FASTag: గుడ్ న్యూస్... ఫాస్ట్‌ట్యాగ్ పనిచేయకపోతే టోల్ ఫీజు లేకుండా ఫ్రీగా వెళ్లొచ్చు

FASTag | వాహనానికి ఉన్న ఫాస్ట్ ట్యాగ్ పనిచేస్తూ ఉండాలి. ఆ ఫాస్ట్ ట్యాగ్‌లో సరైన బ్యాలెన్స్ ఉండాలి. అలాంటివారికే ఉచితంగా వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.

news18-telugu
Updated: January 14, 2020, 3:27 PM IST
FASTag: గుడ్ న్యూస్... ఫాస్ట్‌ట్యాగ్ పనిచేయకపోతే టోల్ ఫీజు లేకుండా ఫ్రీగా వెళ్లొచ్చు
FASTag: గుడ్ న్యూస్... ఫాస్ట్‌ట్యాగ్ పనిచేయకపోతే టోల్ ఫీజు లేకుండా ఫ్రీగా వెళ్లొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
హైవేలపై వెళ్లే వాహనదారులకు శుభవార్త చెప్పింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI. టోల్ ప్లాజాల దగ్గర ఫాస్ట్‌ట్యాగ్ సరిగ్గా పనిచేయకపోతే ప్రయాణికులు టోల్ ఫీజు చెల్లించకుండా ఫ్రీగా వెళ్లిపోవచ్చని ప్రకటించింది. జనవరి 15 నుంచి హైవేలపై వెళ్లే ప్రతీ వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. అయితే ఫాస్ట్ ట్యాగ్ సరిగ్గా రీడ్ కాకపోతే సమస్యలు వస్తున్నాయి. ఒకవేళ ఫాస్ట్‌ట్యాగ్ రీడ్ కాకపోతే వాహనదారులు ఉచితంగా వెళ్లిపోవచ్చు. ఇందుకోసం నియమనిబంధనల్లో సవరణలు చేసింది. టోల్ ప్లాజాలో ఫాస్ట్‌ట్యాగ్ మెషీన్లు వాహనాలకు ఉన్న ఫాస్ట్‌ట్యాగ్‌ను రీడ్ చేయకపోతే టోల్ ఫీజు లేకుండా వాహనాలు వెళ్లిపోవచ్చు. వాహనానికి ఉన్న ఫాస్ట్ ట్యాగ్ పనిచేస్తూ ఉండాలి. ఆ ఫాస్ట్ ట్యాగ్‌లో సరైన బ్యాలెన్స్ ఉండాలి. అలాంటివారికే ఉచితంగా వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.

జనవరి 15 నుంచి అన్ని వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసింది ఎన్‌హెచ్ఏఐ. ఇకపై జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ గేట్ల దగ్గర ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ ఫీజు వసూలు చేస్తారు. ఒకవేళ ఏదైనా వాహనానికి ఫాస్ట్‌ట్యాగ్ లేకపోతే టోల్ ప్లాజాల దగ్గర తీసుకోవచ్చు. లేదా బ్యాంకులు, ఆర్‌టీఓ ఆఫీసులు, కామన్ సర్వీస్ సెంటర్లు, ట్రాన్స్‌పోర్ట్ హబ్స్, బ్యాంక్ బ్రాంచ్‌లు, ఎంపిక చేసిన పెట్రోల్ బంకులు, వ్యాలెట్ సర్వీసులు అందించే సంస్థల దగ్గర్నుంచి ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలు చేయొచ్చు. వాహనానికి ఫాస్ట్‌ట్యాగ్ లేనివాళ్లు జరిమానాలు చెల్లించక తప్పదు. ఫాస్ట్‌ట్యాగ్ ఎలా తీసుకోవాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్‌తో అదిరిపోయేలా ఫోటోషూట్...రియల్‌మీ ఎక్స్2 ప్రో అద్భుతం



ఇవి కూడా చదవండి:

Fastag Business: ఫాస్ట్‌ ట్యాగ్ బిజినెస్‌కు రూ.50,000 చాలు... చేయండి ఇలా

SBI: పండుగ పూట షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ... కస్టమర్లకు నష్టమేGold: మార్కెట్ రేట్ కన్నా రూ.1,800 తక్కువ ధరకే బంగారం... కొనండి ఇలా
First published: January 14, 2020, 3:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading