HOME »NEWS »BUSINESS »if amount reverted to your account for atm transaction failed banks will compensate for delay ss gh

ATM Transaction Failed: అకౌంట్‌లో డబ్బులు కట్ అయినా ఏటీఎంలో క్యాష్ రాలేదా? టెన్షన్ వద్దు

ATM Transaction Failed: అకౌంట్‌లో డబ్బులు కట్ అయినా ఏటీఎంలో క్యాష్ రాలేదా? టెన్షన్ వద్దు
ATM Transaction Failed: అకౌంట్‌లో డబ్బులు కట్ అయినా ఏటీఎంలో క్యాష్ రాలేదా? టెన్షన్ వద్దు (ప్రతీకాత్మక చిత్రం)

ATM Transaction Failed | ఏటీఎంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందా? అకౌంట్‌లో డబ్బులు కట్ అయినా మెషీన్‌లోంచి రాలేదా? ఆర్‌బీఐ చెబుతున్న ఈ విషయం గుర్తుంచుకోండి.

  • Share this:
ఏటీఎంల్లో డబ్బు తీసుకునేటప్పుడు సాంకేతిక సమస్య తలెత్తిందా? సొమ్ము ఖాతా నుంచి కట్ అయినా ఏటీఎం సాంకేతిక సమస్య వల్ల డబ్బు తీసుకోలేకపోయారా? అయితే ఇప్పుడు ఆందోళన అవసరం లేదు. సంబంధిత బ్యాంకు ఖాతాదారుడినికి ఆ మొత్తాన్ని నిర్దిష్ట కాలపరిమితిలో చెల్లిస్తుంది. ఒకవేళ ఇచ్చిన సమయంలోపు బ్యాంకు డబ్బు చెల్లించలేక పోతే... ఆలస్యమైన సమయానికి అదనపు మొత్తాన్ని ఖాతాదారుడికి పరిహారంగా చెల్లిస్తుంది. ఈ విషయాన్ని ఆర్బీఐ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. లావాదేవీలు వైఫల్యం (ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్) చెందినపుడు సొమ్మును బ్యాంకులు ఖాతాదారుడికి రివర్ట్ చెస్తాయని, ఒకవేళ నిర్దిష్ట సమయంలో చెల్లించలేకపోతే.. ఆలస్యమైనందుకు అదనపు మొత్తాన్ని ఖాతాదారుడికి బ్యాంకులే స్వయంగా పరిహారంగా ఇస్తాయని ఆర్‌బీఐ ట్వీట్ చేసింది.

Money Transfer: మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? గుడ్ న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ



Savings Scheme: ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు రెండింతలవుతుంది


డబ్బు రిఫండ్ కావాలంటే చేయాల్సిన పనులు..


ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే బ్యాంకులే ఆ సొమ్మును నిర్దిష్ట కాలపరిమితిలో చెల్లిస్తాయి. కార్డు జారీచేసే బ్యాంకు లేదా ఏటీఎం యజమాని ఈ అంశంలో ఫిర్యాదు చేయడం మంచిదని రిజర్వ్ బ్యాంకు స్పష్టం చేసింది. ఆర్బీఐ ప్రకారం లావాదేవీలు విఫలమైనప్పుడు జరిగిన తేదీ నుంచి 5 క్యాలెండర్ రోజుల్లోపు బ్యాంకులు తప్పనిసరిగా ఖాతాదారుడి ఖాతాలో సొమ్మును తిరిగి క్రెడిట్ చేయాలి. 5 క్యాలెండర్ రోజుల్లోపు వినియోగదారుడికి సొమ్ము జమచేయడంలో ఆలస్యమైతే రోజు రూ.100లు చొప్పున పరిహారం చెల్లించాలి. ఖాతాదారుడు ఈ విషయానికి సంబంధించి తన బ్యాంకు సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. బ్యాంకు నుంచి ప్రత్యుత్తరం వచ్చిన 30 రోజుల్లోపు లేదా 30 రోజుల్లో బ్యాంకు నుంచి జవాబు రాకపోయినట్లయితే వినియోగదారుడు బ్యాంకు అంబుడ్స్ మన్ సహాయం తీసుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:October 09, 2020, 12:38 IST