ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్(TDS- Tax Deducted At Source) రిటర్న్ ఫైల్ చేయడం ఆలస్యం చేసే వ్యక్తులు రోజుకు రూ.200 జరిమానా (Fine)చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ధిష్ఠ జరిమానా రూ.1 లక్ష వరకు ఉండే అవకాశం ఉంది. ఆలస్యంగా దాఖలు చేసిన కారణంగా పన్ను చెల్లింపుదారులు TDSలో క్లెయిమ్(Claim) చేసే మొత్తాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. TDS రిటర్న్ ఫైలింగ్ అనేది ఆదాయ పన్ను శాఖకు ఇవ్వాల్సిన క్వార్టర్లీ స్టేట్‌మెంట్. TDS రిటర్న్‌లు సమర్పించిన తర్వాత, వివరాలు ఫారమ్ 26 ASలో వస్తాయి. TDS రిటర్న్ ఫైలింగ్‌ను ఆలస్యం చేసే పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ జరిమానా విధిస్తుంది.
రోజుకు రూ.200 జరిమానా
ఈ విషయంపై క్లియర్ ట్యాక్స్ వ్యవస్థాపకుడు, సీఈవో అర్చిత్ గుప్తా CNBC-TV18.comతో మాట్లాడుతూ.. ‘TDSని డిడక్ట్ చేసుకోవాల్సిన వ్యక్తి TDS రిటర్న్ ఫైల్ అయ్యే వరకు రోజుకు రూ.200 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 234Eలో ఒక భాగం. జరిమానా మొత్తం పన్నుచెల్లింపుదారుడు TDSగా చెల్లించాల్సిన మొత్తానికి సమానం అయ్యే వరకు.. ఆలస్యమైన ప్రతి రోజుకు TDS డిడక్టర్ జరిమానా చెల్లించవలసి ఉంటుంది’ అని తెలిపారు.
ఉదాహరణకు.. ఓ వ్యక్తి 2022 మే 13న రూ.5,000 TDSని డిడక్ట్ చేసుకుంటే.. 2022 జులై 31న గడువు తేదీకి బదులుగా 2022 నవంబర్ 17న మొదటి త్రైమాసికానికి సంబంధించిన రిటర్న్‌ను ఫైల్ చేశాడనుకుందాం. ఈ ఆలస్యం ఆగస్టు 1 నుంచి నవంబర్ 17 వరకు.. అంటే 109 రోజులుగా లెక్కిస్తారు. అప్పుడు రూ.200 x 109 రోజులు = రూ.21,800 జరిమానా అవుతుంది. అయితే ఈ మొత్తం TDS రూ.5,000 కంటే ఎక్కువగా ఉన్నందున, ఆ వ్యక్తి కేవలం రూ.5,000 మాత్రమే జరిమానా చెల్లించాలి. దీనికి అదనంగా జాప్యానికి వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.
అసెస్సింగ్ అధికారి జరిమానా విధించే అవకాశం
దీంతోపాటు TDS దాఖలు చేయడంలో ఆలస్యం అయినప్పుడు, అసెస్సింగ్ అధికారి(AO) కనీసం రూ.10,000 జరిమానా విధించవచ్చు. ఇది రూ.1 లక్ష వరకు ఉండే అవకాశం కూడా ఉంది. ఈ విభాగం TDS రిటర్న్‌లను తప్పుగా దాఖలు చేసిన కేసులను కూడా కవర్ చేస్తుంది. ఆలస్య రుసుములు, పెనాల్టీల రూపంలో ఈ నష్టాలను నివారించడానికి, పన్ను చెల్లింపుదారులు తమ TDSని నిర్దిష్ట గడువులోగా లేదా అంతకు ముందు దాఖలు చేయాలి. ప్రస్తుతం క్వార్టర్లీ TDS ఫైల్ చేయడానికి మొదటి గడువు తేదీ 2022 జులై 31.
కింది షరతుల మేరకు TDS రిటర్న్‌ను దాఖలు చేయడంలో జాప్యం జరిగినప్పుడు సెక్షన్ 271H కింద ఎటువంటి జరిమానా విధించరని గుర్తించాలి.
- ట్యాక్స్ డిడక్టెడ్/ కలెక్టెడ్ ఎట్ సోర్స్ ప్రభుత్వ క్రెడిట్‌కు చెల్లిస్తారు.
- ఆలస్యంగా దాఖలు చేసే రుసుములు, వడ్డీ (ఏదైనా ఉంటే) ప్రభుత్వ క్రెడిట్‌కు చెల్లిస్తారు.
- TDS/TCS రిటర్న్ పేర్కొన్న గడువు తేదీ నుంచి ఒక సంవత్సరం గడువు ముగిసేలోపు దాఖలు చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Itr deadline, Penalty, Tax benefits, Tds