IDFC FIRST BANK HAS ANNOUNCED THAT IT WILL BE DISTRIBUTING RATION GOODS FREE OF COST TO ITS CUSTOMERS VB
Free Ration for Bank Customers: ఆ బ్యాంకు కస్టమర్లకు ఉచిత రేషన్ కిట్లు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
Free Ration for Bank Customers: కోవిడ్ 19 ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆ బ్యాంకు తమ కస్టమర్లకు ఉచితంగా రేషన్ సరుకులను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇబ్బందులో ఉన్న వారు బ్యాంక్‌కు వెళ్లి ఈ రేషన్ కిట్లు ఉచితంగా పొందొచ్చని తెలిపారు. వివరాలిలా..
కరోనా మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ విపరీతంగా విరుచుకుపడింది. ఈ సారి కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. అయితే పలు రాష్ట్రాలు విధించిన లాక్ డౌన్ కారణంగా చాలామంది ఇంటి దగ్గరే ఉండిపోయారు. ఇలా వారికి ఉపాధి బారమై కనీస నిత్యావసర సరుకులు కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు తమవంతుగా సహాయాన్ని అందించాయి. కొంత మంది నాయకులు తమకు తోచిన విధంగా సహాయం చేస్తూ వస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నవంబర్ 2021 వరకు రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత రేషన్ తో పాటు రాష్ట్రకోటా కింద జూన్ , జూలై నెలలకు సంబంధించి ఉచితంగా రేషన్ పంపిణీ చేయనున్నది. అయితే ఇప్పటికే జూన్ నెల రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఓ బ్యాంకు తమ కస్టమర్లకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది.
అదేంటంటే ఉచితంగా రేషన్ సరుకులను అందించాలని నిర్ణయం తీసుకుంది. కోవిడ్ 19 ప్రతీ కూల పరిస్థితుల నేపథ్యంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఈ ప్రకటన చేసింది. ఉచితంగానే రేషన్ సరుకులు అందిస్తామని తెలిపింది. ఇబ్బందులో ఉన్న వారు బ్యాంక్‌కు వెళ్లి ఈ రేషన్ కిట్లు ఉచితంగా పొందొచ్చని తెలిపారు. ఈ బ్యాంక్ ఘర్ ఘర్ రేషన్ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బ్యాంక్ తక్కువ ఆదాయం కలిగిన కస్టమర్లకు సాయం అందిస్తోంది. వారి కుటుంబాలకు ఉచితంగానే వంట సరుకులు అందిస్తోంది. బ్యాంక్ తన ఉద్యోగులు అందించిన డబ్బులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ బ్యాంకు దాదాపు 50 వేల మందికి ఉచితంగానే రేషన్ సరుకులను అందించనుంది.
ఈ రేషన్ కిట్లలో బిస్కెట్లు , టీ ప్యాకెట్, ఒక కేజీ వంట నూనె, 5 ప్యాకెట్ల మసాలా దినుసులు, 10 కేజీల బియ్యం, 2 కేజీల కంది పప్పు, ఒక కేజీ చక్కెర, ఉప్పు, ఇతర నిత్యావసరాలు ఉంటాయి. కోవిడ్ 19 వల్ల ఇబ్బందులు పడుతున్న బ్యాంక్ కస్టమర్లు నేరుగా బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి రేషన్ కిట్లను పొందొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే నేరుగా కస్టమర్లకు ఈ రేషన్ కిట్లను అందిస్తున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.1800 ప్రిపెయిడ్ కార్డ్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటికే 1000 మందికి ఈ రేషన్ కిట్లను అందించారు. కస్టమర్ల సంక్షేమమే బ్యాంక్ ధ్యేయమని వారు తెలిపారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.