేదా 1.2 కిలోమీటర్ల  కారును నడపడానికి ఉపయోగించవచ్చని తెలిపారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: South korea

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు