news18-telugu
Updated: November 7, 2020, 10:51 AM IST
ప్రతీకాత్మక చిత్రం
దీపావళి సందర్భంగా పలు ఈ కామర్స్ వెబ్ సైట్స్ బంపర్ ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. తాజాగా paytm కంపెనీ కూడా మంచి ఆఫర్ తో ముందుకు వచ్చింది. సాధారణంగా చాలామంది పండుగ సీజన్లో షాపింగ్ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం కోవిడ్ కారణంగా చాలా మంది ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా పోయాయి. దీంతో చాలా మంది వారి స్నేహితుల వద్దనో, లేక కుటుంబ సభ్యుల వద్ద నుంచో డబ్బు తీసుకుంటారు. కానీ ఇవి కాకుండా, మార్కెట్లో చాలా ఎంపికలు ఉన్నాయి. ఈ రోజుల్లో, దేశంలోని చాలా కంపెనీలు Buy Now Pay later పేరిట లోన్స్ అందిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద ఈ-వాలెట్ సంస్థ అయిన Paytm ఇప్పుడు తాజాగా Paytm Postpaid సేవలను అందిస్తోంది. ఈ ఫెస్టివల్ సందర్భంగా Paytm Postpaid వినియోగదారులకు 1 లక్ష రూపాయల వరకు క్రెడిట్ లిమిట్ అందిస్తున్నాయి. ఈ స్కీంలో వినియోగదారులు తమ క్రెడిట్ లిమిట్ లో ఖర్చు చేసి, తర్వాత వచ్చే నెలలో చెల్లింపులు చేయవచ్చు. మీరు Paytm యాప్ ద్వారా మీరు రీఛార్జ్, బిల్ చెల్లింపులు, లేదా షాపింగ్ మొదలైన వాటిలో Paytm పోస్ట్‌పెయిడ్ సేవ ద్వారా చేయవచ్చు. ప్రత్యేక విషయం ఏమిటంటే, పేటీఎం పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు తమ దగ్గర ఉన్న కిరాణా దుకాణాల్లో కూడా షాపింగ్ చేయవచ్చు.
Paytm Postpaid లో మూడు వేరియంట్లు...Paytm Postpaidలో మొత్తం మూడు వేరియంట్లను కంపెనీ ప్రవేశపెట్టింది. దీని మూడు రకాలు - లైట్, డిలైట్, ఎలైట్ అని యాప్ లో విభాగాలను ప్రవేశపెట్టింది. పోస్ట్‌పెయిడ్ లైట్లో రూ .20,000 పరిమితి ఉంది, దానితో నెలవారీ బిల్లుకు సౌకర్య రుసుము చేర్చుతారు. పోస్ట్‌పెయిడ్ డిలైట్ మరియు పోస్ట్‌పెయిడ్ ఎలైట్ నెలవారీ క్రెడిట్ పరిమితి రూ. 20,000 నుండి రూ .1 లక్ష వరకూ ఉన్నాయి. వీటిపై ఎలాంటి అదనపు చార్జీలు లేవు.
Paytm పోస్ట్‌పెయిడ్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి
సంస్థ క్రమంగా తన వినియోగదారులకు పేటీఎం పోస్ట్‌పెయిడ్ సేవను విస్తరిస్తోంది. మీకు అర్హత ఉంటే, క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించి మీరు Paytm పోస్ట్‌పెయిడ్ సేవను యాక్టివిట్ చేయవచ్చు.
>> Paytm ఖాతాకు లాగిన్ అవ్వండి. సెర్చ్ లో Paytm పోస్ట్‌పెయిడ్ టైప్ చేయండి.
>> అప్పుడు Paytm పోస్ట్‌పెయిడ్ చిహ్నంపై క్లిక్ చేయండి.>> KYC ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, మీ Paytm పోస్ట్‌పెయిడ్ సేవ సక్రియం అవుతుంది.
Published by:
Krishna Adithya
First published:
November 7, 2020, 10:51 AM IST