HOME »NEWS »BUSINESS »idfc first bank offering lifetime free credit cards with lower interest rates ss

IDFC First Bank: ఉచితంగా క్రెడిట్ కార్డ్... ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సంచలనం

IDFC First Bank: ఉచితంగా క్రెడిట్ కార్డ్... ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సంచలనం
IDFC First Bank: ఉచితంగా క్రెడిట్ కార్డ్... ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సంచలనం (image: IDFC First Bank)

IDFC First Bank Lifetime Free Credit Card | లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఆఫర్ చేస్తోంది ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్. ఈ క్రెడిట్ కార్డుతో ఏఏ లాభాలు ఉంటాయో తెలుసుకోండి.

  • Share this:
    మీరు క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారా? క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే యాన్యువల్ ఛార్జీలు చెల్లించాలి. గడువులోగా పేమెంట్ చేయకపోతే పెనాల్టీ చెల్లించాలి. ఈఎంఐగా కన్వర్ట్ చేస్తే ఏటా 36 శాతం వరకు వడ్డీ చెల్లించాలి. ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా దాదాపు ఈ రూల్స్ అన్నీ ఉంటాయి. కానీ క్రెడిట్ కార్డ్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించడమే కాదు, క్రెడిట్ కార్డ్స్ ఆఫర్ చేస్తున్న బ్యాంకులకు షాకిచ్చేందుకు కసరత్తు చేస్తోంది ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్. ఎలాంటి ఛార్జీలు లేకుండా క్రెడిట్ కార్డ్స్ ఆఫర్ చేయనుంది. అంటే లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఇస్తామంటోంది. అంటే ప్రతీ ఏడాది కస్టమర్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఈ ఛార్జీలు రూ.250 నుంచి రూ.1500 వరకు ఉంటాయి. ఇక క్రెడిట్ కార్డుతో క్యాష్ విత్‌డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించాలి. కానీ వడ్డీ లేని క్యాష్ అడ్వాన్స్ ఇస్తామని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ప్రకటించింది. 48 రోజుల లోపు అయితే వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు.

    SBI Flexi Deposit Scheme: కనీసం రూ.500 జమ చేయగలరా? ఈ స్కీమ్ మీకోసమే



    NPS Scheme: ప్రైవేట్ ఉద్యోగుల కోసం ఈ స్కీమ్... మీరూ చేరండి ఇలా

    ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు త్వరలో రాబోతున్నాయి. బ్యాంకు వెబ్‌సైట్‌లో క్రెడిట్ కార్డ్ సెక్షన్‌ను ప్రారంభించింది. FIRST Millennia Credit Card, FIRST Classic Credit Card, FIRST Select Credit Card, FIRST Wealth Credit Card పేర్లతో నాలుగు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. వీటిని త్వరలో లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించింది. కార్డును బట్టి బెనిఫిట్స్ ఉంటాయి. యువతను ఆకట్టుకునేందుకు ఫస్ట్ మిలీనియా క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తోంది. రూ.20,000 కన్నా ఎక్కువ ఖర్చు చేస్తే రివార్డ్ పాయింట్స్ 10 రెట్లు వస్తాయి. ఆన్‌లైన్‌లో ఖర్చు చేస్తే 6 రెట్లు రివార్డ్స్ వస్తాయి. ఇది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. ఓవర్ లిమిట్ ఫీజు లేదు. క్రెడిట్ కార్డ్ వడ్డీ రేటు 0.75% నుంచి 2.99% మధ్య ఉంటుంది. రివార్డ్ రిడెంప్షన్ ఫీజు కూడా లేదు. లేట్ పేమెంట్ ఫీజు టోటల్ అమౌంట్ డ్యూలో 15 శాతం ఉంటుంది. కనీసం రూ100 నుంచి గరిష్టంగా రూ.1000 మధ్యే ఈ ఫీజు ఉంటుంది. ఇతర కార్డులపైనా బెనిఫిట్స్ దాదాపుగా ఇలాగే ఉన్నాయి.

    LPG Gas Cylinder: ఆఫర్ పొడిగించిన పేటీఎం... ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందండి ఇలా

    Aadhaar Card: ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ ఆన్‌లైన్‌లోనే మార్చేయండి ఇలా

    ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై కనీస వడ్డీ రేటు నెలకు 0.75 శాతం. అంటే ఏడాదికి 9 శాతం మాత్రమే. పర్సనల్ వడ్డీ రేటు కన్నా ఇది చాలా తక్కువ. ప్రస్తుతం పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 10 శాతం నుంచి మొదలవుతున్నాయి. అది కూడా క్రెడిట్ స్కోర్ బాగుంటేనే తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్ వస్తుంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కూడా క్రెడిట్ స్కోర్‌ను బట్టి క్రెడిట్ కార్డుపై వడ్డీ రేటు ఫిక్స్ చేసే అవకాశముంది.
    Published by:Santhosh Kumar S
    First published:January 23, 2021, 18:28 IST