IDFC Mutual Fund: ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ SIPని లాంచ్ చేసిన ఐడీఎఫ్‌సీ

ప్రతీకాత్మక చిత్రం

మ్యూచువల్ ఫండ్లలో ముఖ్యంగా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎస్ఐపీని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇది అస్థిరత్వం లేదా ప్రస్తుత మార్కెట్ ఒడుదొడుకుల అనుగుణంగా రెగ్యులర్ గా పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుంది.

  • Share this:
    మ్యూచవల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రస్తుతం ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా ఐడీఎఫ్సీ మ్యూచవల్ ఫండ్ కొత్త విధానాన్ని ప్రారంభించింది. సిస్టమాటిక్ ఇన్వెంస్ట్ మెంట్ ప్రణాళికల ద్వారా పెట్టుదారులు స్థిర ఆదాయాన్ని పొందేందుకు వారికి అవగాహన కల్పించేలా సిఫి(ఎస్ఐఎఫ్ఐ) లేదా స్థిర ఆదాయంలో సిప్(ఎస్ఐపీ)ని తీసుకొచ్చింది. ఈ విషయం గురించి ఐడీఎప్సీ సీఈఓ విషాల్ కపూర్ తన స్పందనను తెలియజేశారు. "ఎస్ఐపీల గురించి చాలా మందికి అవగాహన లేదు. మెరుగైన రాబడిని పొందడానికి సిఫి సహాయపడుతుంది. అంతేకాకుండా డెబ్ట్ ఫండ్ లో ఎస్ఐపీ ఈక్విటీ మార్కెట్లలో ఎక్కువ అస్థిరత ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ విధాన సహాయపడుతుంది. తద్వారా మీ కేటాయింపులు ఇది సమతూల్యం చేస్తుంది" అని ఆయన అన్నారు.

    చాలా మంది ఔత్సాహికులు మ్యూచువల్ ఫండ్లలో ముఖ్యంగా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎస్ఐపీని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇది అస్థిరత్వం లేదా ప్రస్తుత మార్కెట్ ఒడుదొడుకుల అనుగుణంగా రెగ్యులర్ గా పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. ఏదిఏమైనప్పటికీ ఈక్విటీల కంటే డెబ్డ్ మ్యూచువల్ ఫండ్లు తక్కువ అస్థిరతను కలిగి ఉన్న కారణంగా ఎస్ఐపీ పెట్టుబడులు అంత ప్రబలంగా లేవు.
    గడ్డు పరిస్థితుల్లో సర్దుబాటు చేయడానికి ఉద్దేశించబడింది.

    మార్కెట్ ఒడుదొడుకుల సందర్భాల్లో పెట్టుబడుదారులు ఎక్కువగా ఆగిపోవడానికి లేదా నిలిపివేయడానికే మొగ్గుచూపుతున్నారని ఇండస్ట్రీ డేటా సూచిస్తుందని విశాల్ తెలిపారు. ముఖ్యంగా తగ్గిపోవడాన్ని పెట్టుబడుదారులు తట్టుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. ఇన్వెస్టర్లు స్థిర ఆదాయాన్ని కలిగి ఉండాలని, మార్కెట్ తిరోగమించే సమయంలో ఎస్ఐపీ రాబడి తక్కువగా ఉన్నప్పుడు కేటాయింపును సమతూల్యం చేయడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. మార్కెట్ అల్లకల్లోల పరిస్థితుల్లో పెట్టుబడుదారులకు ఈక్విటీ, డెబ్డ్ ఎస్ఐపీల గురించి సరైన సమాచారం తెలియజేయానికే ఈ స్థిర ఆదాయం విధానం(సిఫి)ని ముందుకు తీసుకొచ్చినట్లు తెలిపారు.

    స్థిర ఆదాయ నిధులు పెట్టుబడుదారులకు అవసరమైన స్థిరత్వాన్ని అందించడంలో సహాయపడతాయని ఫండ్ హౌండ్ పేర్కొంది. అయితే చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు డెబ్ట్ ఫండ్‌ను లంప్ సమ్ బేసిస్ విధానంలో చేస్తారని తెలిపింది. వడ్డీ రేటు కదిలికలను సద్వినియోగం చేసుకోవడానికి రుణాల్లో అస్థిరతను పరిష్కరించడానికి ఎస్ఐపీ నిజంగా సహాయపడతాయని ఫండ్ హౌస్ స్పష్టం చేసింది. చాలా మంది ఈ ఎస్ఐపీని ఈక్వీటీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు అనుబంధంగా చూస్తారని ఫండ్ హౌస్ పేర్కొంది.
    Published by:Shiva Kumar Addula
    First published: