మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందా? రూ.20 వేల వరకు నష్టపరిహారం

ఫ్లైట్ క్యాన్సిల్ అయిందంటే ప్రయాణికులు తమకు రావాల్సిన టికెట్ డబ్బుల కోసం పోరాడాల్సి వస్తుంది. ప్రయాణికుల కష్టాలు తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం విషయంలో కొన్ని నియమనిబంధనలు రూపొందిస్తోంది.

news18-telugu
Updated: February 7, 2019, 4:40 PM IST
మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందా? రూ.20 వేల వరకు నష్టపరిహారం
ప్రస్తుతం రూ.130 ఉన్న ఫీజును రూ.150కి పెంచింది. ఇది జూలై 1 నుంచి అమల్లోకి రానుంది.
  • Share this:
ఫ్లైట్ క్యాన్సిల్... ఈ మాట వింటే చాలు విమాన ప్రయాణికుల్లో ఒకటే కలవరం. ఇందుకు రెండు కారణాలు. జర్నీ ప్లానింగ్ గందరగోళంగా మారడం ఒక కారణమైతే... ఫ్లైట్ క్యాన్సిల్ అయినందుకు రీఫండ్ వస్తుందో రాదో అన్న ఆందోళన మరో కారణం. కానీ ఇకపై పరిస్థితి మారనుంది. విమాన ప్రయాణికుల హక్కుల్ని కాపాడటం, సౌకర్యాలు మెరుగుపర్చడం కోసం ఎయిర్ ప్యాసింజర్ చార్టర్ ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నెలాఖరులోనే ఇది అమలులోకి రానుంది. ఫ్లైట్ క్యాన్సిల్ అయితే నష్టపరిహారం చెల్లించడం అనేది ఇందులో ప్రధానమైన అంశం.

Read this: మీకు LIC నుంచి SMS వచ్చిందా? రాకపోతే ఇలా చేయండి...

ఫ్లైట్ క్యాన్సిల్ అయిందంటే ప్రయాణికులు తమకు రావాల్సిన టికెట్ డబ్బుల కోసం పోరాడాల్సి వస్తుంది. ప్రయాణికుల కష్టాలు తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం విషయంలో కొన్ని నియమనిబంధనలు రూపొందిస్తోంది. ఒకవేళ ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ప్రయాణికులకు వసతి కల్పించాల్సిన బాధ్యత ఎయిర్‌లైన్స్‌దే. లేకపోతే ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తే ప్రయాణికులకు ఒక్కొక్కరికీ రూ.5,000 నుంచి రూ.20,000 వరకు నష్టపరిహారం చెల్లించాల్సిందే. ఒకవేళ ఎయిర్ ట్రాఫిక్ లేదా వాతావరణం కారణంగా ఫ్లైట్ ఆలస్యంగా నడిస్తే ఎయిర్‌లైన్స్‌ది బాధ్యత ఏమీ ఉండదు. ఇక వీటితో పాటు ఫ్లైట్‌లో ఫలానా సీట్ మాత్రమే కావాలని ఎంచుకుంటే అదనంగా ఛార్జీలు వసూలు చేస్తుంది ఎయిర్‌లైన్స్.

Photos: భారత ప్రభుత్వం ఖజానా నింపుతున్న చారిత్రక కట్టడాలు ఇవే...

ఇవి కూడా చదవండి:

SBI Alert: కార్డు మోసాలు జరుగుతున్నాయి... ఇలా జాగ్రత్తపడండిPaytm SIP Offer: డబ్బులు లేవా? అయినా పెట్టుబడి పెట్టొచ్చు... ఎలాగో తెలుసుకోండి
Published by: Santhosh Kumar S
First published: February 7, 2019, 3:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading